కుటుంబ సభ్యులందరికీ శాంతి: ఉత్తమ ఆరోగ్య బీమా ప్లాన్లు ఎంపిక
27 March 2024, 18:21 IST
- హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ వయస్సు, స్థానం మరియు కుటుంబ సభ్యుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది
Health Insurance
పరిచయం
హెల్త్ ఇన్సూరెన్స్- దీన్ని మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు లేదా పాలసీలు అని కూడా అంటారు. హాస్పిటల్లో చేరే కవరేజీల నుండి ప్రివెంటివ్ మెడికల్ హెల్త్ కేర్, డెత్ బెనిఫిట్స్ వంటి అదనపు లాభాలతో కూడిన సమగ్ర పాలసీల వరకు ఎన్నోరకాల అనారోగ్యాల వైద్య చికిత్స కోసం చేసే ఖర్చును కవర్ చేసే ముఖ్యమైన ఆర్థిక సాధనం. ఆరోగ్య బీమా అనేక రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి.
హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
“ఆరోగ్యమే మహాభాగ్యం” అన్నారు మన పెద్దలు. అందుకే ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పులేదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక అనారోగ్యం రాక మానదు. ప్లాన్ చేసుకుని హాస్పిటల్‌లో చేరినా, సడెన్‌గా అడ్మిట్ కావాల్సి వచ్చినా భారీగా ఖర్చు పెట్టాల్సిందేనన్నది చేదు నిజం. ఈ రోజుల్లో వైద్యం కోసం పెట్టే ఖర్చులు లక్షలకు చేరుతున్న నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్ల, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు కట్టగలిగిన ప్రీమియంతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది మీరు ఊహించని, వైద్యఖర్చుల విషయంలో మీకు ఆసరా అయ్యి సహాయపడుతుంది. మీ బడ్జెట్ ప్రకారం బెస్ట్ ప్లాన్ ఏదో తెలుసుకోవడానికి మీరు ఆన్‌లైన్‌లో రకరకాల హెల్త్ ఇన్సూరెన్స్ లను కూడా పరిశీలించవచ్చు. ఉదాహరణకు, ACKO వంటి సంస్థలు సరసమైన ధరల్లో రకరకాల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అందిసుంది. మెడికల్, సర్జికల్ రెండూ హెల్త్ ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తాయి. దీనితో పాటు, హెల్త్ ఇన్సూరెన్స్‌లో క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. మన కుటుంబసభ్యులు అనారోగ్యం పాలైనప్పుడు, మన జేబు నుండి హాస్పిటల్ మందుల ఖర్చులను భరించాల్సిన అవసరం లేదు. మీ పాలసీ ప్రకారం బీమా కంపెనీ ఈ మొత్తం ఖర్చును భరిస్తుంది. అదే విధంగా సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉన్నాయి.
హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే లాభాలు:
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ దాదాపు అన్ని వ్యాధుల చికిత్సఖర్చును కవర్ చేస్తుంది. ఇందులోహాస్పిటలైజేషన్‌కు ముందు,తర్వాత అయ్యే ఖర్చులు,అంటే టెస్టులు,రోగ నిర్ధారణకు అయ్యే ఖర్చులు,డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఉంటాయి.
మెడికల్ ఇన్సూరెన్స్‌లో,పాలసీ హోల్డర్లు వారి అవసరాన్ని బట్టి కొన్ని తీవ్రమైన అనారోగ్యాలు, గర్భం,క్యాన్సర్ వంటి వ్యాధుల,కోసంలేదా తప్పని హాస్పిటల్ ఖర్చుల కోసం ప్రత్యేకసాదుపాయలులేదా కవర్ పొందవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ వయస్సు,స్థానం మరియు కుటుంబ సభ్యుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
కుటుంబ సభ్యులందరి క్షేమం కోసం: బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్స్
మీరు ఉద్యోగం చేస్తున్నారు,పెళ్ళి కాలేదు అంటే ఈ రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది.
ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్
ఈ ప్లాన్ ఒక వ్యక్తి కవరేజ్ అందిస్తుంది. అయినప్పటికీ,కొన్ని బీమా సంస్థలు పాలసీదారుని జీవిత భాగస్వామికి కూడా కవరేజ్ అందిస్తాయి. అందువల్ల మీకు కొత్తగా పెళ్ళైనా ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్మంచి ఆప్షన్.
