తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Poco F5 5g Price: పోకో ఎఫ్5 ఫోన్ ధర ఇంత ఉండనుందా!

Poco F5 5G Price: పోకో ఎఫ్5 ఫోన్ ధర ఇంత ఉండనుందా!

30 April 2023, 18:56 IST

google News
    • Poco F5 Price in India: పోకో ఎఫ్5 మొబైల్ ధర తాజాగా లీకైంది. ఓ టిప్‍స్టర్ ఈ వివరాలను వెల్లడించారు.
Poco F5 5G Price: పోకో ఎఫ్5 ఫోన్ ధర ఇంత ఉండనుందా! (Photo: Poco)
Poco F5 5G Price: పోకో ఎఫ్5 ఫోన్ ధర ఇంత ఉండనుందా! (Photo: Poco)

Poco F5 5G Price: పోకో ఎఫ్5 ఫోన్ ధర ఇంత ఉండనుందా! (Photo: Poco)

Poco F5 Price: పోకో ఎఫ్‍5 (Poco F5) భారత మార్కెట్‍లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. పోకో ఎఫ్4 5జీకి సక్సెసర్‌గా ఈ ఎఫ్‍5 5జీ వస్తోంది. మే 9వ తేదీన భారత్‍లో పోకో ఎఫ్5 లాంచ్ కానుంది. అదే రోజున గ్లోబల్‍గా పోకో ఎఫ్5 ప్రో కూడా అడుగుపెట్టనుంది. అయితే, ఇండియాలో మే 9న పోకో ఎఫ్5 మాత్రమే విడుదల కానుంది. కాగా, తాజాగా పోకో ఎఫ్5 ధర లీకైంది. ఓ టిప్‍స్టర్ ఈ వివరాలను వెల్లడించారు. పోకో ఎఫ్5 5జీ ధర అంచనా ఇక్కడ చూడండి.

పోకో ఎఫ్5 5జీ ధర (లీక్ ప్రకారం)

Poco F5 Price in India: పోకో ఫ్లాగ్‍షిప్ 5జీ మొబైల్‍గా పోకో ఎఫ్5 భారత మార్కెట్‍లో అడుగుపెట్టనుంది. టిప్‍స్టర్ పరాస్ గుగ్లానీ (ప్యాషనేట్ గీక్జ్) ఈ ఫోన్ ధరను లీక్ చేశారు. పోకో ఎఫ్5 5జీ ప్రారంభ ధర రూ.27,999గా ఉంటుందని ఆ టిప్‍స్టర్ వెల్లడించారు. మే 11వ తేదీన అంటే లాంచ్ అయిన రెండు రోజుల తర్వాత ఈ పోకో ఎఫ్5 5జీ సేల్‍కు అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో ఈ ఫోన్ సేల్‍కు వస్తుంది.

Poco F5: గతేడాది పోకో ఎఫ్4 5జీ కూడా రూ.27,999 లాంచ్ అయింది. ఇప్పుడు దాని సక్సెసర్ పోకో ఎఫ్5 5జీ కూడా అదే ప్రారంభ ధరతో వస్తుందని లీక్ ద్వారా వెల్లడైంది. మే 9న లాంచ్ ఈవెంట్‍లో అధికారిక ధరను పోకో వెల్లడిస్తుంది.

Poco F5: పోకో ఎఫ్5 మొబైల్ స్నాప్‍డ్రాగన్ 7+ జెన్2 (Snapdragon 7+ Gen2) ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ప్రాసెసర్‌తో ఇండియన్ మార్కెట్‍లో అడుగుపెట్టనున్న తొలి ఫోన్ ఇదే కానుంది. 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. 6.67 ఇంచుల అమోలెడ్ డిస్‍ప్లేను ఈ మొబైల్ కలిగి ఉంటుందని సమాచారం లీకైంది. చైనాలో రెడ్‍మీ నోట్ 12 టర్బోగా విడుదలైన మొబైల్‍ను రీబ్రాండెడ్‍గా పోకో తీసుకొస్తోందని తెలుస్తోంది.

Poco F5: పోకో ఎఫ్5 వెనుక 64 మెగాపిక్సెల్ OIS ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉంటాయని సమాచారం వెల్లడైంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండొచ్చు. 5,000mAh బ్యాటరీ, 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో ఈ ఫోన్ రానుందని అంచనా. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్‍తో పోకో ఎఫ్5 అడుగుపెట్టనుంది.

తదుపరి వ్యాసం