RunR HS EV Electric Scooter: 110 కిలోమీటర్ల రేంజ్‍తో రన్ఆర్ హెచ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: వివరాలివే
25 May 2023, 11:20 IST
- RunR HS EV Electric Scooter: రన్ఆర్ హెచ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‍లోకి వచ్చేసింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.
RunR HS EV Electric Scooter: 110 కిలోమీటర్ల రేంజ్‍తో రన్ఆర్ హెచ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్
RunR HS Electric Scooter: ఈవీ స్టార్టప్ రన్ఆర్ మొబిలిటీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. రన్ఆర్ హెచ్ఎస్ ఈవీ పేరుతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే బ్యాటరీని ఈ స్కూటర్ కు పొందుపరిచినట్టు ఆ కంపెనీ వెల్లడించింది. ఐదు కలర్ ఆప్షన్‍లలో ఈ స్కూటర్ అడుగుపెట్టింది. వివరాలివే.
రన్ఆర్ హెచ్ఎస్ ఈవీ బ్యాటరీ, పర్ఫార్మెన్స్
60V 40 AH లిథియమ్ అయాన్ బ్యాటరీతో రన్ఆర్ హెచ్ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. బీఎంఎస్ ఫీచర్ కూడా ఉంటుంది. రైడర్‌కు రియల్ టైమ్ బ్యాటరీ ఇన్ఫర్మేషన్‍ను ఈ బీఎంఎస్ టెక్నాలజీ చూపిస్తుంది. 1.5 kw BLDC మోటార్ ఈ స్కూటర్‌కు ఉండగా.. టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు (70 kmph)గా ఉంది.
రన్ఆర్ హెచ్ఎస్ ఈవీ ఫీచర్లు ఇలా..
నియో రెట్రో డిజైన్‍తో రన్ఆర్ హెచ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్ పరంగా బాగుంది. ఎల్ఈడీ టైల్ లైట్లు, యాంటీ థెఫ్ట్ అలారమ్, డివైజ్ లొకేటర్ ఫీచర్లను ఈ రన్ఆర్ హెచ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ కలిగి ఉంది. అలాగే ఎల్‍సీడీ డిస్‍ప్లేతో ఈ స్కూటర్ వచ్చింది. ఈ డిస్‍ప్లేలో విభిన్నమైన ఫీచర్లు యాక్సెస్ చేసుకోవచ్చు. సమాచారం కనిపిస్తుంది. అలాయ్ వీల్స్ ఉంటాయి.
ఇటీవలే ఈవీ సూపర్ స్టోర్ చైన్ అయిన ఎలక్ట్రిక్ వన్ ఎనర్జీతో రన్ఆర్ మొబిలిటీ సంస్థ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. దీంతో ఎలక్ట్రిక్ వన్ ఎనర్జీ షోరూమ్‍ల్లోనూ ఈ రన్ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు లభిస్తాయి. దేశవ్యాప్తంగా 100 డీలర్స్ వద్ద ఈ స్కూటర్లు అమ్మకానికి ఉంటాయి.
రన్ఆర్ హెచ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, కలర్లు
రన్ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.25లక్షలుగా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ.1.30లక్షలుగా ఉంది. ఇవి సబ్సిడీకి ముందు ఎక్స్-షోరూమ్ ధరలు. వైట్, బ్లాక్, గ్రే, రెడ్, గ్రీన్ కలర్ ఆప్షన్‍లలో ఈ స్కూటర్ లాంచ్ అయింది.
కాగా, తాజాగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా భారత మార్కెట్‍లో లాంచ్ అయింది. ఏకంగా 212 కిలోమీటర్ల రేంజ్‍తో ప్రస్తుతం ఇండియాలో లాంగెస్ట్ రేంజ్ స్కూటర్‌గా అడుగుపెట్టింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.45లక్షలుగా ఉంది. బుకింగ్‍కు ఈ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. జూన్‍లో డెలివరీలను ప్రారంభిస్తామని ఆ కంపెనీ తెలిపింది.