Toyota : 88ఏళ్లల్లో 30 కోట్ల వాహనాలు.. ఆ మైలురాయితో చరిత్ర సృష్టించిన టయోటా!
Toyota new milestone : ప్రపంచ ఆటోమొబైల్ చరిత్రలో సరికొత్త మైలురాయిని తాకింది టయోటా సంస్థ. సంస్థ స్థాపించిన 88ఏళ్లల్లో 30 కోట్ల వాహనాలను తయారు చేసింది!
Toyota new milestone : జపాన్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టయోటా మోటార్ కార్పొరేషన్.. సరికొత్త మైలురాయిని అధిగమించి, చరిత్ర సృష్టించింది. 88ఏళ్ల 2 నెలల ప్రస్తానంలో మొత్తం 300 మిలియన్ (30కోట్లు) కార్లను తయారు చేసింది టయోటా!
టయోటా సరికొత్త మైలురాయి..
1935లో జపాన్‌లో టయోటాను స్థాపించారు. ప్రాంతీయంగానే కాకుండా.. అంతర్జాతీయంగా కూడా ఈ సంస్థకు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఫలితంగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు.. దేశ, విదేశాల్లో సేల్స్ హవాను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో.. 300 మిలియన్ కార్స్ ప్రొడక్ష్ని పూర్తి చేసుకుంది టయోటా. జపాన్‌లో 180.53 మిలియన్ యూనిట్లు తయారవ్వగా.. విదేశాల్లో 119.6 మిలియన్ యూనిట్లు మేన్యుఫ్యాక్చర్ అయ్యాయి.
Number of cars Toyota produced : ఇక టయోటాకు కొరొల్లా కారు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. ఇప్పటివరకు 53.339 మిలియన్ యూనిట్ల కొరొల్లా వెహికిల్స్‌ని తయారు చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. 1966లో తొలిసారి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి.. ఇప్పటివరకు ఈ సెడాన్‌లో అనేక మార్పులు చేటుచేసుకున్నాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా కనిపిస్తూ.. ఈ మోడల్ ఇప్పటికీ కస్టమర్లను ఆకర్షిస్తోంది.
ఇదీ చూడండి:- టయోటా నుంచి సరికొత్త ఈవీ.. డిజైన్ నెక్ట్స్ లెవల్!
300 మిలియన్ మైలురాయి సందర్భంగా.. టయోటా సంస్థ ఛైర్మన్ అకియో టయోడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
"టయోటా ఉద్యోగుల శ్రమ, కష్టం, సప్లైయర్స్, డీలర్స్‌తో పాటు ఇతరుల కృషికి నిదర్శనం ఈ మైలురాయి. మొదటి కారును రూపొందించిన వెంటనే ఈ మైలురాయిని మేము తాకలేదు. ఇలా చరిత్ర రాయలేదు. మా సంస్థ వ్యవస్థాపకులు అనేక ప్రోటోటైప్స్ని ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. అయినా.. డ్రీమ్స్‌ని వదులుకోలేదు. వారి పట్టుదలకు చిహ్నం.. నేటి ఈ మైలురాయి," అని వ్యాఖ్యానించరు అకియో టయోడా.
ఈ సందర్భంగా.. టయోటా అధ్యక్షుడు కోజి సటో మాట్లాడారు.
Toyota motors latest news : "ఇటీవలి కాలంలో సంస్థకు సవాళ్లు పెరిగాయి. కానీ వాస్తవానికి ఇవి సవాళ్లు కావు. అవకాశాలు. జపాన్‌లో భూకంపం, కొవిడ్ 19 మహమ్మారి, చిప్‌ల కొరత వంటి ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురయ్యాయి. ఇక కారు తయారు చేయలేమని భయపడిన ప్రతిసారి.. అందరు కలసిగట్టుగా ముందడుగు వేసి, ప్రొడక్షన్‌ని కొనసాగించారు. ఇది అందరి విజయం," అని అన్నారు కోజి సటో.
టయోటాకు ఇండియాలో కూడా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా.. ఇండియా విపణిలో ఇన్నోవా ఎంపీవీకి క్రేజీ డిమాండ కనిపిస్తోంది.
సంబంధిత కథనం