తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2000 Notes Exchange: ఇంకా మార్కెట్లోనే 9760 కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు; ఇప్పుడు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు..

2000 notes exchange: ఇంకా మార్కెట్లోనే 9760 కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు; ఇప్పుడు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు..

HT Telugu Desk HT Telugu

01 December 2023, 13:24 IST

google News
  • 2000 notes exchange: రూ. 2 వేల నోట్లను చలామణిలో నుంచి తొలగించిన తరువాత కూడా, ప్రస్తుతం ఇంకా మార్కెట్లో రూ. 9760 కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Hindustan Times)

ప్రతీకాత్మక చిత్రం

2000 notes exchange: రూ. 2 వేల నోట్లను చలామణిలో నుంచి తొలగిస్తున్నట్లు ఈ సంవత్సరం మే 19వ తేదీన ఆర్బీఐ (RBI) ప్రకటించింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను ( 2000 notes) బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి కానీ, ఎక్సేంజ్ చేయడానికి కానీ 4 నెలల గడువు విధించింది.

గడువు ముగిసినా..

ఆర్బీఐ విధించిన గడువు ముగిసి రెండు నెలలు గడిచాయి. అయినా ఇప్పటికీ, రూ. 9760 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు బ్యాంక్ ల్లో డిపాజిట్ లేదా ఎక్స్సేంజ్ కాలేదు. మే 19, 2023 నాటికి మార్కెట్లో చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లలో ఇప్పటివరకు 97.26 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు తిరిగివచ్చాయని శుక్రవారం ఆర్బీఐ (RBI) ప్రకటించింది. ఇంకా రూ. 9760 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు మార్కెట్లోనే ఉన్నాయని వెల్లడించింది. మే 19, 2023 నాటికి మార్కెట్లో రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు ( 2000 notes) మార్కెట్లో ఉన్నాయని, ఇప్పుడు నవంబర్ 30, 2023 నాటికి వాటిలో రూ. 9760 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు ఇంకా బ్యాంకులకు తిరిగి రాలేదని వెల్లడించింది.

ఆర్బీఐలో డిపాజిట్ చేయవచ్చు..

రూ. 2 వేల నోట్లను ఈ మే 19న చలామణి లో నుంచి తొలగించిన ఆర్బీఐ, ప్రజలు తమవద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ లేదా ఎక్స్సేంజ్ చేసుకోవడానికి నాలుగు నెలల సమయం ఇచ్చింది. ఆ గడువు సెప్టెంబర్ 30, 2023తో ముగియగా, మరో వారం గడువును పొడగించింది. దాంతో, ఆ గడువు అక్టోబర్ 7, 2023 తో ముగిసింది. అయితే, ప్రజలు ఇప్పటికీ తమ వద్ద ఉన్న రూ 2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐకి చెందిన 19 కార్యాలయాల్లో వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అలాగే, ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించి, తమ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయమని కోరవచ్చు.

తదుపరి వ్యాసం