OPPO A58 launch : ఒప్పో ఏ58 4జీ లాంచ్ రేపే.. ధర, ఫీచర్స్ లీక్!
07 August 2023, 14:30 IST
- OPPO A58 launch : ఒప్పో నుంచి ఏ58 4జీ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
ఒప్పో ఏ58 4జీ లాంచ్ రేపే.. ధర, ఫీచర్స్ లీక్!
OPPO A58 launch : ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై ఫోకస్ పెంచింది ఒప్పో సంస్థ. త్వరలోనే ఓ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుందని సమాచారం. దీని పేరు ఒప్పో ఏ58. ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాము..
ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఏంటి..?
ఒప్పో ఏ58 4జీలో 6.72 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ స్క్రీన్ ఉంటుంది. సైడ్ ఫేసింగ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ దీని సొంతం. ఇందులో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ పోట్రైట్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపీ కెమెరా వస్తుందని లీక్స్ సూచిస్తున్నాయి.
OPPO A58 4G price in India : ఈ గ్యాడ్జెట్లో హీలియో జీ85 ప్రాసెసర్ ఉండొచ్చు. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, ఈఎంఎంసీ 5.1 స్టోరేజ్ వంటివి లభించే అవకాశం ఉంది. ఆడ్రాయిడ్ 13 ఆధారిత కలర్ఓఎస్ 13.1 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుందని సమాచారం. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ వస్తుంది.
డాజ్లింగ్ గ్రీన్, గ్లోయింగ్ బ్లాక్ కలర్స్‌లో ఈ స్మార్ట్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
ఇదీ చూడండి:- బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్.. వీటి ధర రూ. 10వేల కన్నా తక్కువే!
లాంచ్ ఎప్పుడు? ధర ఎంత?
ఒప్పో ఏ58 4జీకి ఇటీవలే బీఐఎస్ సర్టిఫికేట్ లభించింది. ఇక ఆగస్ట్ 8న ఈ మొబైల్ లాంచ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా ఉండొచ్చు.
ధరకు సంబంధించిన వార్త నిజమే అయితే.. ఈ ఫీచర్స్‌కు ప్రైజ్ కాస్త ఎక్కువేనని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పోకో ఎం6 ప్రో చూశారా..?
POCO M6 Pro price : రూ. 14,999 ప్రైజ్ ట్యాగ్‌తో ఒప్పో ఏ58 లాంచ్ అయితే.. పోకో ఎం6 ప్రో దానికి ప్రత్యామ్నాయంగా ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇందులో 6.79 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ స్క్రీన్ వస్తోంది. 50ఎంపీతో కూడిన డ్యూయెల్ రేర్ కెమెరా దీని సొంతం. ఫ్రెంట్లో 8ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తోంది.
ఇక ఈ గ్యాడ్జెట్లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ సెటప్ లభిస్తుంది. 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.