తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Noise Colorfit Caliber Buzz Smartwatch: 1499 రూపాయలకే ఈ ట్రెండీ స్మార్ట్ వాచ్

Noise ColorFit Caliber Buzz smartwatch: 1499 రూపాయలకే ఈ ట్రెండీ స్మార్ట్ వాచ్

HT Telugu Desk HT Telugu

08 January 2024, 21:39 IST

google News
    • దేశీ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ సంస్థ ‘నాయిస్ (Noise)’ నుంచి కొత్త అడ్వాన్స్ డ్ స్మార్ట్ వాచ్ మార్కెట్లోకి వచ్చింది. ఈ నాయిస్ కలర్ ఫిట్ కేలిబర్ బజ్ (Noise ColorFit Caliber Buzz) స్మార్ట్ వాచ్ ను సంస్థ వెబ్ సైట్ నుంచి కానీ, ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (flipkart) నుంచి కానీ కొనుగోలు చేయొచ్చు. 
 నాయిస్ కలర్ ఫిట్ కేలిబర్ బజ్ (Noise ColorFit Caliber Buzz) స్మార్ట్ వాచ్
నాయిస్ కలర్ ఫిట్ కేలిబర్ బజ్ (Noise ColorFit Caliber Buzz) స్మార్ట్ వాచ్ (Noise)

నాయిస్ కలర్ ఫిట్ కేలిబర్ బజ్ (Noise ColorFit Caliber Buzz) స్మార్ట్ వాచ్

స్మార్ట్ వాచ్ మార్కెట్ రోజురోజుకీ విస్తరిస్తోంది. రెగ్యులర్ డయల్ స్థానంలో స్మార్ట్ డయల్ తో వచ్చే ఈ స్మార్ట్ వాచెస్ పలు సేవలను ముంజేతి నుంచే అందిస్తున్నాయి. కాల్ ఆప్షన్, ఫిట్ నెస్ ఫీచర్లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.

Noise ColorFit Caliber Buzz: నాలుగు రంగుల్లో..

ఈ నాయిస్ కలర్ ఫిట్ కేలిబర్ బజ్(Noise ColorFit Caliber Buzz) కు మంచి కాంపిటీటివ్ ప్రైసింగ్ ను ఇచ్చారు. రూ. 1499 లకే అన్ని ఫీచర్లతో ఆకర్షణీయమైన స్మార్ట్ వాచ్ ను అందిస్తున్నారు. స్క్వేర్ షేప్ లోని డయల్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఈ వాచ్ జెట్ బ్లాక్, ఆలివ్ గ్రీన్, మిడ్ నైట్ బ్లూ, రోజ్ పింక్ కలర్లలో లభిస్తుంది. అలాగే, 500 నిట్ బ్రైట్ నెస్ తో, టీఎఫ్టీ డిస్ ప్లేతో వస్తున్న ఈ స్మార్ట్ వాచ్ డయల్ సైజ్ 1.69 అంగుళాలు ఉంటుంది.

Noise ColorFit Caliber Buzz ఫీచర్లివే..

Noise ColorFit Caliber Buzz స్మార్ట్ వాచ్ డిస్ ప్లే రిజొల్యూషన్ 240x280 పిక్సెల్స్. ఇందులో కాల్ ఫ్రమ్ డయల్ పాడ్ ఫీచర్ ఉంది. బ్యాటరీ ఏడు రోజులు వస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది. ఇందులో హార్ట్ రేట్ మానిటరింగ్, యాక్టివిటీ లెవెల్ ట్రాకింగ్, ఎస్పీఓ2(SPO2) మెజరింగ్, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ ట్రాకింగ్, సైకిల్ ట్రాకింగ్, బ్రీత్ ప్రాక్టీస్ వంటి ఫీచర్లున్నాయి. అలాగే, డైలీ రిమైండర్లు, వెదర్ అప్ డేట్స్, స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్ డేట్స్ ను కూడా ఈ స్మార్ట్ వాచ్ అందిస్తుంది. ఇందులో 100 కు పైగా స్పోర్ట్స్ మోడల్స్, 150కి పైగా క్లౌడ్ బేస్డ్ ఫేసెస్ ఉన్నాయి. ఇది వీ 5.2 బ్లూటూత్ కనెక్టివిటీ (Bluetooth v5.2) కలిగి ఉంది.

Noise ColorFit Caliber Buzz: యూత్ టార్గెట్

యువత, విద్యార్థులు లక్ష్యంగా ఈ స్మార్ట్ వాచ్ ను రూపొందించినట్లు నాయిస్(Noise) సహ వ్యవస్థాపకుడు అమిత్ ఖాత్రి తెలిపారు. ఎక్కువ ఖరీదు లేని, అన్ని ఫీచర్లున్న స్మార్ట్ వాచ్ ను వారికి అందిస్తున్నామన్నారు. ఇటీవలనే ఈ సంస్థ ColorFit Pro 4 Alpha అనే స్మార్ట్ వాచ్ ను కూడా మార్కెట్లో లాంచ్ చేసింది. ఆ స్మార్ట్ వాచ్ ధర ను రూ. 3,799గా నిర్ధారించింది.

టాపిక్

తదుపరి వ్యాసం