Rupee falls below 83: డాలరు కావాలా బాబూ.. 83 రూపాయలే..
19 October 2022, 17:28 IST
- Rupee falls below 83: డాలరు విలువ పెరుగుతుంటే.. రూపాయి విలువ తగ్గుతోంది. ఒక డాలరు విలువ ప్రస్తుతం అక్షరాల 83 రూపాయలకు పడిపోయింది.
డాలరుతో పోలిస్తే జీవిత కాలపు కనిష్టానికి పడిపోయిన రూపాయి
ముంబయి, అక్టోబరు 19: అమెరికా ట్రెజరీ దిగుబడులు పెరగడం వల్ల డాలర్ మరింత బలపడడంతో భారతీయ కరెన్సీ రూపాయి విలువ బుధవారం మొదటిసారిగా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 83 రూపాయల దిగువకు పడిపోయింది.
రూపాయి మొదటిసారిగా 61 పాయింట్లు పడిపోయి డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 83.01 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ధరలు పెరగడం, ఇన్వెస్టర్లలో రిస్క్ రహిత ఇన్వెస్టమెంట్లపై సెంటిమెంట్ పెరగడం స్థానిక కరెన్సీపై ప్రభావం చూపాయని ట్రేడర్లు తెలిపారు. తాజా ద్రవ్యోల్బణం గణాంకాలను అనుసరించి వచ్చే నెలలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేటు పెంచే అవకాశం ఉంది. మరోవైపు డాలర్ ఇండెక్స్ 0.31 శాతం పెరిగి 112.48కి చేరుకుంది.
గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.82 శాతం పెరిగి 90.77 డాలర్లకు చేరుకుంది.
దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో 30-షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 146.59 పాయింట్లు (0.25 శాతం) లాభపడి 59,107.19 వద్ద ముగియగా, విస్తృత ఎన్ఎస్ఈ నిఫ్టీ 25.30 పాయింట్లు (0.14 శాతం) పురోగమించి 17,512.25 వద్దకు చేరుకుంది.