ఫ్యామిలీ-ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్
ఇది మొత్తం కుటుంబానికి ఆరోగ్య బీమా. కుటుంబ సభ్యుల కోసం (భర్త/భార్య తల్లిదండ్రులు,పిల్లలు) బీమా చేయవచ్చు. ఇక్కడ,ఎంతమంది కోసం ఇన్సూరెన్స్ తీసుకుంటే బీమా డబ్బు అంతమందికిపొదుగించబడుతుంది. అలాగే ఒక ఏడాదిలో ఒక్కరి కోసమే క్లెయిమ్ చేసుకుంటే,ఆ ఒక్కరికే మొత్తం డబ్బు వాడుకోవచ్చు కూడా. అందువల్ల మీ కుటుంబమంతటికి ఆరోగ్య బీమా కోసంఫ్యామిలీ-ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్తీసుకోవడం మంచిది.
క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ ప్లాన్
క్యాన్సర్,స్ట్రోక్,కిడ్నీ ఫెయిల్యూర్,ప్రధాన అవయవాల మార్పిడి,గుండెపోటు మొదలైన తీవ్రమైన అనారోగ్యాలు ప్రాణాంతక వ్యాధుల చికిత్స చాలా ఖరీదైనది.క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ ప్లాన్తీసుకుంటే అటువంటి వ్యాధులకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ పొందవచ్చు. ఈ ప్లాన్‌లను ఫిక్స్‌డ్ బెనిఫిట్ హెల్త్ ప్లాన్‌లు అని కూడా అంటారు,ఎందుకంటే క్లెయిమ్అనుమతించినపుడు అయితే ఒకేసారి పెద్ద మొత్తం వస్తుంది.
సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్
ఈ ప్లాన్ సీనియర్ సిటిజన్లు,అంటే65ఏళ్లు పైబడిన వారికి వర్తిస్తుంది. వయసు మీరిన కుటుంబ సభ్యులకు తగిన కవరేజ్ కోసంసీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు.
గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్
ఒక గ్రూప్ కోసం,ఉదాహరణకు,ఒకే కంపెనీకి చెందిన కొంతమంది ఉద్యోగులను గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద కవర్ చేయవచ్చు. ఈ గ్రూప్‌లోని ప్రతి సభ్యునికి సమానమైన బీమాసోము కి అనుమతిఉంటుంది. కొన్ని సందర్భాల్లో,బీమా గ్రూప్‌లోనిసభ్యులు,వారి కుటుంబ సభ్యులను ప్లాన్‌కి జోడించవచ్చు,వారికి కేటాయించిన బీమా సొమ్మును పంచుకోవచ్చు.
టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్
ముందే ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీ కింద కవరేజ్ ఉన్నవారు లేదా ఒక పరిమితి వరకు వైద్య ఖర్చులను భరించగలిగే వారుటాప్-అప్ హెల్త్ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. ఇది బీమా పరిభాషలో'డిడక్టబుల్'అనే స్థిరమైనహోల్డర్ కు మించి ఆరోగ్య బీమా తక్షణ కవరేజీని అందిస్తుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలో తెలుసుకోండి:
✓ఆర్థిక భారం తగ్గుతుంది:
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల మీ జేబులో డబ్బు భద్రంగా ఉంటుంది. ప్రీమియం రేట్ల గురించి భయపడుతున్నారా?సరసమైన ధరలలో తగిన ఇన్సూరెన్స్ కవరేజీని పొందడం సాధ్యమవుతుందని తెలుసుకోండి.Ackoవంటి సంస్థలు మీకు మీ ఫ్యామిలీకి డిస్కౌంట్ వంటి తగ్గింపులతో తక్కువ ప్రీమియంతో మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లని అందిస్తున్నాయి.
✓పన్ను ఆదా:
మనదేశంలో,హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం డబ్బు చెల్లిస్తే,ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్80Dకింద పన్ను మినహాయింపు పొందవచ్చు. మీరు మీ కోసం,మీ వారి కోసం పాలసీని కొనుగోలు చేస్తే,మీరు,మీ తల్లిదండ్రులు కూడా సీనియర్ సిటిజన్‌లు అయితే, ₹1 లక్ష వరకు తగ్గింపు పొందవచ్చు.
✓పూర్తి కవరేజ్:
హాస్పిటల్లో చేరే ఖర్చులకు మాత్రమే కాకుండా తీవ్రమైన అనారోగ్యాలు,ప్రమాదవశాత్తు గాయాలు,ప్రసూతి ఖర్చులు,సంప్రదింపులు,చెకప్ వంటి వాటిని కూడా హెల్త్ ప్లాన్‌లు కవర్ చేస్తాయి. వివిధ రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు లేదాయాడ్-ఆన్‌ల ద్వారా ఈ పూర్తి కవరేజ్ అందించబడుతుంది.
✓మనశ్శాంతి:
మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉన్నట్లయితే,ప్రశాంతగా ఉండవచ్చు. మెడికల్ ఇన్సూరెన్స్ వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందువల్ల ఆందోళనకరమైన పరిస్థితుల్లో కూడా మీరు ధైర్యంగా ఉండవచ్చు.
మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అవసరం లేదని మీరు అనుకుంటే,మరోసారి ఆలోచించండి!
ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అవసరం గుర్తుకు రాదు. కొంతమంది నా ఆరోగ్యం బాగానే ఉంది,నాకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరం లేదని అనుకుంటారు. నేను ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటున్నానని,కాబట్టి ఈ రకమైన ఆర్థిక భద్రత అవసరం లేదని వాళ్ళు అనుకోవచ్చు. కానీ జీవితం ఏ సమయంలో ఎటువంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అందుకే ముందుగా జాగ్రత్త పడటం ఎంతైనా అవసరం.
మరోవైపు,హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల కోసం చాలా ఖర్చవుతుందని కొందరు అనుకుంటారు. కానీ నిజానికి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం కట్టే ప్రీమియం కంటే హాస్పిటల్ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి.
గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌ని అందించే సంస్థల ఉద్యోగులు కూడా తమకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా,అది సరిపోతుందని అనుకుంటారు. అయితే,కొన్ని సందర్భాలలో ఈ ప్లాన్ సరిపోకపోవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదని ఈ నమ్మకాలన్నీ సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ గురించిన అపోహలతో ముడిపడి ఉంటాయి.
అవసరం ఏ రూపంలోనైనా రావచ్చు. ఉదాహరణకు,ప్రమాదానికి గురవడం లేదా ప్రాణాంతక వ్యాధులు చుట్టుముట్టడం వంటివి జరిగితే వాళ్ళు ఆరోగ్యాన్ని ఎంత బాగా చూసుకుంటున్నా ఉపయోగం ఉండదు.
హెల్త్ ప్లాన్‌ల కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎన్నో హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్‌కు ఏది సరిపోతుందో,మీకు సరైన కవరేజీ వస్తోందో లేదో తెలుసుకోవడానికి వీటిని ఆన్‌లైన్‌లో పోల్చవచ్చు.
మీరు గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీని కవర్ చేసినప్పటికీ,అవి కొంతవరకే కవరేజీని అందించగలవని గుర్తుంచుకోండి. ఈ పాలసీల వివరాలపై మీకు నియంత్రణ ఉండదు. అంటే కొన్ని అవసరాలు కవర్ కాకపోవచ్చు. మీరు ఆ కంపెనీ నుండి బయటకు వచ్చేస్తే,మీకు ఎలాంటి కవరేజీ లేకుండా పోతుంది.
అదేవిధంగా,మీరు సీనియర్ సిటిజన్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం. లేదా మీ తల్లిదండ్రులు వయోవృద్ధులై ఉంటే వారికోసం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తప్పక తీసుకోవాలి. ఎందుకంటే ఆ వయసులో అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యమే.
అందువల్ల,మీకు,మీ కుటుంబ సభ్యులకు అవసరమైనప్పుడు మీరు ఆర్థికంగా ధైర్యంగా ఉండాలనుకుంటే,ఖర్చు గురించి ఆలోచించకుండా,హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడమే మంచిది.
సీనియర్ సిటిజన్స్కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎందుకంత ముఖ్యం?
మీ కెరీర్ మొత్తంలో మీరు సంపాదించి దాచుకున్న డబ్బు మీ వైద్య అవసరాలకు సరిపోతుందని మీరు అనుకుంటే,మీరు ఆలోచించేలోపే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోవచ్చు. సీనియర్ సిటిజన్లు జీవితకాలంలో సంపాదించుకున్న డబ్బును రక్షించుకోవడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన సాధనం హెల్త్ ఇన్సూరెన్స్. వైద్య ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న ఈ కాలంలో మీ ఆరోగ్య అవసరాలను చూసుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది. సీనియర్ సిటిజన్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల ఇవన్నీ సులభంగా లభిస్తాయి:
- వైద్య ఖర్చుల కవరేజ్
- నాణ్యమైన వైద్య చికిత్స
- ప్రివెంటివ్ హెల్త్ చెకప్
- పన్ను ఆదా
- మనశ్శాంతి
సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్వల్ల కలిగే ట్యాక్స్ బెనిఫిట్స్:
మీ వయసు60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే,మీ ఆరోగ్యం విషయంలో ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఉండటం మంచిది. అవసరమైన సమయాల్లో ఏర్పడే మెడికల్ ఎమర్జెన్సీలను కవర్ చేయడానికి సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంతైనా అవసరం.60 దాటిన తర్వాత రోగనిరోధక శక్తి తగ్గుతుంది,అందువల్ల అనేక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. ఈ రోజుల్లో వైద్యానికి పెరిగిన ఖర్చుల కారణంగా, ఈ సమస్యలను ఎదుర్కోవడం కష్టంగా మారుతోంది. అందుకే ఇలాంటి సందర్భాలలో భయంలేకుండా ఉండటం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ అవసరపడుతుంది. ఉదాహరణకు, Ackoసీనియర్ సిటిజన్ల కోసం రూపొందించిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అందజేస్తుంది. ముందునుంచి ఉన్న అనారోగ్యాలు,ఆసుపత్రిలో చేరే ఖర్చులు,క్లిష్టమైన అనారోగ్యాలు మొదలైన వాటిని కవర్ చేస్తుంది.
