WhatsApp New feature: వాట్సాప్ లో కొత్త ఫీచర్; ఇలా చేస్తే ఇకపై మీ ఫోన్ నెంబర్ ఇతరులకు కనిపించదు..
12 July 2023, 10:37 IST
- WhatsApp New feature: ప్రముఖ షార్ట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్ (WhatsApp)’ త్వరలో కొత్త ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ తో యూజర్లకు తమ ప్రైవసీ విషయంలో మరింత ప్రయోజనం చేకూరనుంది.
ప్రతీకాత్మక చిత్రం
WhatsApp New feature: ప్రముఖ షార్ట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్ (WhatsApp)’ త్వరలో కొత్త ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ తో యూజర్లకు తమ ప్రైవసీ విషయంలో మరింత ప్రయోజనం చేకూరనుంది.
phone number privacy: ఫోన్ నెంబర్ ప్రైవసీ..
వాట్సాప్ త్వరలో ‘ఫోన్ నెంబర్ ప్రైవసీ (phone number privacy)’ పేరుతో మరో కొత్త ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో ఐ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని వాట్సాప్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, వాట్సాప్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాజాగా వెల్లడించే వీఏబీటాఇన్ఫో (WABetaInfo) వెబ్సైట్ ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ లేటెస్ట్ అప్ డేట్ ఉన్న బీటా యూజర్లకు మాత్రమే ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది.
WhatsApp community: వీరికి మాత్రమే ఈ ఫీచర్
ఈ ఫీచర్ వాట్సాప్ కమ్యూనిటీ యూజర్లు మాత్రమే ఉపయోగించగలరు. వాట్సాప్ కమ్యూనిటీలోని యూజర్లు తమ ఫోన్ నెంబర్ తమకు పరిచయం లేని ఇతరులకు తెలియడం ఇష్టం లేకపోతే.. తమ వాట్సాప్ సెట్టింగ్స్ లో ఈ ‘ఫోన్ నెంబర్ ప్రైవసీ (phone number privacy)’ ఫీచర్ ను ఇనేబుల్ చేసుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్ ను ఇనేబుల్ చేసుకున్నప్పటికీ.. కమ్యూనిటీ అడ్మిన్ కు, అలాగే, కాంటాక్ట్ ఇప్పటికే తమ ఫోన్ లో సేవ్ అయి ఉన్నవారికి ఈ ఫోన్ నెంబర్ లేదా ఆ నెంబర్ తో సేవ్ అయి ఉన్న పేరు కనిపిస్తుంది. కమ్యూనిటీలోని ఇతరులకు మాత్రం కనిపించదు. అలాగే, కమ్యూనిటీ అడ్మిన్ (community admin) కూడా ఈ ఫీచర్ ను ఇనేబుల్ చేసుకోలేడు. కమ్యూనిటీ అడ్మిన్ నెంబర్ ఆ కమ్యూనిటీలోని అందరు మెంబర్స్ కు కనిపిస్తుంది.