తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ఈ రూ. 570 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు..!

Stocks to buy today : ఈ రూ. 570 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు..!

Sharath Chitturi HT Telugu

16 April 2024, 9:02 IST

    • Stocks to buy today : స్టాక్​ మార్కెట్​ ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్​ టు బై లిస్ట్​..
స్టాక్స్​ టు బై లిస్ట్​..

స్టాక్స్​ టు బై లిస్ట్​..

Stocks to buy today : ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీగా నష్టపోయాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 845 పాయింట్లు కోల్పోయి 73,400 వద్ద స్థిపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 247 పాయింట్ల నష్టంతో 22,272 వద్ద ముగిసింది. ఇక 791 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్​ నిఫ్టీ.. 47,773 వద్దకు చేరింది.

ట్రెండింగ్ వార్తలు

Gold price today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

Trading Guide: ఎన్టీపీసీ, వీ గార్డ్ సహా ఈ 8 స్టాక్స్ పై ఈ రోజు దృష్టి పెట్టండి

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య ఉద్రిక్తతలు శాంతించేంత వరకు.. దేశీయ స్టాక్​ మార్కెట్​లతో పాటు అంతర్జాతీయ మార్కెట్​లలో అనిశ్చితి, ఒదుడొకులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ట్రేడర్లు, మదుపర్లు అలర్ట్​గా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,268 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4762.93 కోట్లు విలువ చేసే షేర్లను కొనగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని సైతం భారీ నష్టాల్లో మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్టీ నిఫ్టీ దాదాపు 120 పాయింట్ల నష్టంలో ఉండటమే ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల మధ్య.. అమెరికా స్టాక్​ మార్కెట్​లు సైతం సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టపోయాయి. డౌ జోన్స్​ 0.65శాతం పడింది. ఎస్​ అండ్​ పీ 500 1.2శాతం, నాస్​డాక్​ 1.79శాతం మేర నష్టపోయాయి.

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

Intraday Stocks to buy : కోల్గోట్​ పాల్మోలివ్​:- బై రూ. 2673.30, స్టాప్​ లాస్​ రూ. 2585, టార్గెట్​ రూ .2820

గుజరాత్​ గ్యాస్​:- బై రూ. 573, స్టాప్​ లాస్​ రూ. 546, టార్గెట్​ రూ. 620

మంగళం సిమెంట్​:- బై రూ. 854- రూ. 856, స్టాప్​ లాస్​ రూ. 829,

సింగ్నిటి టెక్నాలజీస్​:- బై రూ. 1273- రూ. 1275, స్టాప్​ లాస్​ రూ. 1240, టార్గెట్​ రూ. 1330

(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం