తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mg Comet Ev Highlights: సూపర్‌గా ఎంజీ కామెట్ ఈవీ: ఈ ఎలక్ట్రిక్ కారు హైలైట్స్ ఇవే

MG Comet EV Highlights: సూపర్‌గా ఎంజీ కామెట్ ఈవీ: ఈ ఎలక్ట్రిక్ కారు హైలైట్స్ ఇవే

20 April 2023, 14:14 IST

google News
    • MG Comet EV: ఎంజీ కామెట్ ఈవీ భారత మార్కెట్‍లో అడుగుపెట్టింది. ఈ హ్యాచ్‍బ్యాక్ ఎలక్ట్రిక్ కారును ఎంజీ మోటార్ ఆవిష్కరించింది.
MG Comet EV Highlights: సూపర్‌గా ఎంజీ కామెట్ ఈవీ: ఈ ఎలక్ట్రిక్ కారు 5 హైలైట్స్ ఇవే (Photo: MG Motor)
MG Comet EV Highlights: సూపర్‌గా ఎంజీ కామెట్ ఈవీ: ఈ ఎలక్ట్రిక్ కారు 5 హైలైట్స్ ఇవే (Photo: MG Motor)

MG Comet EV Highlights: సూపర్‌గా ఎంజీ కామెట్ ఈవీ: ఈ ఎలక్ట్రిక్ కారు 5 హైలైట్స్ ఇవే (Photo: MG Motor)

MG Comet EV: ఎంతగానో ఎదురుచూసిన కామెట్ ఈవీ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును ఎంజీ మోటార్ ఇండియా ఆవిష్కరించింది. భారత మార్కెట్‍కు ఈ నయా ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. ఈ ఎంజీ కామెట్ ఈవీ హ్యా‍చ్‍బ్యాక్‍ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. అయితే ధరను మాత్రం ఈనెలాఖరులో ప్రకటించనున్నట్టు చెప్పింది. రేటు మినహా ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ముఖ్యమైన విషయాలు ఇవే.

ఎంజీ కామెట్ ఈవీ: డిజైన్

MG Comet EV: బాక్సీ డిజైన్‍తో చూడడానికి ఆకర్షణీయంగా ఈ ఎంజీ కామెట్ ఈవీ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు వచ్చింది. డీఆర్ఎల్‍తో ఎల్ఈడీ హెడ్‍ల్యాంప్స్, టైల్ ల్యాంప్స్, ఎన్‍క్లోజ్డ్ గ్రిల్‍ను ఈ కారు కలిగి ఉంది. ఈ కారు ముందు, వెనుక ఎల్ఈడీ స్ట్రిప్ ఉంటుంది. 12 ఇంచుల సైజ్ ఉండే వీల్‍లతో ఈ ఎలక్ట్రిక్ కారు వస్తోంది. ఈ 2-డోర్ ఎలక్ట్రిక్ కారులో నలుగురు కూర్చొవచ్చు.

ఎంజీ కామెట్ ఈవీ: ఇంటీరియర్, ఫీచర్లు

MG Comet EV: ఎంజీ కామెట్ ఈవీ ఇంటీరియర్‌లో రెండు స్క్రీన్లు ఉంటాయి. 10.25 ఇంచుల సైజ్ ఉండే ఇన్ఫోటైన్‍మెంట్ టచ్ స్క్రీన్, 10.25 ఇంచుల డిజిటల్ ఇస్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటాయి. టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, కార్ కనెక్టెడ్ టెక్నాలజీతో వస్తోంది. యాంబియంట్ లైట్స్, పార్కింగ్ సెన్సార్, డ్యుయల్ టోన్ రూఫ్‍తో ఈ కామెట్ ఈవీ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు వచ్చింది.

డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్‍సీ, టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ సేఫ్టీ ఫీచర్లను ఎంజీ కామెట్ ఈవీ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు కలిగి ఉంది.

ఎంజీ కామెట్ ఈవీ: బ్యాటరీ, రేంజ్

MG Comet EV: 17.3 kWh లిథియమ్ ఇయాన్ బ్యాటరీతో ఎంజీ కామెట్ ఈవీ వచ్చింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ఈ కారులో ప్రయాణించవచ్చు. ఈ బ్యాటరీ ఏడు గంటల్లో ఫుల్ అవుతుంది. 41 bhp పవర్‌ను, 110 Nm పీక్ టార్క్యూను ఈ కారు మోటార్ జనరేట్ చేయగలదు.

ఎంజీ కామెట్ ఈవీ: కారు సైజు ఇలా..

MG Comet EV: ఎంజీ కామెట్ ఈవీ కారు లెంగ్త్ 2,974 మిల్లీమీటర్లు, వెడల్పు 1,505 మిల్లీమీటర్లు, ఎత్తు 1,640 మిల్లీమీటర్లుగా ఉంది. వీల్ బేస్ 2,010 మిల్లీమీటర్లుగా ఉంటుంది.

ఎంజీ కామెట్ ఈవీ: ధర ఎంత ఉండొచ్చు..

MG Comet EV: ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ధరను ఎంజీ మోటార్ ఈనెల ముగిసేలోగా ప్రకటించనుంది. ఏప్రిల్ 26వ తేదీన వెల్లడిస్తుందని తెలుస్తోంది. ఈ కారు ప్రారంభ ధర రూ.10లక్షల దరిదాపుల్లో ఉండొచ్చు. టాప్ స్పెక్స్ ఉండే వేరియంట్ ధర రూ.15లక్షల వరకు ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. టాటా టియాగో ఈవీ, సిట్రియెన్ ఈసీ3 కార్లతో బడ్జెట్ హ్యాచ్‍బ్యాక్ ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‍లో ఎంజీ కామెట్ ఈవీ పోటీ పడనుంది.

తదుపరి వ్యాసం