మీరు వృద్ధులైన మీ తల్లిదండ్రుల కోసం సీనియర్ సిటిజన్ పాలసీని తీసుకుంటే,మీరు ₹50,000 వరకు ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే,ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రివెంటివ్ హెల్త్ చెకప్‌ల కోసం చేసిన చెల్లింపులపై ₹ 5,000 అదనపు పన్ను మినహాయింపు పొందవచ్చు. అదేవిధంగా ఒక సీనియర్ సిటిజన్ తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స పొందినట్లయితే,మీరు ₹ 1 లక్ష వరకు రాయితీని కూడా పొందవచ్చు.
మార్కెట్లో ఎన్నో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉన్నాయి. ఉదాహరణకు మీ తల్లిదండ్రుల కోసం ACKOహెల్త్ బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవచ్చు,ఇది రోజుకు కేవలం20 రూపాయిల ప్రీమియంతో విస్తృతమైన కవరేజీని అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది.
మీరు సంపాదిస్తున్న సీనియర్ సిటిజన్ అయితే,మీ పిల్లలు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తున్నట్లయితే,మీకు ₹25,000అదనపు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే మీరు సెక్షన్80D కింద ఒక ఆర్థిక సంవత్సరంలో ₹75,000వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు.
కొన్ని బీమా కంపెనీలు వృద్ధుల కోసం ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లను అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌లు అధిక ప్రయోజనాలు మరియు గరిష్ట కవర్‌తో వృద్ధుల నిర్దిష్ట వైద్య ఖర్చులను కవర్ చేస్తాయి. మీరు ఈ ప్లాన్‌లను చూసుకొని చేసి,మీ అవసరాలకు అనుగుణంగా తగిన ప్లాన్‌ను ఎంచుకోవాలి.
వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా ఊహించని విధంగా పెరుగుతాయి. దీనితో పాటు,వైద్య రంగంలో పెరుగుతున్న ఖర్చులు మీ కుటుంబ బడ్జెట్‌పై చాలా ప్రభావం చూపుతాయి. హాస్పిటల్ బిల్లుల కోసం మీ బడ్జెట్‌పై ఒత్తిడి పడకూడదు. సీనియర్ సిటిజన్ల కోసం ప్లాన్‌ను ఎంచుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన కారణం ఇదే. పాలసీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
మీరు వృద్ధులైన మీ తల్లిదండ్రుల కోసం ఇన్సూరెన్స్ తీసుకుంటుంటే,ఈ రోజుల్లో మొదటినుండి డయాబెటిస్,హైబీపీ,గుండె సమస్యలు వంటి వ్యాధులను కవర్ చేసే ప్లాన్‌లు ఎన్నో ఉన్నాయి. అలాంటివి చూసి తీసుకుంటే మంచిది.
ముగింపు
ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను పోల్చండి
హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను నిర్ణయించే ముందు వాటి ఆన్‌లైన్‌లో పోల్చుకోవడం చాలా కీలకం. అయితే,మీరు ఎంచుకున్న ప్లాన్ మీ అవసరాలకు సరిపోయేలా ఉందో లేదో చూసుకోవాలి. ప్లాన్‌లను పోల్చుకోవడం వల్ల మీరు అవసరమైన ఫీచర్లు,ప్రయోజనాలు,సర్వీసుల విషయంలో రాజీ పడకుండా అతి తక్కువ ధరకు అందించే ప్లాన్‌లను గుర్తించవచ్చు. ప్లాన్‌లను పోల్చుకొని,మీ అవసరాలకు తగిన విధంగా తక్కువ ధరకు లభించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోట్ తీసుకోండి!
అందువల్ల,నాణ్యమైన వైద్యం కోసం,ఊహించని వైద్య ఖర్చుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి,పన్ను ప్రయోజనాలను పొందేందుకు,ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి,ప్లాన్ చేసుకొని,హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం మంచిది.
Disclaimer: ఈ వ్యాసం ప్రాయోజిత కథనం. ఇందులో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు హిందుస్తాన్ టైమ్స్‌వి కావు