తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Reliance Jio: 4జీ డౌన్‌లోడ్ అప్‌లోడ్ వేగంలో జియో నంబర్ వన్.. ట్రాయ్ నివేదిక

Reliance Jio: 4జీ డౌన్‌లోడ్ అప్‌లోడ్ వేగంలో జియో నంబర్ వన్.. ట్రాయ్ నివేదిక

HT Telugu Desk HT Telugu

17 November 2022, 18:24 IST

  • Reliance Jio: 20.3 ఎంబీపీఎస్ సగటు 4జీ డౌన్‌లోడ్ వేగంతో జియో అగ్రస్థానంలో ఉంది.  వరుసగా రెండో నెలలో 4జీ సగటు అప్‌లోడ్ వేగంలో నంబర్ 1గా నిలిచింది.

4జీ డేటా స్పీడ్‌లో నెంబర్ 1 గా నిలిచిన జియో
4జీ డేటా స్పీడ్‌లో నెంబర్ 1 గా నిలిచిన జియో (Bloomberg)

4జీ డేటా స్పీడ్‌లో నెంబర్ 1 గా నిలిచిన జియో

న్యూఢిల్లీ: 5జీ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అక్టోబర్ నెలలో 4G స్పీడ్ టెస్ట్ గణాంకాలను విడుదల చేసింది. రిలయన్స్ జియో సగటు 4G డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. TRAI విడుదల చేసిన డేటా ప్రకారం, జియో సగటు 4G డౌన్‌లోడ్ వేగం సెప్టెంబర్‌లో 19.1 ఎంబీపీఎస్ నుండి అక్టోబర్‌లో 20.3 ఎంబీపీఎస్‌కి పెరిగింది.

సగటు డౌన్‌లోడ్ స్పీడ్ విషయంలో ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా మధ్య గట్టి పోరు నెలకొన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్‌లో ఎయిర్‌టెల్ సగటు 4G డౌన్‌లోడ్ వేగం 15 ఎంబీపీఎస్ కాగా Vi (వోడాఫోన్-ఐడియా) 14.5 ఎంబీపీఎస్. అయితే ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాతో పోలిస్తే జియో సగటు 4G డౌన్‌లోడ్ వేగం 5 ఎంబీపీఎస్ ఎక్కువగా ఉంది.

సగటు 4G అప్‌లోడ్ వేగం పరంగా కూడా రిలయన్స్ జియో గత నెలలో మొదటి సారి తొలి స్థానానికి చేరుకుంది. అక్టోబర్ నెలలో కూడా కంపెనీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 6.2 ఎంబీపీఎస్ సగటు 4G అప్‌లోడ్ వేగంతో జియో టాప్ లో నిలిచింది. వోడాఫోన్-ఐడియా 4.5 ఎంబీపీఎస్ వేగంతో రెండవ స్థానంలో కొనసాగింది. అదే సమయంలో ఎయిర్‌టెల్ అప్‌లోడ్ స్పీడ్‌లో నిరంతర క్షీణత ఉంది. అక్టోబర్‌లో ఎయిర్‌టెల్ సగటు 4G అప్‌లోడ్ వేగం ఆందోళనకరంగా 2.7 ఎంబీపీఎస్‌కు చేరుకుంది. ఎయిర్‌టెల్ అప్‌లోడ్ వేగం జియోలో సగం కంటే తక్కువకు చేరుకుంది.

టాపిక్