Sensex crosses 72,000 mark: తొలి సారి 72 వేల మార్క్ ను దాటేసిన సెన్సెక్స్
27 December 2023, 16:49 IST
Sensex crosses 72,000 mark: స్టాక్ మార్కెట్లో బుల్ ర్యాలీ కొనసాగుతోంది. గత నాలుగు సెషన్లుగా లాభాల పరుగు కొనసాగుతోంది. బుధవారం తొలి సారి బీఎస్ఈ సెన్సెక్స్ 72 వేల మేజిక్ మార్క్ ను దాటేసింది.
ప్రతీకాత్మక చిత్రం
Sensex crosses 72,000 mark: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) 30 షేర్ల సెన్సెక్స్ సూచీ బుధవారం తొలిసారిగా 72,000 మార్కును దాటి 72,038 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 71,000 మార్కును తాకిన 12 రోజుల తర్వాత ఈ చరిత్రాత్మక ఫీట్ సాధించింది.
నిఫ్టీ ఆల్ టైం హై
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) స్టాక్ సూచీ నిఫ్టీ (Nifty) 213.40 పాయింట్లు జంప్ చేసి 21,654.75 పాయింట్ల ఆల్ టైమ్ హై వద్ద స్థిరపడింది. అంతకుముందు రోజే నిఫ్టీ 21,600 పాయింట్ల ఆల్ టైమ్ హైని సాధించింది. బుధవారం సెన్సెక్స్ (Sensex) 783.05 పాయింట్లు లేదా 1.09 శాతం పెరిగి ఇంట్రా-డే జీవితకాల గరిష్ట స్థాయి 72,119.85కి చేరుకుంది.
ఈ స్టాక్స్ కు భారీ లాభాలు
బీఎస్‌ఈలో అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లార్సెన్ అండ్ టూబ్రో, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ లాభాలతో ముగిశాయి. యూరోప్ మార్కెట్లు ఎక్కువగా సానుకూలంగా ట్రేడవుతున్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి.
అమెరికా ద్రవ్యోల్బణ అంచనా
దేశీయ మార్కెట్ కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. గత వారం పొందిన నష్టాలను సులభంగా తిరిగి వెనక్కు తీసుకుంది. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గే అంచనాల మధ్య ఈ అప్ ట్రెండ్ కొనసాగుతోంది. బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 289.93 పాయింట్లు పెరిగి 71,626.73 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 90.45 పాయింట్లు పెరిగి 21,531.80 వద్దకు చేరుకుంది. బీఎస్‌ఈలో అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా మోటార్స్, లార్సెన్ అండ్ టూబ్రో, పవర్ గ్రిడ్ లాభపడ్డాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) మంగళవారం రూ. 95.20 కోట్ల విలువైన ఈక్విటీలను ఆఫ్‌లోడ్ చేశారు.