UPI transaction fee : యూపీఐ లావాదేవీలపై ట్రాన్సాక్షన్ ఫీజ్ వేస్తారా? వేస్తే..!
04 March 2024, 12:01 IST
- transaction fee on UPI payments : యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు వసూలు చేస్తే ఏమవుతుంది? ఎంతమంది యూపీఐ యాప్స్‌ని వాడతారు? అన్న ప్రశ్నలపై ఓ సర్వే జరిగింది. పలు ఆసక్తికర విషయాలు వెలువడ్డాయి.
యూపీఐ లావాదేవీలపై ట్రాన్సాక్షన్ ఫీజు వేస్తే..!
UPI payments transaction fee : ఇండియాలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) సేవలు దూసుకెళుతున్నాయి! పేమెంట్స్, లావాదేవీలు సులభంగా జరిగిపోతుండటంతో.. చాలా మంది యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు దాదాపు అందరి స్మార్ట్‌ఫోన్స్‌లో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ ఉంటున్నాయి. అంతా బాగుంది కానీ.. ఈ యూపీఐ లావాదేవీలపై 'ట్రాన్సాక్షన్ ఫీజు' వేస్తే ఏమవుతుంది? ఎంత మంది యాప్స్‌ని వినియోగించేందుకు ముందుకు వస్తారు? అని విషయంపై తాజాగా ఓ సర్వే జరిగింది. సర్వేలో పలు కీలక విషయాలు బయటకి వచ్చాయి.
యూపీఐ లావాదేవీలపై ట్రాన్సాక్షన్ ఫీజు వేస్తే..
లోకల్‌సర్కిల్స్ అనే సంస్థ ఈ ఆన్లైన్ సర్వేని నిర్వహించింది. ట్రాన్సాక్షన్ ఫీజు వేస్తే మాత్రం.. యూపీఐ యాప్స్‌ని వాడటం ఆపేస్తామని.. సర్వేలో పాల్గొన్న మెజారిటీ మంది చెప్పారు! మరోవైపు.. కొందరు, ఇప్పటికే తమపై ఛార్జీలు పడుతున్నాయని చెప్పుకొచ్చారు.
యూపీఐ యాప్స్‌లో ట్రాన్సాక్షన్ ఫీజు ప్రవేశపెడితే.. వాటిని ఇక వాడమని 7శాతం మంది అభిప్రాయపడ్డారు. ట్రాన్సాక్షన్ ఫీజు వేసినా.. పేమెంట్స్, ట్రాన్సాక్షన్స్ కోసం యాప్స్‌ని వాడటాన్ని కొనసాగిస్తామని మరో 23శాతం మంది పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- పేటీఎంకి గుడ్ బై చెబుతున్నారా? ఈ యూపీఐ యాప్స్ మీకోసమే!
UPI payment transaction charges : దేశంలోని 364 జిల్లాలకు చెందిన 34వేల మంది.. ఈ లోకల్‌సర్కిల్స్ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 67శాతం మంది పురుషులు, 33శాతం మంది మహిళలు ఉన్నారు.
గడిచిన 12 నెలల్లో.. తమ యూపీఐ పేమెంట్స్‌పై ఒకటి, అంతకన్నా ఎక్కువసార్లు.. ట్రాన్సాక్షన్ ఫీజు పడిందని.. 37శాతం మంది తెలిపారు.
వాస్తవానికి ఈ యూపీఐ యాప్స్ అనేవి.. మన జీవితంలో ఓ భాగమైపోయాయి. సర్వేలో కూడా దీనిపై ఓ ప్రశ్న అడిగారు. యూపీఐని ఎంత ఫ్రీక్వెంట్‌గా వాడుతున్నారు? అనేది ప్రశ్న. ప్రతి ఇద్దరిలో ఒక యూపీఐ యూజర్.. నెలలో కనీసం 10సార్లైనా ట్రాన్సాక్షన్స్ చేస్తారని సర్వేలో తేలింది.
యూపీఐ పేమెంట్స్‌పై ట్రాన్సాక్షన్ ఫీజు వేస్తారా?
UPI transaction limit : యూపీఐ పేమెంట్స్‌పై ట్రాన్సాక్షన్ ఫీజుకు సంబంధించి.. గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. 2022లో ఆర్బీఐ విడుదల చేసిన ఓ డిస్కషన్ పేపర్ ఇందుకు కారణం! అమౌండ్ బాండ్స్‌ని పెట్టి, వాటికి తగ్గట్టుగా.. యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు వసూలు చేస్తే ఎలా ఉంటుంది? అని ప్రతిపాదిస్తూ.. చర్చకు ఆహ్వానించింది ఆర్బీఐ. కానీ ఆ తర్వాత.. ఈ వ్యవహారంపై ఆర్థికశాఖ స్పందిస్తూ.. యూపీఐ ట్రాన్సాక్షన్స్‌పై ఛార్జీలు వసూలు చేయాలనే ప్రదిపాదన ఏదీ తాము ఇవ్వలేదని స్పష్టం చేసింది.