తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Poco X5 Pro 5g Sale: పోకో ఎక్స్5 ప్రో 5జీ సేల్‍ షురూ.. ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే..!

Poco X5 Pro 5G Sale: పోకో ఎక్స్5 ప్రో 5జీ సేల్‍ షురూ.. ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే..!

13 February 2023, 14:01 IST

    • Poco X5 Pro 5G Sale: పోకో ఎక్స్5 ప్రో 5జీ సేల్ ప్రారంభమైంది. తొలి సేల్ సందర్భంగా బ్యాంక్ కార్డు ఆఫర్లు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుంటే రూ.2,000 అదనపు తగ్గింపు పొందవచ్చు.
Poco X5 Pro 5G Sale: పోకో ఎక్స్5 ప్రో 5జీ సేల్‍ షురూ.. ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే.. (Photo: Poco)
Poco X5 Pro 5G Sale: పోకో ఎక్స్5 ప్రో 5జీ సేల్‍ షురూ.. ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే.. (Photo: Poco)

Poco X5 Pro 5G Sale: పోకో ఎక్స్5 ప్రో 5జీ సేల్‍ షురూ.. ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే.. (Photo: Poco)

Poco X5 Pro 5G Sale: పోకో ఎక్స్5 ప్రో 5జీ మొబైల్ ఓపెన్ సేల్ నేడు (ఫిబ్రవరి 13) మొదలైంది. గత వారం లాంచ్ తర్వాత కొంతసేపు సేల్‍కు ఉన్న ఈ ఫోన్.. నేడు పూర్తిస్థాయిలో సేల్‍కు వచ్చింది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అమోలెడ్ డిస్‍ప్లేతో మిడ్ రేంజ్‍లో ఈ ఫోన్ లభిస్తోంది. 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. రెండు వేరియంట్లలో పోకో ఎక్స్5 ప్రో 5జీ అందుబాటులోకి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..

Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ లాంచ్

పోకో ఎక్స్5 ప్రో 5జీ ధర, సేల్

Poco X5 Pro 5G Price: పోకో ఎక్స్5 ప్రో 5జీ ఫోన్ రెండు వేరియంట్లలో సేల్‍కు అందుబాటులోకి వచ్చింది.

  • 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.22,999
  • 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.24,999

ఈ-కామర్స్ ప్లాట్‍ఫామ్ ఫ్లిప్‍కార్ట్‌లో ఈ మొబైల్ సేల్ మొదలైంది. ఎల్లో, హారిజన్ బ్లూ, ఆస్ట్రల్ బ్లాక్ కలర్లలో అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‍డీఎఫ్‍సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొంటే ప్రస్తుతం పోకో ఎక్స్5 ప్రో 5జీపై రూ.2,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.

పోకో ఎక్స్5 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు

  • Poco X5 Pro 5G ఫోన్‍లో క్వాల్కామ్ స్నాప్‍డ్రాగన్ 778జీ ప్రాసెసర్ (Snapdragon 778G) ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ MIUI 14 ఓఎస్‍ను కలిగి ఉంది. డ్యుయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్‍టీఈ, డ్యుయల్ బ్యాండ్, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఇన్‍ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్, 3.5 ఎంఎం హెడ్‍ఫోన్ జాక్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఆప్షన్లుగా ఉన్నాయి.
  • డాల్బీ విజన్, హెచ్‍డీఆర్ 10+ సపోర్ట్, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్షన్‍తో కూడిన 6.67 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేతో పోకో ఎక్స్5 ప్రో 5జీ వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది.
  • Poco X5 Pro 5G మొబైల్ వెనుక 108 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో ఎక్స్5 ప్రో 5జీ (Poco X5 Pro 5G) ఫోన్ వస్తోంది. 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు ఈ మొబైల్‍కు ఉంటాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్ పవర్ బటన్‍కే ఉంటుంది.