తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mg Gloster Blackstorm: ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ ఎడిషన్ కారు వచ్చేసింది: ధర ఎంతంటే!

MG Gloster Blackstorm: ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ ఎడిషన్ కారు వచ్చేసింది: ధర ఎంతంటే!

29 May 2023, 18:23 IST

google News
    • MG Gloster Blackstorm edition: ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ ఎడిషన్ వచ్చేసింది. ఈ ఎడిషన్ ప్రత్యేకతలు, ధర వివరాలు ఇక్కడ చూడండి.
MG Gloster Blackstorm: ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ ఎడిషన్ వచ్చేసింది: ధర ఎంతంటే!
MG Gloster Blackstorm: ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ ఎడిషన్ వచ్చేసింది: ధర ఎంతంటే!

MG Gloster Blackstorm: ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ ఎడిషన్ వచ్చేసింది: ధర ఎంతంటే!

MG Gloster Blackstorm edition: ప్రీమియమ్ ఎస్‍యూవీ గ్లోస్టర్‌కు బ్లాక్‍స్టామ్ ఎడిషన్‍ను లాంచ్ చేసింది ఎంజీ మోటార్ సంస్థ. స్టాండర్డ్ వెర్షన్‍తో పోలిస్తే లుక్‍పరంగా ఈ స్పెషల్ ఎడిషన్ విభిన్నంగా, స్పోర్టీగా ఉంది. మెటల్ బ్లాక్, మెటల్ యాష్ పెయింట్ ఆప్షన్‍లలో ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ స్పెషల్ ఎడిషన్ వచ్చింది. వివరాలివే.

ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ ఎడిషన్ కారు రూఫ్ రైల్స్, టైల్ ల్యాంప్స్, హెడ్‍ల్యాంప్ హౌసింగ్, విండో ట్రిమ్స్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‍‍లకు కూడా బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాయ్ వీల్స్ కూడా బ్లాక్ కలర్‌లోనే ఉన్నాయి. కాగా, ఎక్స్‌టీరియర్‌కు అక్కడక్కడా రెడ్ యాసెంట్స్ ఉన్నాయి. హెడ్‍ల్యాంప్స్, బ్రేక్ క్యాలిపర్స్, ఫ్రంట్, రేర్ బంపర్స్, వింగ్ మిర్రర్స్ వద్ద కాస్త రెడ్ కలర్ ఎలిమింట్స్ ఉన్నాయి. ఫ్రంట్ క్రోమ్ గ్రిల్.. హారిజాంటల్ స్లాట్‍లనే కలిగి ఉంది.

ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ ఎడిషన్ ఇంటీయర్ కూడా ఆల్-బ్లాక్ లేఅవుట్‍‍తో ఉంది. సీట్లు బ్లాక్ కలర్‌లో ఉన్నాయి. మొత్తంగా ఇంటీరియర్ బ్లాక్, బీక్, ట్యాన్ టోన్‍తో ఉంది. అక్కడక్కడా రెడ్ కలర్ టచ్ ఇచ్చింది ఎంజీ మోటార్. సిక్స్ సీట్, సెవెన్ సీట్ ఆప్షన్‍లో ఈ ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ ఎడిషన్ అందుబాటులోకి వచ్చింది.

ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, స్టాండర్డ్ గ్లోస్టర్ మోడల్‍నే ఈ ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ ఎడిషన్ కారు కూడా కలిగి ఉంది. 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‍ను కలిగి ఉంది. రెండు ఇంజిన్ వేరియంట్లు ఉంటాయి. 2WD వెర్షన్ ఇంజిన్ 163 hp పవర్, 374 టార్క్యూను జనరేట్ చేస్తుంది. 4WD వెర్షన్ ఇంజిన్ 218 హెచ్‍పీ పవర్, 479 Nm పీక్ టార్క్యూను ప్రొడ్యూజ్ చేస్తుంది. రెండు ఇంజిన్ ఆప్షన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సులను కలిగి ఉన్నాయి. లెవెల్ 1 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) సహా సుమారు 30 సెఫ్టీ ఫీచర్లను ఈ కారు కలిగి ఉంది.

ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ ఎడిషన్ ధరలు

ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‍స్టామ్ ఎడిషన్ 2WD వేరియంట్ ధర రూ.40.29లక్షలుగా ఉంది. 4WD వేరియంట్ ధర రూ.43.08లక్షలుగా ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. సిక్స్, సెవెన్ సీట్స్ కన్ఫిగరేషన్‍లలో ఈ ఎడిషన్ లభిస్తోంది.

తదుపరి వ్యాసం