Samsung Galaxy M14 5G: సామ్‍సంగ్ గెలాక్సీ ఎం14 5జీ లాంచ్ రేపే.. ఈ ధర రేంజ్‍లోనే!
16 April 2023, 14:45 IST
- Samsung Galaxy M14 5G : సామ్‍సంగ్ గెలాక్సీ ఎం14 5జీ రేపు (ఏప్రిల్ 17) లాంచ్ కానుంది. అయితే, ఈలోగానే ఈ ఫోన్‍కు సంబంధించిన కొన్ని వివరాలు బయటికి వచ్చాయి.
Samsung Galaxy M14 5G: సామ్‍సంగ్ గెలాక్సీ ఎం14 5జీ లాంచ్ రేపే (Photo: Samsung)
Samsung Galaxy M14 5G : ప్రముఖ సంస్థ సామ్‍సంగ్ నుంచి బడ్జెట్ రేంజ్‍లో మరో 5జీ ఫోన్ (Budget 5G Phone) వస్తోంది. సామ్‍సంగ్ గెలాక్సీ ఎం14 5జీ (Samsung Galaxy M14 5G) మొబైల్ రేపు (ఏప్రిల్ 17) ఇండియాలో లాంచ్ కానుంది. గెలాక్సీ ఎం13 5జీకి ఇది సక్సెసర్‌గా అడుగుపెడుతోంది. ఇప్పటికే గ్లోబల్‍గా విడుదలవటంతో సామ్‍సంగ్ గెలాక్సీ ఎం14 5జీకి సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి. 6000mAh బ్యాటరీతో ఈ మొబైల్ రానుంది. Samsung Galaxy M14 5G వివరాలివే.
సామ్‍సంగ్ గెలాక్సీ ఎం14 5జీ లాంచ్ వివరాలు
Samsung Galaxy M14 5G launch: సామ్‍సంగ్ గెలాక్సీ ఎం14 5జీ ఇండియాలో రేపు (ఏప్రిల్ 17) మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్, సామ్‍సంగ్ అఫీషియల్ వెబ్‍సైట్‍తో పాటు రిటైల్ స్టోర్లలోనూ ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది.
సామ్‍సంగ్ గెలాక్సీ ఎం14 5జీ ధర
Samsung Galaxy M14 5G Price: సామ్‍సంగ్ గెలాక్సీ ఎం14 5జీ మొబైల్ ప్రారంభ ధర రూ.14వేలలోపే ఉండనుంది. బేస్ వేరియంట్ రేటు రూ.13,499 నుంచి రూ.13,999 మధ్య ఉండే అవకాశం ఉందనే అంచనాలు వచ్చాయి. సిల్వర్, బ్లూ, డార్క్ బ్లూ షేడ్లలో ఈ మొబైల్ రానుంది.
Samsung Galaxy M14 5G : 6.6 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ IPS LCD డిస్‍ప్లేతో సామ్‍సంగ్ గెలాక్సీ ఎం14 5జీ రానుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ మొబైల్‍లో 6,000mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ ఈ మొబైల్‍లో ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్‍యూఐ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‍తో అడుగుపెడుతుంది.
Samsung Galaxy M14 5G :సామ్‍సంగ్ గెలాక్సీ ఎం14 5జీ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉండనుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుందని సమాచారం. ఈ ఫోన్‍లో మైక్రో ఎస్‍డీ కార్డ్ స్లాట్ ఉండనుంది.
Samsung Galaxy M14 5G : 5జీ, 4జీ ఎల్‍టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్‍ఎఫ్‍సీ, యూఎస్‍బీ టైప్-సీ పోర్టుతో సామ్‍సంగ్ గెలాక్సీ ఎం14 5జీ ఫోన్ రానుంది. పవర్ బటన్‍కే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండే అవకాశం ఉంది.