తెలుగు న్యూస్  /  బిజినెస్  /  6-airbag Rule: కార్లలో 6 ఎయిర్ బ్యాగుల నిబంధన ఏడాది వాయిదా

6-airbag rule: కార్లలో 6 ఎయిర్ బ్యాగుల నిబంధన ఏడాది వాయిదా

HT Telugu Desk HT Telugu

29 September 2022, 14:54 IST

google News
    • 6-airbag rule: 1 అక్టోబర్, 2022 నుండి ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి అమలు చేస్తామని రోడ్డు మంత్రిత్వ శాఖ గతంలో ప్రకటించింది.
కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన గడ్కరీ
కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన గడ్కరీ (PIB)

కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన గడ్కరీ

6-airbag rule: ప్యాసింజర్ కార్లలో తప్పనిసరి ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల అమలును ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రకటించారు. ప్రపంచ సప్లై చైన్ సమస్యల కారణంగా 6 ఎయిర్‌బ్యాగ్‌ల అమలు వాయిదా పడింది.

1 అక్టోబర్, 2022 నుండి ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి అని రోడ్డు మంత్రిత్వ శాఖ గతంలో ప్రకటించింది. తాజాగా మంత్రి నితిన్ గడ్కరీ కొత్త నిర్ణయాన్ని ప్రకటించారు.

‘మోటారు వాహనాలలో ప్రయాణించే ప్రయాణీకులందరికీ వాటి ధర, వేరియంట్‌లతో సంబంధం లేకుండా వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఆటో పరిశ్రమ ఎదుర్కొంటున్న సప్లై చైన్ పరిమితులను పరిగణనలోకి తీసుకుని ప్యాసింజర్ కార్లలో కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసే ప్రతిపాదనను అక్టోబర్ 01, 2023 నుండి అమలు చేయాలని నిర్ణయించాం..’ అని ట్వీట్ చేశారు.

దేశంలోని కార్ల కోసం భద్రతా నిబంధనలను అనుసరించాల్సిన అవసరాన్ని రోడ్డు రవాణా మంత్రి గతంలో నొక్కిచెప్పారు. చిన్న ఎకానమీ కార్లను ఉపయోగించే వ్యక్తుల భద్రత గురించి కూడా వారు ఆలోచించాలని నొక్కి చెప్పారు.

‘భారత్‌లోని మెజారిటీ ఆటోమొబైల్ తయారీదారులు 6 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన కార్లను ఎగుమతి చేస్తున్నారు. కానీ భారతదేశంలో ఆర్థిక నమూనా, ధర కారణంగా వారు వెనుకాడుతున్నారు’ అని ఆయన చెప్పారు.

భారతదేశంలో ఎకానమీ కార్లను వాడుతున్న వారి జీవితాల గురించి ఆటోమొబైల్ తయారీదారులు ఎందుకు ఆలోచించడం లేదని గడ్కరీ ఆశ్చర్యపోయారు. ఎక్కువగా దిగువ మధ్యతరగతి ప్రజలు చిన్న ఎకానమీ కార్లను కొనుగోలు చేస్తారు.

ఎయిర్‌బ్యాగ్ అనేది వాహనంలో ప్రయాణించే వ్యక్తిని ప్రమాదం జరిగినప్పుడు కాపాడేందుకు ఉద్దేశించిన వ్యవస్థ. దేనినైనా ఢీకొన్న సమయంలో ఈ ఎయిర్ బ్యాగ్ దానంతటే అదే విచ్చుకుని డ్రైవర్ లేదా ప్రయాణికుడు ముందున్న డాష్ బోర్డు గానీ, సీటు గానీ గుద్దుకొని తీవ్రమైన గాయాలను కాకుండా కాపాడుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం