తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Toyota Cars Waiting Period : ఈ కార్లను ఇప్పుడు బుక్​ చేస్తే.. 2025లోనే డెలివరీ!

Toyota cars waiting period : ఈ కార్లను ఇప్పుడు బుక్​ చేస్తే.. 2025లోనే డెలివరీ!

Sharath Chitturi HT Telugu

07 November 2023, 6:46 IST

    • Toyota cars waiting period : ఇండియాలో.. టయోటా వాహనాలకు క్రేజీ డిమాండ్​ కనిపిస్తోంది. ముఖ్యంగా నాలుగు మోడల్స్​కి 15 నెలలు, అంత కన్నా ఎక్కువ వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది! ఆ వివరాలు..
ఈ కారును ఇప్పుడు బుక్​ చేస్తే.. 2025లోనే డెలివరీ!
ఈ కారును ఇప్పుడు బుక్​ చేస్తే.. 2025లోనే డెలివరీ!

ఈ కారును ఇప్పుడు బుక్​ చేస్తే.. 2025లోనే డెలివరీ!

Toyota cars waiting period : : టయోటా కారు కొనాలని చూస్తున్నారా? అయితే మీరు సుదీర్ఘ కాలం పాటు వెయిట్​ చేయక తప్పదు! టయోటా పోర్ట్​ఫోలియోలోని అనేక మోడల్స్​కు భారీ వెయిటింగ్​ పీరియడ్​ కొనసాగుతోంది. కొత్తగా లాంచ్​ అయిన టయోటా రుమియన్​ పరిస్థితి కూడా ఇదే! ఈ నేపథ్యంలో.. టయోటో మోడల్స్​, వాటి వెయిటింగ్​ పీరియడ్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము.

ఈ వెహికిల్స్​కి వెయిటింగ్​ పీరియడ్​ ఎక్కువే!

టయోటా రుమియన్​ సీఎన్​జీ:- రుమియన్​ ఎంపీవీలో స్టాండర్డ్​ వేరియంట్​ కన్నా.. సీఎన్​జీ వేరియంట్​కు క్రేజీ డిమాండ్​ కనిపిస్తోంది. మారుతీ సుజుకీ ఎర్టిగా ఆధారంగా ఈ వెహికిల్​ని రూపొందించిన విషయం తెలిసింది. ఇందులో 1.5 లీట్​ కే సిరీస్​ ఇంజిన్​ ఉంటుంది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 10.29లక్షలు. ఇది 26.6 కేఎం/కేజీ మైలేజ్​ ఇస్తుంది. కాగా.. రుమియన్​ సీఎన్​జీ మోడల్​కు 18 నెలల వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది. ఇంత డిమాండ్​ వచ్చేసరికి.. సీఎన్​జీ వేరియంట్​ బుకింగ్స్​ని నిలిపివేసింది సంస్థ.

టయోటా అర్బన్​ క్రూజర్​ హైరైడర్​ సీఎన్​జీ:- రుమియన్​ సీఎన్​జీ తర్వాత.. టయోటా వాహనాల్లో అధిక వెయిటింగ్​ పీరియడ్​ ఉన్న మోడల్​.. ఈ అర్బన్​ క్రూజర్​ హైరైడర్​ సీఎన్​జీ. దీనికి 16 నెలల పాటు వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది. ఈ ఎస్​యూవీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 13.23లక్షలు. ఇందులో 1.5 లీటర్​ కే సిరీస్​ ఇంజిన్​ ఉంటుంది. 26.6 కేఎం/కేజీ మైలేజ్​ ఇస్తుంది. మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా, హ్యుందాయ్​ క్రేటాకు ఇది గట్టిపోటీనిస్తోంది.

Toyota Innova HyCross waiting period : టయోటా ఇన్నోవా హైక్రాస్​:- ఇన్నోవా హైక్రాస్​ స్ట్రాంగ్​ హైబ్రీడ్​ వర్షెన్​కు 15 నెలల వరకు వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది. గతేడాది డిసెంబర్​లో లాంచ్​ అయ్యింది మోడల్​. మారుతీ సుజుకీ ఇన్విక్టోకు ఇది గట్టిపోటీనిస్తోంది. హైబ్రీడ్​ వేరియంట్​లో 2.0 లీటర్​ 4 సిలిండర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 181 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది.

టయోటా వెల్​ఫైర్​:- ఈ ఎంపీవీకి ఇండియాలో మంచి డిమాండే కనిపిస్తోంది. ఫలితంగా.. వెయిటింగ్​ పీరియడ్​ అమాంతం పెరిగిపోయింది. వెల్​ఫైర్​ని ఇప్పుడు బుక్​ చేస్తే.. డెలివరీ తీసుకోవడం కోసం కనీసం 15 నెలల పాటు వెయిట్​ చేయాల్సిందే!

చరిత్ర సృష్టించిన టయోటా సంస్థ..!

జపాన్​కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టయోటా మోటార్​ కార్పొరేషన్​.. సరికొత్త మైలురాయిని అధిగమించి, చరిత్ర సృష్టించింది. 88ఏళ్ల 2 నెలల ప్రస్తానంలో మొత్తం 300 మిలియన్​ (30కోట్లు) కార్లను తయారు చేసింది టయోటా! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం