తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy A05s: భారత్ లో గెలాక్సీ ఏ 05 ఎస్ 4 జీబీ ర్యామ్ మోడల్ ను లాంచ్ చేసిన సామ్సంగ్

Samsung Galaxy A05s: భారత్ లో గెలాక్సీ ఏ 05 ఎస్ 4 జీబీ ర్యామ్ మోడల్ ను లాంచ్ చేసిన సామ్సంగ్

HT Telugu Desk HT Telugu

07 November 2023, 19:22 IST

google News
  • Samsung Galaxy A05s: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ సామ్సంగ్ తమ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏ 05 ఎస్ (Samsung Galaxy A05s) లో 4 జీబీ ర్యామ్ మోడల్ ను భారత మార్కెట్లో మంగళవారం లాంచ్ చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Samsung)

ప్రతీకాత్మక చిత్రం

Samsung Galaxy A05s: అందుబాటు ధరలో, అద్భుతమైన ఫీచర్స్ తో లేటెస్ట్ గా రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్ ను కొనడం కోసం చూస్తున్నారా? మీ కోసమే గెలాక్సీ ఏ 05 ఎస్ (Samsung Galaxy A05s) లో 4 జీబీ ర్యామ్ మోడల్ ను సామ్సంగ్ విడుదల చేసింది.

ఇప్పటివరకు 6 జీబీ..

ఇప్పటివరకు భారత్ మార్కెట్లో గెలాక్సీ ఏ 05 ఎస్ (Samsung Galaxy A05s) లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు తాజాగా, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ను కూడా లాంచ్ చేసింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ వయెలెట్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది.

ఫీచర్స్..

లేటెస్ట్ గా లాంచ్ చేసిన సామ్సంగ్ గెలాక్సీ ఏ 05 ఎస్ లో హై-రిజల్యూషన్ 50MP ప్రధాన కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. ఇది 2MP డెప్త్ మరియు 2MP మాక్రో కెమెరాలతో వస్తుంది. ఇందులో సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఉంది. సామ్సంగ్ గెలాక్సీ ఏ 05 ఎస్ స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ తో 6.71-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో వస్తుంది.

రెండు రోజుల బ్యాటరీ

Galaxy A05s భారీ 5000 mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ బ్యాటరీ సులభంగా 2 రోజుల వరకు ఉంటుందని సామ్సంగ్ పేర్కొంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 25W సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్‌ ఫెసిలిటీ ఉంది. ఇందులో 6 ఎన్ఎం క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంది. లేటెస్ట్ 4 జీబీ ర్యామ్ మోడల్ ఎంట్రీతో ఈ గెలాక్సీ ఏ 05 ఎస్ ఇప్పుడు రెండు మెమరీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి 6 జీబీ+128 GB, అలాగే 4+128 GB.

ధరలు..

సామ్సంగ్ గెలాక్సీ ఏ 05 ఎస్ 4GB+128 GB వేరియంట్ ధర రూ.13499 కాగా, సామ్సంగ్ గెలాక్సీ ఏ 05 ఎస్ 6GB+128 GB వేరియంట్ ధర రూ.14999గా ఉంది. సామ్సంగ్ స్టోర్స్ లో, Samsung.com, ఇతర ఆన్‌లైన్ పోర్టల్‌లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వినియోగదారులు నెలకు రూ.1150 ఈఎంఐ చెల్లిస్తూ కూడా ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. అదనంగా, . SBI క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే, వినియోగదారులు రూ. 1000 క్యాష్‌బ్యాక్‌ని పొందవచ్చు.

తదుపరి వ్యాసం