తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ethanol Run Innova: పూర్తిగా ఇథనాల్ తో నడిచే టయోటా ఇన్నోవా.. పెట్రోలు అవసరమే లేదు..

Ethanol run Innova: పూర్తిగా ఇథనాల్ తో నడిచే టయోటా ఇన్నోవా.. పెట్రోలు అవసరమే లేదు..

HT Telugu Desk HT Telugu

29 August 2023, 15:41 IST

google News
  • Ethanol run Innova: పూర్తిగా, 100 శాతం ఇథనాల్ ఇంధనంతో నడిచే ఇన్నోవా వాహనాన్ని టయొటా రూపొందించింది. ఈ టయోటా ఇన్నోవా (Toyota Innova) కారును మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Toyota)

ప్రతీకాత్మక చిత్రం

Ethanol run Innova: పూర్తిగా, 100 శాతం ఇథనాల్ ఇంధనంతో నడిచే ఇన్నోవా వాహనాన్ని టయొటా రూపొందించింది. ఈ టయోటా ఇన్నోవా హై క్రాస్ మోడల్ కారు (Toyota Innova HyCross) ను మంగళవారం కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. ఈ వాహనం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోలు తో పాటు, పూర్తిగా 100% ఇథనాల్ తో కూడా నడుస్తుంది.

ఫస్ట్ ఫ్లెక్సిబుల్ ఫ్యుయెల్ వెహికిల్

ఇది ప్రపంచంలోనే తొలి బీఎస్ 6 ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యుయెల్ (flex-fuel) వెహికిల్ గా రికార్డు సృష్టించింది. ఈ ఫ్లెక్సిబుల్ ఫ్యుయెల్ వాహనాల్లోని ఇంజన్ లో ఇంటర్నల్ కంబషన్ విధానం ఉంటుంది. ఈ వాహనాలు అటు పూర్తిగా పెట్రోలు తోను, అలాగే, పెట్రోలు - ఇథనాల్ బ్లెండ్ తోనూ, అలాగే, పూర్తిగా ఇథనాల్ తోనూ నడుస్తాయి. ఇప్పటివరకు 83% ఇథనాల్ బ్లెండ్ తో నడిచే వాహనాలను రూపొందించారు. కానీ, పూర్తిగా 100% ఇథనాల్ తో నడిచే తొలి వెహికిల్ గా టయోటా ఇన్నోవా హై క్రాస్ నిలిచింది.

దిగుమతుల భారం తగ్గుతుంది..

ఇథనాల్ తో నడిచే వాహనాల వల్ల పెట్రోలు వినియోగం తగ్గుతుందని, తద్వారా పెట్రోలు దిగుమతులు తగ్గి, విదేశీ మారక ద్రవ్యం సేవ్ అవుతుందని నితిన్ గడ్కరీ వివరించారు. ఇథనాల్ వంటి బయో ఫ్యుయెల్స్ పర్యావరణ పరంగా కూడా మంచివన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా అడుగులు వెయ్యడానికి ఇలాంటి ఆవిష్కరణలు అవసరమన్నారు. ఆయిల్ దిగుమతులపై ప్రస్తుతం రూ. 16 లక్షల కోట్లను ఖర్చు చేస్తున్నామని, ఆ ఖర్చును పూర్తిగా తగ్గిస్తే, ఆ మొత్తాన్ని ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చని వివరించారు. ఇంధన దిగుమతుల ఖర్చు భారత ఆర్థిక రంగానికి పెను భారంగా మారిందన్నారు. పెట్రో ఉత్పత్తులకు బదులుగా ప్రత్యామ్నాయ, పర్యావరణ సురక్షిత ఇంధనాలను వినియోగించే వాహనాలను అభివృద్ధి చేయాలని వాహన తయారీ సంస్థలను ఆయన కోరారు. తద్వారా వాయు కాలుష్యం, జల కాలుష్యం తగ్గుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాథమ్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

ఇథనాల్ అంటే..

ఇథైల్ ఆల్కహాల్ నే ఇథనాల్ అని కూడా ఉంటారు. దీని కెమికల్ ఫార్మూలా C2H5OH. ఇది బయో ఫ్యుయెల్. షుగర్ కిణ్వ ప్రక్రియ (fermentation) ద్వారా ఇది రూపొందుతుంది. చెరకు పరిశ్రమకు, చెరకు రైతులకు దీనిద్వారా మంచి ఆదాయం అందించవచ్చు. చెరకు తో పాటు ఇతర ధాన్యాలను కూడా ఇథనాల్ తయారీకి ఉపయోగించవచ్చు. ఇథనాల్ ను పెట్రోల్ తో కలిపే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రొగ్రామ్ ను కేంద్రం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 2025 నాటికి 20% ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోలు వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

తదుపరి వ్యాసం