తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Republic Day 2024: రిపబ్లిక్ డే సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ పై డిస్కౌంట్ ఆఫర్స్

Republic Day 2024: రిపబ్లిక్ డే సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ పై డిస్కౌంట్ ఆఫర్స్

HT Telugu Desk HT Telugu

26 January 2024, 19:05 IST

  • Ola Electric discount offers: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటించింది. ఎక్స్టెండెడ్ వారంటీపై తగ్గింపు, Ola S1 ఎయిర్, S1 ప్రో పై ఎక్స్ఛేంజ్ బోనస్ మొదలైనవి ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ola Electric discount offers: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ విభాగంలో మార్కెట్ లీడర్ గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ పలు డిస్కౌంట్ ఆఫర్స్ ను ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ పై ప్రధానంగా రూ. 25,000 విలువైన ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

జనవరి 31 వరకు ..

ఈ ప్రత్యేక ఆఫర్‌లు జనవరి 31, 2024 వరకు అందుబాటులో ఉంటాయి. ఇవి ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) స్కూటర్ లైనప్ అంతటా వర్తిస్తాయి. ఓలా ఎలక్ట్రిక్ రిపబ్లిక్ డే ఆఫర్‌లలో పొడిగించిన వారంటీపై 50 శాతం తగ్గింపు, S1 ఎయిర్ మరియు S1 ప్రో మోడల్‌లపై రూ. 2,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా ఉన్నాయి. అదనంగా, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ EMIలపై కొనుగోలుదారులు రూ. 5,000 వరకు తగ్గింపును, జీరో డౌన్ పేమెంట్, జీరో-ప్రాసెసింగ్ ఫీజు, 7.99 శాతం నుండి వడ్డీ రేట్లు వంటి అనేక ఫైనాన్స్ ఆఫర్‌లను కూడా ఓలా ఎలక్ట్రిక్ అందిస్తోంది. ఇంకా, Ola S1 X+ గత ఏడాది డిసెంబర్‌లో తొలిసారిగా ప్రకటించిన రూ. 20,000 తగ్గింపును అలాగే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 89,999 (ఎక్స్-షోరూమ్) లకు లభిస్తుంది.

ఐదు మోడళ్లు

ఓలా ఎలక్ట్రిక్ శ్రేణి వివిధ ధరల పాయింట్లలో ఐదు మోడళ్లను కలిగి ఉంది. అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు S1 X (2 kWh), S1 X (3 kWh), S1 X+, S1 ఎయిర్, S1 ప్రోతో ప్రారంభమయ్యే రెండవ తరం S1 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి. ఎంట్రీ-లెవల్ S1 X విక్రయాలు ఇంకా ప్రారంభం కాలేదు, అయితే, వాటిని రూ. 999 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఓలా ఇ-స్కూటర్ లైనప్ ధర రూ. 89,999 నుండి రూ. 1.47 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది.

ఓలా యూనిటీ హెరిటేజ్ రైడ్

ఓలా ఎలక్ట్రిక్ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 'ఓలా యూనిటీ హెరిటేజ్ రైడ్'ను నిర్వహించింది. ఇందులో కస్టమర్లు దేశంలోని 26 నగరాల్లోని తమ సమీప ప్రముఖ వారసత్వ ప్రదేశాలకు వెళ్లారని వెల్లడించింది. త్వరలో ఓలా ఐపీఓకు రానుంది. ఇందుకు సంబంధించిన కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను కూడా దాఖలు చేసింది.

తదుపరి వ్యాసం