Mahindra Scorpio N price hike : భారీగా పెరిగిన మహీంద్రా స్కార్పియో- ఎన్ ధరలు
14 January 2023, 11:06 IST
- Mahindra Scorpio N price hike : స్కార్పియో- ఎన్ ధరలను భారీగా పెంచేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
భారీగా పెరిగిన మహీంద్రా స్కార్పియో- ఎన్ ధరలు
Mahindra Scorpio N price hike : కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా. ఫ్లాగ్షిప్ ఎస్యూవీ, మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న స్కార్పియో- ఎన్ ధరను ఒకేసారి భారీగా పెంచేసింది! వేరియంట్లపై రూ. 1లక్ష వరకు ప్రైజ్ హైక్‌ను తీసుకుంది ఈ ఆటో సంస్థ. లాంచ్ అయిన ఆరు నెలల్లోనే.. స్కార్పియో- ఎన్ ధరలను ఈ స్థాయిలో పెంచడం గమనార్హం.
పెరిగిన స్కార్పియో- ఎన్ ధరలు..
దేశీయ ఆటో సంస్థలు.. నూతన ఏడాదిలో వాహనాల ధరలను పెంచే పనిలో పడ్డాయి! ప్రైజ్ హైక్ మీద అనేక సంస్థలు ఇప్పటికే ప్రకటనలు చేసేశాయి. ముడిసరకు ధరలు పెరగడం వంటి కారణాలు చెప్పి.. వాహనాల ధరలను భారీగా పెంచుతున్నాయి. తాజాగా.. ఈ జాబితాలోకి మహీంద్రా అండ్ మహీంద్రా కూడా చేరింది. స్కార్పియో- ఎన్తో ధరల పెంపును మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది.
Mahindra Scorpio N on road price in Hyderabad : గతేడాది జూన్ 27న.. రూ. 11.99లక్షల ప్రారంభ (ఎక్స్‌షోరూం) ధరతో మార్కెట్లో లాంచ్ అయ్యింది మహీంద్రా స్కార్పియో- ఎన్. ఇక ఇప్పుడు.. దాదాపు అన్ని వేరియంట్లపై ధరలు పెరిగాయి. రూ. 15వేలు- రూ. 1లక్ష మధ్యలో ఈ ప్రైజ్ హైక్ ఉంది. జెడ్8 4డబ్ల్యూడీ మేన్యువల్ వేరియంట్‌పై అత్యధికంగా రూ. 1.01లక్షల ప్రైజ్ హైక్ తీసుకుంది మహీంద్రా అండ్ మహీంద్రా. గతంలో రూ. 19.94లక్షల ఎక్స్‌షోరూం ధరకు లభించిన ఈ ఎస్యూవీ.. తాజా పెంపుతో రూ. 20.95లక్షల (ఎక్స్‌షోరూం)కు చేరింది.
గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో మహీంద్రా స్కార్పియో- ఎన్‌కు 5 స్టార్ రేటింగ్ దక్కింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
స్కార్పియో- ఎన్ టాప్ ఎండ్ వేరియంట్ జెడ్8 ఎల్ 4డబ్ల్యూడీ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్పై అత్యల్పంగా ధర పెరిగింది. ఇప్పుడు ఈ వేరియంట్.. రూ. 24.05లక్షల ఎక్స్‌షోరూం ధరకు లభిస్తోంది.
Mahindra Scorpio N booking : ఇక పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో లభిస్తున్న స్కార్పియో- ఎన్ బేస్ వేరియంట్లపై రూ. 65వేలు, రూ. 75వేల ప్రైజ్ హైక్ తీసుకుంది ఆటో సంస్థ.
స్కార్పియో- ఎన్ వేరియంట్లు.. కొత్త ధరల వివరాలు..
Mahindra Scorpio N waiting period : మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌తో పోల్చుకుంటే.. కొత్త స్కార్పియో- ఎన్ పొడవు 206ఎంఎం, వెడల్పు 97ఎంఎం, వీల్‌బేస్ 70ఎంఎం ఎక్కువగా ఉంది. డిజైన్ దాదాపుగా మారిపోయింది. రిఫ్రెషింగ్ లుక్ వస్తోంది. అంతేకాకుండా.. డీప్ ఫారెస్ట్, డాజ్లింగ్ సిల్వర్, రాయల్ గోల్డ్, నెపోలీ బ్లాక్, ఎవరెస్ట్ వైట్, రెడ్ రేంజ్, గ్రాండ్ కన్యాన్ వంటి 7 రంగుల్లో ఈ మహీంద్రా స్కార్పియో- ఎన్ లభిస్తుండటం విశేషం.