తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Roundup 2022 - Electric Cars: ఈ ఏడాది ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన టాప్-5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే

Roundup 2022 - Electric Cars: ఈ ఏడాది ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన టాప్-5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే

26 December 2022, 18:51 IST

    • Roundup 2022 - Electric Cars: భారత మార్కెట్‍లోకి ఈ సంవత్సరం చాలా ఎలక్ట్రిక్ కార్లు వచ్చాయి. అయితే అందులో కొన్ని ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించాయి. వాటిలో టాప్-5 ఇవే.
Roundup 2022 - Electric Cars: ఈ ఏడాది ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన టాప్-5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Roundup 2022 - Electric Cars: ఈ ఏడాది ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన టాప్-5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే (HT_Auto)

Roundup 2022 - Electric Cars: ఈ ఏడాది ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన టాప్-5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే

Most attention grabbed Electric Cars in 2022: ఈ ఏడాదిలో దేశంలో చాలా ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ అయ్యాయి. డిమాండ్ విపరీతంగా ఉండటంతో చాలా ఆటోమొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‍లోకి తీసుకొచ్చాయి. లగ్జరీ, బడ్జెట్ సెగ్మెంట్లలో అడుగుపెట్టాయి. కొత్త మోడళ్లతో పాటు ఇప్పటికే ఉన్న వాటికి అదనపు ఫీచర్లు, మెరుగైన రేంజ్‍తో అప్‍గ్రేడ్లు వచ్చాయి. ఇక 2022 ముగింపునకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అందరి దృష్టిని ఆకర్షించిన టాప్-5 ఎలక్ట్రిక్ కార్లు ఏవో ఇక్కడ చూడండి.

వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్ (Volvo XC40 Recharge)

ఈ ఏడాది జూలైలో ఎక్స్‌సీ40 రీచార్జ్ ఎలక్ట్రిక్ కారును ఇండియాలో లాంచ్ చేసింది వోల్వో కార్స్ సంస్థ. లగ్జరీ ఈవీ సెగ్మెంట్‍లో అదిరిపోయే ఫీచర్లతో ఇది అడుగుపెట్టింది. దీని ధర రూ.55.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 78 కిలో వాట్ హవర్ (kWh) బ్యాటరీతో ఈ కారు వచ్చింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max)

ఎంతో పాపులర్ అయిన నెక్సాన్ ఎలక్ట్రిక్ కారుకు ఇది లాంగ్ రేంజ్ వెర్షన్‍గా లాంచ్ అయింది. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ప్రారంభ ధర రూ.17.74 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 437 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. నెక్సాన్ ఈవీ కంటే ఎక్కువ సామర్థ్యమున్న బ్యాటరీ ఈ మ్యాక్స్ మోడల్‍లో ఉంటుంది. దీని బూట్ కెపాసిటీ 350 లీటర్లుగా ఉంది.

ఎంజీ జెడ్ఎస్ ఈవీ (MG ZS EV)

జెడ్ఎస్ ఈవీకి కొన్ని మార్పులు చేసి ఫేస్‍లిస్ట్ వెర్షన్‍గా ఈ ఏడాది మార్చిలో దీన్ని లాంచ్ చేసింది ఎంజీ మోటార్ ఇండియా. ఎంజీ జెడ్ఎస్ ఈవీ ప్రారంభ ధర రూ.21.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). గత మోడల్‍తో పోలిస్తే సింగిల్ చార్జ్ పై 461 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగల బ్యాటరీ, ప్రీమియమ్ క్యాబిన్‍ అప్‍గ్రేడ్లుగా ఉన్నాయి. ప్రస్తుతం ఎంజీ నుంచి అందుబాటులో ఉన్న ఆల్ ఎలక్ట్రిక్ ఆప్షన్ ఇదే. MG ZS EV ఎలక్ట్రిక్ కారు.. ఐపీ69 వాటర్ ప్రూఫింగ్ రేట్ ఉండే 50.3kWh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే చౌక ధరలోనూ ఈవీని లాంచ్ చేయాలని ఎంజీ ప్లాన్ చేస్తోంది.

కియా ఈవీ 6 (Kia EV 6)

కియా ఈవీ 6 మోడల్‍కు చెందిన కేవలం 100 యూనిట్లను మాత్రమే ఇండియాలో ఈ ఏడాది అందుబాటులోకి తెచ్చింది కియా మోటార్స్. అయితే ఈ కారు లుక్, ఫీచర్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. సొంత ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‍ఫామ్ (E-GMP)పై కియా ఈ కారును రూపొందించింది. 77.4kWh బ్యాటరీ ప్యాక్‍తో ఈ కియా ఈవీ6 వచ్చింది.

బీవైడీ అటో 3 (BYD Atto 3)

చైనీస్ ఆటోమేకర్ బీవైడీ నుంచి ఇండియాలో లాంచ్ అయిన రెండో ఎలక్ట్రిక్ కార్ ఇది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ కారులో 521 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇందుకోసం 60.48 kWh బ్యాటరీ ఉంటుంది. ఈ రేంజ్ దీనికి ప్రధాన ఆకర్షణగా ఉంది. 200hp పవర్, 310 Nm పీక్ టార్క్యూను ఈ కారు జనరేట్ చేస్తుంది. క్యాబిన్‍లో రొటేటబుల్ స్క్రీన్, ఎనిమిది స్పీకర్ల ఆడియోతో పాటు మరిన్ని ఫీచర్లు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి.

తదుపరి వ్యాసం