తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Lock Your Aadhaar Biometrics: మీ ఆధార్ బయో మెట్రిక్స్ ను ఇలా లాక్ చేసుకోండి; డేటా లీక్ సమస్య నుంచి రక్షణ పొందండి..

Lock your Aadhaar biometrics: మీ ఆధార్ బయో మెట్రిక్స్ ను ఇలా లాక్ చేసుకోండి; డేటా లీక్ సమస్య నుంచి రక్షణ పొందండి..

HT Telugu Desk HT Telugu

02 November 2023, 13:48 IST

google News
  • Lock your Aadhaar biometrics: 81.5 కోట్ల మంది భారతీయుల ఆధార్ వివరాలు లీక్ అయ్యాయన్న వార్త చాలా మందిని షాక్ కు గురి చేసింది. మీ ఆధార్ డేటా సురక్షితంగా ఉండాలంటే, ఆధార్ బయో మెట్రిక్స్ (Aadhaar biometrics) ను లాక్ చేసుకోండి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

ప్రతీకాత్మక చిత్రం

Lock your Aadhaar biometrics: డిజిటల్ ప్రపంచంలో జీవనం సాగిస్తున్న మనకు సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు చాలా అవసరం. ముఖ్యంగా, ప్రతీ దానికి ఆధార్ అవసరమైన నేపథ్యంలో, ఆధార్ వివరాలను సురక్షితంగా దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. యూఐడీఏఐ (Unique Identification Authority of India UIDAI) వెబ్ సైట్ లోకి వెళ్లి మీ ఆధార్ బయోమెట్రిక్స్ ను లాక్ చేసుకోవచ్చు.

బయోమెట్రిక్ లాకింగ్ వల్ల లాభాలు..

ఒకసారి బయోమెట్రిక్‌ని లాక్ చేసిన తర్వాత, ఆధార్ ఎన్ రోల్ మెంట్ సమయంలో ఇచ్చిన వేలి ముద్రలు, కనుపాప, ముఖం తదితర బయోమెట్రిక్స్ ఎవరు కూడా ఉపయోగించడానికి వీలు లేకుండా లాక్ అవుతాయి. లాక్ అయిన ఆధార్ బయోమెట్రిక్స్ ను స్వయంగా ఆధార్ హోల్డర్ కూడా ఉపయోగించలేడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ బయోమెట్రిక్ లాకింగ్ అంటే మీ ఆధార్ బయో మెట్రిక్స్ లో బ్యాంక్ లాకర్ లో పెట్టి దాచుకున్నట్లే అన్నమాట. మళ్లీ మీరు అన్ లాక్ చేసేవరకు ఆ వివరాలను ఎవరూ ఉపయోగించలేరు.

బయోమెట్రిక్స్ లాక్ చేసుకోవడం ఎలా?

ఆధార్ కలిగి ఉన్న వ్యక్తి యూఐడీఏఐ సైట్ లోకి వెళ్లి తన బయోమెట్రిక్ వివరాలను లాక్ చేసుకోవచ్చు. అవసరమైన సమయంలో మళ్లీ అన్ లాక్ చేసుకోవచ్చు. ఈ బయోమెట్రిక్ లాకింగ్/అన్‌లాకింగ్ ప్రక్రియను చాలా సులువుగా చేసుకోవచ్చు. తద్వారా ఆధార్ వివరాలను, బయోమెట్రిక్స్ ను సురక్షితంగా భద్రపర్చుకోవచ్చు. ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా మీ ఆధార్ బయోమెట్రిక్స్ ను లాక్ చేసుకోవచ్చు.

  • యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్ https://resident.uidai.gov.in/bio-lock లోకి లాగిన్ కావాలి.
  • ముందుగా ఒక 16 అంకెల వర్చువల్ ఐడీ (Virtual ID - VID) ని జనరేట్ చేసుకోవాలి. ఆధార్ ను ఈ వర్చువల్ ఐడీ (VID) ద్వారా మాత్రమే లాక్ లేదా అన్ లాక్ చేసుకోవచ్చు.
  • మళ్లీ ఈ https://resident.uidai.gov.in/bio-lock వెబ్ సైట్ లోకి వెళ్లి, మీ ఆధార్ నంబర్, ఓటీపీల సహాయంతో లాగిన్ కావాలి.
  • మీ వర్చువల్ ఐడీ నంబర్ ను, కాప్చా కోడ్ ను ఎంటర్ చేయాలి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి.
  • 'Enable locking feature' ను ఇనేబుల్ చేయాలి.
  • ఇదే ప్రాసెస్ ద్వారా ఈ బయోమెట్రిక్ లాకింగ్ ను డిసేబుల్ చేయవచ్చు.

తదుపరి వ్యాసం