తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Electric Scooter Moveos 3: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యాజర్లకు గుడ్‍న్యూస్.. ఈ ముఖ్యమైన ఫీచర్లు వచ్చేస్తున్నాయ్

Ola Electric Scooter MoveOS 3: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యాజర్లకు గుడ్‍న్యూస్.. ఈ ముఖ్యమైన ఫీచర్లు వచ్చేస్తున్నాయ్

15 December 2022, 13:14 IST

google News
    • Ola Electric Scooters - MoveOS 3 Update: ఓలా ఎస్1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మూవ్ఓఎస్3 అప్‍డేట్ వస్తోంది. వచ్చే వారంలో అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా చాలా ఫీచర్లు యాడ్ కానున్నాయి. వాటి ఉపయోగమేంటో ఇక్కడ తెలుసుకోండి.
Ola Electric Scooter MoveOS 3: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యాజర్లకు గుడ్‍న్యూస్.. ఈ ముఖ్యమైన ఫీచర్లు వచ్చేస్తున్నాయ్
Ola Electric Scooter MoveOS 3: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యాజర్లకు గుడ్‍న్యూస్.. ఈ ముఖ్యమైన ఫీచర్లు వచ్చేస్తున్నాయ్ (HT Auto)

Ola Electric Scooter MoveOS 3: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యాజర్లకు గుడ్‍న్యూస్.. ఈ ముఖ్యమైన ఫీచర్లు వచ్చేస్తున్నాయ్

Ola Electric Scooters - MoveOS 3 Update: ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుతున్న వారు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మూవ్ఓస్ 3 వచ్చేస్తోంది. మూవ్ఓఎస్ 3 అప్‍డేట్‍… వచ్చేవారంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లకు రానుంది. ఈ విషయాన్ని ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ భవీశ్ అగర్వార్ వెల్లడించారు. ఇప్పటి వరకు బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఓఎస్.. ఇక Ola S1, Ola S1 Pro యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‍‍తో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు చాలా ఉపయోగకరమైన ఫీచర్లు యాడ్ కానున్నాయి. పూర్తి వివరాలు ఇవే..

ప్రాగ్జిమిటీ అన్‍లాక్

మూవ్ఓఎస్ 3 అప్‍డేట్ ద్వారా ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రాగ్జిమిటీ అన్‍లాక్ ఫీచర్ యాడ్ అవుతుంది. దీంతో పిన్ ఎంటర్ చేయకుండా/ మొబైల్ అప్లికేషన్‍ను ఓపెన్ చేయకుండానే స్కూటర్‌ను అన్‍లాక్ చేయవచ్చు. లాగిన్ అయిన మీ స్మార్ట్ ఫోన్‍ను బైక్ దగ్గరికి తీసుకెళితే ప్రాగ్జిమిటీ సెన్సార్ ద్వారా గుర్తించి స్కూటర్ ఆన్ అవుతుంది. ప్రొఫైళ్లను ఇతరులకు యాప్ ద్వారా షేర్ కూడా చేయవచ్చు.

హైపర్‌చార్జింగ్

మూవ్ఓఎస్ 3 అప్‍డేట్ ద్వారా ఓలా ఎస్1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లలో హైపర్ చార్జ్ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది. దీంతో 15 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణానికి సరిపడా బ్యాటరీ చార్జ్ అవుతుంది. హైపర్ చార్జర్ల సంఖ్యను పెంచేందుకు ఓలా ప్రయత్నిస్తోంది. హైపర్ చార్జర్ల లొకేషన్‍ను ఓలా యాప్‍లో యూజర్లు చూడవచ్చు.

ఎత్తైన ప్రాంతాలు సులభంగా..

మూవ్ ఓఎస్3 ద్వారా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు హిల్ హోల్డ్ కంట్రోల్ ఫీచర్ వస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఎత్తైన రోడ్లను ఓలా స్కూటర్లు సులభంగా ఎక్కుతాయి. ప్రస్తుతం ఎక్కువ ఉన్న రోడ్లపై ఓలా స్కూటర్లు కొన్నిసార్లు థ్రాట్లింగ్‍తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

పార్టీ మోడ్, రైడింగ్ మూడ్స్: ఓలా ఎస్ 1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మూవ్ఓఎస్ 3 అప్‍డేట్ ద్వారా పార్టీ మోడ్, రైడింగ్ మూడ్స్ యాడ్ అవుతాయి. పార్టీ మోడ్ ఆన్ చేసుకుంటే స్పీకర్లలో మీరు ప్లే చేసే పాటల మ్యూజిక్‍కు అనుగుణంగా స్కూటర్ లైట్లు వెలుగుతుంటాయి. బోల్ట్, వింటేజ్, ఎక్లిప్స్ లాంటి మూడ్స్ కూడా అందుబాటులోకి వస్తాయి.

మరిన్ని..

మూవ్ఓఎస్ 3 సాఫ్ట్‌వేర్ అప్‍డేట్ ద్వారా స్పోర్ట్స్ మోడ్స్, హైపర్ మోడ్‍లలో స్కూటర్ యాక్సలరేషన్ మెరుగవుతుందని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. స్కూటర్ వాడకుండా పక్కన పెట్టినప్పుడు బ్యాటరీ అయిపోకుండా హైబర్‌నేషన్ మోడ్‍ను కూడా యాడ్ చేసినట్టు పేర్కొంది. డిస్‍ప్లేలో కాల్ అలర్టులు పొందవచ్చు. డాక్యుమెంట్లు స్టోర్ చేసుకొని చదువుకోవచ్చని చెప్పింది.

తదుపరి వ్యాసం