తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Reliance Jio: త్వరలోనే దేశమంతటా 5 జీ సేవలు: జియో

Reliance Jio: త్వరలోనే దేశమంతటా 5 జీ సేవలు: జియో

HT Telugu Desk HT Telugu

28 February 2023, 15:32 IST

google News
  • Reliance Jio: 5జీ సేవలను దేశమంతటా విస్తరించడానికి యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తున్నామని రిలయన్స్ జియో ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Reliance Jio: అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ను అందించే ఫిఫ్త్ జనరేషన్ (5G) సేవలను దేశంలో ప్రారంభించిన నాటి నుంచి టెలీకాం సంస్థలు తమ వినియోగదారులకు ఆ సేవలను అందించే ప్రయత్నాలను ప్రారంభించాయి. ఈ రేసులో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మిగతా టెలీకాం సంస్థల కన్నా చాలా ముందున్నాయి.

Reliance Jio 5G service: ఇప్పటివరకు..

రిలయన్స్ జియో (Reliance Jio) ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 277 నగరాలు, పట్టణాల్లతో 5జీ (5G) సేవలను ప్రారంభించింది. మొత్తం దేశమంతటా 5జీ సేవలను అందించడానికి ఇంకా ఎక్కువ రోజులు పట్టబోదని జియో (Reliance Jio) స్పష్టం చేసింది. గతంలో తాము చెప్పినట్లు, ఈ సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా 5 జీ (5G) సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొంది. అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో ప్రారంభించి, ఇతర ముఖ్యమైన పట్టణాలు, జిల్లా కేంద్రాలు, తాలుకాలను తమ 5 జీ నెట్ వర్క్ లో చేర్చుకుంటూ వెళ్తున్నామని రిలయన్స్ జియో ఇన్ఫొకామ్ (Reliance Jio Infocomm) చైర్మన్ ఆకాశ్ అంబానీ (Akash Ambani) వెల్లడించారు. రిలయన్స్ జియో ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5 జీ (5G)సేవలను ప్రారంభిస్తున్న కంపెనీ అన్నారు. గత సంవత్సరం అక్టోబర్ 1న భారతదేశంలో 5జీ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 5జీ (5G) మొబైల్ నెట్వర్క్ భారీ డేటాను కూడా క్షణాల్లో ట్రాన్స్ ఫర్ చేయగలదు. వైద్యం, విద్య, ట్రాన్స్పోర్ట్, ఈ కామర్స్, పబ్లిక్ సర్వీస్, వ్యవసాయం తదితర రంగాల్లో 5జీ (5G) ద్వారా మరింత వేగంగా సేవలను అందించవచ్చు.

తదుపరి వ్యాసం