తెలుగు న్యూస్  /  Business  /  Kisan Vikas Patra Will Double Your Investment Without Risk Know Full Details

Saving Schemes: రిస్క్ లేకుండా మీ డబ్బు డబుల్ అవ్వాలనుకుంటున్నారా.. ఈ స్కీమ్‍తో సాధ్యం

22 November 2022, 19:05 IST

    • Saving Schemes: మీ పెట్టుబడికి ఎలాంటి రిస్క్ లేకుండా.. డబ్బు రెట్టింపు అయ్యే స్కీమ్ కోసం చూస్తున్నారా.. అయితే ఈ పొదుపు పథకం మీకు సరిగ్గా సూటవుతుంది.
Saving Schemes: రిస్క్ లేకుండా మీ డబ్బు డబుల్ అవ్వాలనుకుంటున్నారా.. ఈ స్కీమ్‍తో సాధ్యం
Saving Schemes: రిస్క్ లేకుండా మీ డబ్బు డబుల్ అవ్వాలనుకుంటున్నారా.. ఈ స్కీమ్‍తో సాధ్యం

Saving Schemes: రిస్క్ లేకుండా మీ డబ్బు డబుల్ అవ్వాలనుకుంటున్నారా.. ఈ స్కీమ్‍తో సాధ్యం

Saving Schemes: డబ్బు ఎక్కడ పెట్టుబడి పెడితే చింత లేకుండా.. సురక్షితంగా ఉంటుందోనని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఎలాంటి రిస్క్ లేని పొదుపు పథకాల కోసం చూస్తుంటారు. రాబడి తక్కువగా ఉన్నా సరే.. పెట్టిన డబ్బుకు ఎలాంటి ప్రమాదం లేకపోతే చాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం చిన్న మొత్తాల పొదుపు పథకాలు (Small Savings Scheme) బాగా సూటవుతాయి. ఈ స్కీమ్‍లలో రిస్క్ ఉండదు.. మోస్తరు రాబడి కూడా ఉంటుంది. అలాంటి స్కీమే కిసాన్ వికాస్ పత్ర (Kisan Vikas Patra - KVP). ఈ పథకం ద్వారా మీ డబ్బు రెట్టింపు అవుతుంది. దీని గురించిన పూర్తి వివరాలు ఇవే.

చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో కిసాన్ వికాస్ పత్ర (KVP) చాలా మంచి ఆప్షన్‍గా ఉంది. పోస్టాఫీస్‍ల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఈ పథకంలో ఇప్పటికే చేరారు. రిస్క్ లేకుండా.. లాభదాయకంగా ఉండటంతో దీనికి ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. ఎవరైనా ఈ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‍లో చేరవచ్చు. పోస్టాఫీస్‍లో కేవీపీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.

Kisan Vikas Patra Benefits: ఇంతకాలంలో డబుల్

పోస్టాఫీస్‍ ద్వారా ఈ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‍లో జాయిన్ అవ్వొచ్చు. పెట్టుబడి పెట్టాక సర్టిఫికేట్ మీకు అందుతుంది. మీరు పెట్టిన డబ్బు 123 నెలల్లో అంటే 10 సంవత్సరాల 3 నెలల్లో రెట్టింపు అవుతుంది. అంటే మీరు ఇప్పుడు రూ.లక్ష పెట్టుబడి పెడితే 123 నెలల తర్వాత అది రూ.2లక్షలు అవుతుంది. ఈ పథకం వార్షిక చక్రవడ్డీ 7శాతంగా ఉంది.

స్మాల్ సేవింగ్ స్కీమ్‍లపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంటుంది. 6.9శాతంగా ఉన్న కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటును ఈ ఏడాది అక్టోబర్ 1న 7శాతానికి పెంచింది ప్రభుత్వం.

Kisan Vikas Patra: నిబంధనలు ఇవే..

  • పోస్టాఫీస్‍‍లో ఈ కిసాన్ వికాస్ పత్ర అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
  • కిసాన్ వికాస్ పత్రలో కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాలి. గరిష్ఠంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎలాంటి పరిమితి ఉండదు. ఈ స్కీమ్‍కు ఇది కూడా ఓ ఆకర్షణగా చెప్పవచ్చు.
  • సింగిల్ లేదా జాయింట్‍గానూ కిసాన్ వికాస్ పత్ర ఖాతా ఓపెన్ చేయవచ్చు. గరిష్ఠంగా ముగ్గురి వరకు జాయింట్ అకౌంట్‍లో ఉండొచ్చు.
  • 10 సంవత్సరాలు దాటిన మైనర్లు కూడా వారి పేరు మీద ఈ స్కీమ్‍లో చేరవచ్చు.
  • ఈ స్కీమ్ కింద, ఒకరే ఎన్ని అకౌంట్స్ అయినా తెరవొచ్చు.
  • ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం 123 నెలల్లో మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం రెట్టింపు అవుతుంది.