తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market : ఈ స్టాక్ ధర రూ.36.. త్వరలో రూ.100కు చేరుకోవచ్చు

Stock Market : ఈ స్టాక్ ధర రూ.36.. త్వరలో రూ.100కు చేరుకోవచ్చు

Anand Sai HT Telugu

07 July 2024, 15:02 IST

google News
    • Bridge Securities Limited Share Price : ఫైనాన్స్ రంగ మైక్రో క్యాప్ కంపెనీ బ్రిడ్జ్ సెక్యూరిటీస్ షేర్లు రానున్న రోజుల్లో పైకి వెళ్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలో షేర్ వాల్యూ పెరుగుతుందని అంటున్నారు.
పెరగనున్న బ్రిడ్జ్ సెక్యూరిటీస్ షేర్ వాల్యూ
పెరగనున్న బ్రిడ్జ్ సెక్యూరిటీస్ షేర్ వాల్యూ

పెరగనున్న బ్రిడ్జ్ సెక్యూరిటీస్ షేర్ వాల్యూ

మైక్రో క్యాప్ కంపెనీ బ్రిడ్జ్ సెక్యూరిటీస్ షేర్లు రానున్న రోజుల్లో మంచి షేర్ వాల్యూ సంపాదిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం కంపెనీ షేరు ధర 5 శాతం పెరిగి రూ.36.51 వద్ద ముగిసింది. ఇటీవల కంపెనీ బోర్డు సభ్యుడు 1:10 నిష్పత్తిలో స్టాక్ విభజనకు రికార్డు తేదీని ప్రకటించారు. శుక్రవారం ఈ షేరు 52 వారాల గరిష్ట స్థాయి రూ.36.51 వద్ద ముగిసింది. జూలై 10న కంపెనీ రికార్డు తేదీని నిర్దేశించింది.

బ్రిడ్జ్ సెక్యూరిటీస్ ఫైనాన్షియల్స్ నికర ఆదాయం 2024 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.0.32 కోట్లుగా ఉంది. క్యూ4ఎఫ్‌వై 23లో రూ.0.84 కోట్లుగా ఉన్న నికర వ్యయాలు క్యూ4ఎఫ్‌వై24లో రూ.0.02 కోట్లకు పెరిగాయి. 2023 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.0.51 కోట్లుగా ఉన్న ఈబీఐటీ మార్చి 2024 త్రైమాసికంలో రూ.0.31 కోట్లకు చేరుకుందని బ్రిడ్జ్ సెక్యూరిటీస్ తెలిపింది.

2 నుంచి 8 నెలల వ్యవధిలో టార్గెట్ ధర రూ.45 నుంచి రూ.100 వరకు పెరగొచ్చని సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ వీఎల్ఏ అంబాలా తెలిపారు. రూ.25 స్టాప్ లాస్ ఉంచాలి. దీని మార్కెట్ క్యాప్ రూ.11 కోట్లలోపే ఉంది. ఈ కంపెనీ స్మాల్ క్యాప్ కేటగిరీలోకి వస్తుంది. గత ఐదు రోజుల్లో కంపెనీ షేర్లు 22 శాతం, నెలలో 55 శాతం పెరిగాయి. ఆరు నెలల్లో ఈ స్టాక్ 103 శాతం పెరిగింది. ఇదే సమయంలో దీని ధర రూ.17 నుంచి ప్రస్తుత ధరకు పెరిగింది. ఈ స్టాక్ ఈ సంవత్సరం వైటిడిలో 125శాతం, సంవత్సరంలో 440 శాతం వరకు రాబడిని ఇచ్చింది.

గమనిక : ఇవి నిపుణులు అభిప్రాయాలు మాత్రమే. ఇది సమాచారం కోసం ఇచ్చిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు మీకు సొంతంగా ఎనాలసిస్​ ఉండాలి. ఏదైనా ఇన్​వెస్ట్​మెంట్​ చేసే ముందు మీ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం. స్టాక్ మార్కెట్ రిస్క్‌తో కూడుకున్నది అని గుర్తుంచుకోవాలి.

తదుపరి వ్యాసం