Tata Altroz sport : టాటా ఆల్ట్రోజ్ నుంచి కొత్త వేరియంట్.. 'స్పోర్ట్' వస్తోంది!
07 January 2023, 13:45 IST
- Tata Altroz sport variant : టాటా ఆల్ట్రోజ్ స్పోర్ట్ వేరియంట్‌ను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు..
టాటా ఆల్ట్రోజ్
Tata Altroz sport variant : త్వరలో ప్రారంభంకానున్న 2023 ఆటో ఎక్స్‌పోపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆటో సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్‌కు సంబంధించిన ఓ వార్త బయటకొచ్చింది. టాటా ఆల్ట్రోజ్ నుంచి కొత్త వేరియంట్ రాబోతోందని.. దాన్ని ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నారని సమాచారం.
టాటా ఆల్ట్రోజ్ స్పోర్ట్..
సంబంధిత వర్గాల ప్రకారం.. ఈ టాటా ఆల్ట్రోజ్ స్పోర్ట్ వేరియంట్లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండొచ్చు. నెక్సాన్‌లో కూడా ఇదే ఇంజిన్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో 6 స్పీడ్ మేన్యువల్ ట్రాన్స్మిషన్ సెటప్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్.. 110పీఎస్ పవర్‌ను ,140ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తోంది. 5స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ ఇందులో ఉంటుంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్‌కు సంబంధించిన పర్ఫార్మెన్స్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.
2023 Auto Expo Tata Motors : ఇక టాటా ఆల్ట్రోజ్ సాధారణ వేరియంట్‌తో పోల్చుకుంటే.. ఆల్ట్రోజ్ స్పోర్ట్‌లో ఫీచర్స్ కొన్ని మారే అవకాశం ఉంది. బంపర్, బ్యాడ్జీలు, ఆలోయ్ వీల్స్, బాడీ డీకెల్స్లో మార్పులు కనిపించవచ్చు. ఇక క్యాబిన్ కూడా అప్డేట్ అవ్వొచ్చు. మరింత స్పోర్టీ, స్టైలిష్ లుక్ వచ్చే అవకాశం ఉంది.
ఇక ఈ పవర్ఫుల్ టర్బో ఇంజిన్‌తో ఈ టాటా స్పోర్ట్ వేరియంట్.. హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్‌కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
2023 ఆటో ఎక్స్‌పోలో పదర్శనకు ఉంచితే.. రానున్న రోజుల్లో టాటా స్పోర్ట్ వేరియంట్‌పై మరింత సమాచారం అందుబాటులోకి రావొచ్చు.
కియా సొరెంటో ఎస్యూవీ..
Kia Sorento SUV : కియా మోటార్స్ నుంచి 7 సీటర్ సొరెంటో కూడా ఈ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు రానున్నట్టు తెలుస్తోంది.
సొరెంటో ఎస్యూవీ ఫోర్త్ జనరేషన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో 2020లోనే లాంచ్ చేసింది కియా. కాగా.. ఇండియాలో ఇప్పటివరకు ఇది లాంచ్ అవ్వలేదు. ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయంపై స్పష్టత లేదు. అయితే.. త్వరలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో దీనిని ప్రదర్శించి, కస్టమర్ల నుంచి వస్తున్న స్పందనను తెలుసుకోవాలని భావిస్తోంది. ఇక్కడ హిట్ అయితే.. మరి కియా సొరెంటో ఎస్‌యూవీని ఇండియా రోడ్లపై చూసే అవకాశం లేకపోలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.