తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Electric Offers: ఈ పండుగ సీజన్ లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ పై డిస్కౌంట్ ఆఫర్స్

Ola Electric offers: ఈ పండుగ సీజన్ లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ పై డిస్కౌంట్ ఆఫర్స్

HT Telugu Desk HT Telugu

11 January 2024, 19:14 IST

  • Ola Electric offers: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) రూ. 15,000 వరకు విలువైన ఆఫర్‌లను ప్రకటించింది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్

Ola Electric offers: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్స్ రేంజ్ పై రూ. 15,000 వరకు విలువైన ఆఫర్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్ జనవరి 15వ తేదీ వరకు అమలులో ఉంటుంది.

రూ. 15 వేల వరకు..

ఈ ఆఫర్‌లలో S1 Pro, S1 Air కొనుగోలుపై రూ. 6,999 వరకు విలువైన ఎక్స్ టెండెడ్ బ్యాటరీ వారంటీ, రూ. 3,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్, ఇతర ఆకర్షణీయమైన ఫైనాన్స్ డీల్‌లు ఉన్నాయి. అదనంగా, S1 X+ పై రూ. 20,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. దాంతో S1 X+ రూ. 89,999 లకు లభిస్తుంది.

అదనపు ఆఫర్స్..

కొనుగోలుదారులు తాము ఎంచుకున్న క్రెడిట్ కార్డ్ EMIలపై రూ. 5,000 వరకు అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు.అలాగే, ఇతర ఫైనాన్స్ ఆఫర్‌లలో జీరో డౌన్ పేమెంట్, నో-కాస్ట్ EMI, జీరో-ప్రాసెసింగ్ ఫీజు, 7.99% తక్కువ వడ్డీ రేట్లు వంటి ఇతర డీల్‌లు కూడా ఉంటాయి.

మొత్తం ఐదు మోడల్స్

ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తన స్కూటర్ పోర్ట్‌ఫోలియోను ఐదు ఉత్పత్తులకు విస్తరించింది. S1 ప్రో (2వ తరం) ధర రూ. 1,47,499 కాగా, S1 ఎయిర్ ధర రూ. 1,19,999. తాజాగా అదనంగా, వినియోగదారుల సౌకర్యార్థం S1Xని మూడు వేరియంట్‌లలో ఓలా ఎలక్ట్రిక్ పరిచయం చేసింది. అవి S1 X+, S1 X (3kWh), S1 X (2kWh). వీటిలో S1 X (3kWh), S1 X (2kWh) ఎలక్ట్రిక్ స్కూటర్ లను రూ. 999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. వీటిలో S1 X (3kWh) ఎక్స్ షో రూమ్ ధర రూ. 99,999 కాగా, S1 X (2kWh) ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 89,999 గా నిర్ణయించారు.

తదుపరి వ్యాసం