తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nokia C22: నోకియా నుంచి మరో బడ్జెట్ ఫోన్: లాంచ్ డేట్ ఫిక్స్: వివరాలివే

Nokia C22: నోకియా నుంచి మరో బడ్జెట్ ఫోన్: లాంచ్ డేట్ ఫిక్స్: వివరాలివే

09 May 2023, 15:04 IST

    • Nokia C22 India launch date: ఇండియాలో నోకియా సీ22 లాంచ్ డేట్ ఖరారైంది. బడ్జెట్ రేంజ్‍లో ఈ 4జీ ఫోన్ అడుగుపెట్టనుంది.
Nokia C22: నోకియా నుంచి మరో బడ్జెట్ ఫోన్: లాంచ్ డేట్ ఫిక్స్: వివరాలివే (Photo: Nokia)
Nokia C22: నోకియా నుంచి మరో బడ్జెట్ ఫోన్: లాంచ్ డేట్ ఫిక్స్: వివరాలివే (Photo: Nokia)

Nokia C22: నోకియా నుంచి మరో బడ్జెట్ ఫోన్: లాంచ్ డేట్ ఫిక్స్: వివరాలివే (Photo: Nokia)

Nokia C22 India launch date: నోకియా నుంచి భారత మార్కెట్‍లోకి మరో బడ్జెట్ మొబైల్ వస్తోంది. నోకియా సీ22 (Nokia C22) ఫోన్ ఈ నెల 11వ తేదీన ఇండియాలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని నోకియా అధికారికంగా ప్రకటించింది. రెండు నెలల క్రితం యూరోపియన్ మార్కెట్‍లో సీ22 విడుదల కాగా.. ఇప్పుడు ఇండియాకు వస్తోంది. బడ్జెట్ రేంజ్‍లోనే ఈ 4జీ ఫోన్ ఉండనుంది. 5,000mAh బ్యాటరీని ఈ మొబైల్ కలిగి ఉంటుంది. Nokia C22 వివరాలను ఇక్కడ చూడండి.

Nokia C22 India launch date: నోకియా సీ22 ఫోన్‍ను మరో రెండు రోజుల్లో (మే 11) భారత మార్కెట్‍లో లాంచ్ చేయనున్నట్టు నోకియా మొబైల్ ఇండియా నేడు (మే 9) ట్వీట్ చేసింది. ఓ టీజర్‌ను పోస్ట్ చేసింది. ఏఐ కెమెరాలు, మూడు రోజుల బ్యాటరీ లైఫ్‍ను ఈ ఫోన్ కలిగి ఉంటుందని ఆ వీడియోలో టీజ్ చేసింది. మిగిలిన వివరాలను వెల్లడించలేదు. అయితే, ఇప్పటికే ఈ ఫోన్ యూరోపియన్ మార్కెట్‍లో లాంచ్ అవడంతో పూర్తి స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి.

నోకియా సీ22 ధర

Nokia C22 Price: నోకియా సీ22 మొబైల్ ధర యూరప్‍లో 109 యూరోలు (సుమారు రూ.9,500)గా ఉంది. ఇండియాలోనూ రూ.10వేలలోపు ధరకే ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. చార్కోల్, పర్పుల్, సాండ్ కలర్ ఆప్షన్‍లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

నోకియా సీ22 స్పెసిఫికేషన్లు

Nokia C22 Specifications: యూరప్‍లో లాంచ్ అయిన స్పెసిఫికేషన్లతోనే నోకియా సీ22 ఇండియాకు కూడా వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. 6.5 ఇంచుల హెచ్‍డీ+ ఎల్‍సీడీ డిస్‍ప్లేను నోకియా సీ22 కలిగి ఉంది. యునీఎస్‍ఓసీ ఎస్‍సీ9863ఏ (Unisoc SC9863A) ప్రాసెసర్‌పై ఈ 4జీ ఫోన్ రన్ అవుతుంది. 2 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఉంటుంది.

Nokia C22: ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టమ్‍తో నోకియా సీ22 వస్తుంది. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని వర్చువల్‍గా ర్యామ్‍ను పొడిగించుకునే ఫీచర్ కూడా ఉంటుంది.

నోకియా సీ22 ఫోన్ వెనుక రెండు కెమెరాలు ఉంటాయి. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉంటాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్ మొబైల్ వెనుకవైపు ఉంటుంది. 5000mAh బ్యాటరీతో నోకియా సీ22 వస్తోంది. స్టాండర్డ్ 10 వాట్ల చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. నోటి బిందువులు, దుమ్ము నుంచి రక్షణ ఉండేలా ఐపీ52 రేటింగ్‍ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది.

తదుపరి వ్యాసం