తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Upcoming Ev's In 2023 : 2023లో ‘ఈవీ’ జాతర.. లాంచ్​కు సిద్ధంగా సూపర్​ మోడల్స్​!

Upcoming EV's in 2023 : 2023లో ‘ఈవీ’ జాతర.. లాంచ్​కు సిద్ధంగా సూపర్​ మోడల్స్​!

27 December 2022, 7:43 IST

    • Electric cars launching in 2023 : 2022లో ఇండియాలో కనిపిస్తున్న ఎలక్ట్రిక్​ వాహనాల హవా.. 2023లోనూ కొనసాగనుంది! అనేక సంస్థలు.. 2023లో కొత్త ఈవీ మోడల్స్​ను లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఆ వివరాల ఓసారి చూద్దాము..
సిట్రోయెన్​ లోగో
సిట్రోయెన్​ లోగో (AFP)

సిట్రోయెన్​ లోగో

Electric cars launching in 2023 in India : 2022లో ఇండియా ఈవీ మార్కెట్​ దూసుకెళ్లింది. మునుపెన్నడు కూడా లేని విధంగా.. ఈ సారి వృద్ధి కనిపించింది. ఆటో సంస్థల మధ్య నెలకొన్న తీవ్ర పోటీతో.. ప్రతి నెల కొత్త కొత్త మోడల్స్​ బయటకొచ్చాయి. ఇప్పుడు ఆటో సంస్థల లైనప్​ చూస్తుంటే.. 2023లోనూ ఇదే కొనసాగనుంది! మరి వచ్చే ఏడాది ఇండియాలో లాంచ్​ కానున్న పలు ఎలక్ట్రిక్​ వాహనాల వివరాలను ఓసారి చూద్దాం..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

ఆడీ క్యూ8 ఈ-ట్రాన్​:-

Audi Q8 e-tron launch date in India : అంతర్జాతీయంగా ఈ ఆడీ క్యూ8 ఈ-ట్రాన్​ ఈవీ.. రెండు వేరియంట్లలో లభిస్తోంది. వీటికి ట్వీన్​ మోటార్​ సెటప్​ ఉంటుంది. మొదటి వేరియంట్​కి 89కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే ఇది 505కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది. రెండో వేరియంట్​లో 104కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే ఇది 600కి.మీల దూరం ప్రయాణిస్తుంది.

ఇండియాలో ఆడీ క్యూ8 ఈ-ట్రాన్​ ఈవీ.. 2023 రెండో భాగంలో లాంచ్​ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ధర రూ. 1.05కోట్లు- రూ. 1.25కోట్లు(అంచనా)

సిట్రోయెన్​ ఈసీ3..

Citroen EC3 launch in India : సిట్రోయెన్​ సీ3.. ఈ ఏడాదిలోనే ఇండియా మార్కెట్​లో లాంచ్​ అయ్యింది. ఇక దీనికి ఈవీ వర్షెన్​ను తీసుకొచ్చేందుకు ఆటో సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ సిట్రోయెన్​ ఈ సీ3లో 30.2కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉండొచ్చు. కారులో 3.3కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్, సీసీఎస్​2 ఫాస్ట్​ ఛార్జింగ్​ కెపాసిటీ​ కూడా ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే ఇది 350కి.మీల దూరం ప్రయాణిస్తుందని తెలుస్తోంది.

సిట్రోయెన్​ ఈసీ3.. 2023 జనవరిలో లాంచ్​ అవ్వొచ్చు. ధర రూ. 10లక్షలు- 12లక్షలు(అంచనా).

మిని ఈవీ:-

Mini EV price in India : బీఎండబ్ల్యూ, గ్రేట్​ వాల్​ మోటార్స్​ జాయింట్​ వెంచర్​ కలిసి.. నెక్స్ట్​ జనరేషన్​ మిని ఈవీని రూపొందిస్తున్నాయి. ఇదొక త్రీ- డోర్​ మోడల్​ అని తెలుస్తోంది. పాత మోడల్​తో పోల్చుకుంటే దీని పొడవు 40ఎంఎం ఎక్కువగా ఉండొచ్చు. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే ఇది 400 కి.మీల దూరం ప్రయాణిస్తుందని తెలుస్తోంది.

ఇండియాలో ఈ మిని ఈవీ 2023 రెండో భాగంలో లాంచ్​ అవ్వొచ్చు. ధర రూ. 60లక్షలుగా ఉండొచ్చని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

స్కోడా ఎన్యాక్​ 4:-

Skoda Enyaq 4 : సీబీయూ మార్గంలో ఈ స్కోడా ఎన్యాక్​ 4 ఇండియాలోకి వస్తుంది. ఇందులో 82కేడబ్ల్యూ బ్యాటరీ ప్యాక్​ ఉండొచ్చు. 125కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్​ ఛార్జింగ్​ ఉండే అవకాశం ఉంది. ఫలితంగా.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఇది 513కి.మీల దూరం ప్రయాణించవచ్చు.

ఈ స్కోడా ఎన్యాక్​ 4.. 2023 మధ్యలో ఇండియాలో లాంచ్​ అవ్వొచ్చు. ధర రూ. 60లక్షలు (అంచనా).

వోల్వో ఈఎక్స్​90..

Volvo EX90 launch date in India : వోల్వోకి మూడే ఈవీగా గుర్తింపు పొందింది ఈ ఎక్స్​90. ఇందులో ఫీచర్స్​ చాలా రిచ్​గా ఉంటాయి! ఇందులో ట్విన్​ మోటార్​ ఉంటుంది. ఇందులో 111కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉండొచ్చు. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే ఇది 600 కి.మీల దూరం ప్రయాణించే అవకాశం ఉంది.

వోల్వో ఈఎక్స్​90.. ఇండియాలో 2023 చివర్లో లాంచ్​ అవ్వొచ్చు. ధర రూ. 1.5కోట్లు (అంచనా).

వోక్స్​వ్యాగన్​ ఐడీ.4:-

Volkswagen ID.4 launch in India news : ఇండియాలో ఐడీ.4ని టెస్ట్​ చేస్తున్నట్టు వోక్స్​వ్యాగన్​ వెల్లడించింది. దీనిని ఎంఈబీ ఎలక్ట్రిక్​ ప్లాట్​ఫామ్​పై రూపొందిస్తోంది ఆ సంస్థ. వోక్స్​వ్యాగన్​ నుంచి ఇండియాలోకి వస్తున్న తొలి ఈవీ ఇదే. ఇందులో ట్విన్​ మోటార్​ ఉంటుంది. ఇది 299హెట్​పీ పవర్​ను, 460ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. దీని టాప్​ స్పీడ్​ 180కేపీహెచ్​. 0-100 కేపీహెచ్​ను కేవలం 6.2సెకన్లలో అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే ఈ ఈవీ.. 480కి.మీల దూరం ప్రయాణించే అవకాశం ఉంది.

ఇండియలో ఈ వోక్స్​వ్యాగన్​ ఐడీ.4 2023 మధ్యలో లాంచ్​ అవ్వనుంది. ధర రూ. 50లక్షలు- 65లక్షలు (అంచనా).

  • పైన చెప్పిన ధరలన్నీ ఎక్స్​షోరూం ప్రైజ్​లు.

తదుపరి వ్యాసం