తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Seltos Price Cut: కియా సెల్టోస్ ధర తగ్గింపు; ఈ ఫీచర్ ను తొలగించినందువల్లనే..

Kia Seltos price cut: కియా సెల్టోస్ ధర తగ్గింపు; ఈ ఫీచర్ ను తొలగించినందువల్లనే..

HT Telugu Desk HT Telugu

28 November 2023, 16:40 IST

google News
  • Kia Seltos price cut: దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా తమ సక్సెస్ ఫుల్ మోడల్ సెల్టోస్ (Kia Seltos) పై  రూ. 30,000 వరకు ధరను తగ్గించింది. గత నెలలో కియా సెల్టోస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Kia Seltos price cut: భారతదేశంలో హ్యుందాయ్ క్రెటాకు కియా సెల్టోస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. అయితే, ఇటీవల తమ సెల్టోస్ మోడల్ నుంచి ఒక ఫీచర్‌ను పాక్షికంగా తొలగించిన తర్వాత కొన్ని వేరియంట్‌ల ధరలను కియా తగ్గించింది.

ఈ వేరియంట్లపై..

సెల్టోస్‌పై వివిధ వేరియంట్లను బట్టి రూ. 30000 వరకు ధరను తగ్గించారు.పెట్రోల్, డీజిల్‌ HTX, HTX ప్లస్ ట్రిమ్‌ వేరియంట్ల మ్యాన్యువల్, ఏఎంటీ వర్షన్స్ పై ఈ తగ్గింపు ఉంటుంది. అలాగే, టర్బోచార్జ్డ్ పెట్రోల్, డీజిల్ యూనిట్ల GTX ట్రిమ్ DCT, ఆటోమేటిక్ వెర్షన్‌లకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది. కాగా, ఎక్స్ లైన్ (X-Line) వేరియంట్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు, HTX వేరియంట్‌ల ప్రారంభ ధర రూ. 15.18 లక్షలు (ఎక్స్-షోరూమ్), GTX ప్లస్ వేరియంట్‌ల కొత్త ప్రారంభ ధర రూ. 19.38 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

తొలగించిన ఫీచర్..

వన్-టచ్ రోలింగ్ డౌన్‌ సదుపాయం గతంలో అన్ని విండోలకు ఉండేది. ఇప్పుడు మిగతా విండోలకు తొలగించి, కేవలం డ్రైవర్ వైపు ఉన్న డోర్ విండోకు మాత్రమే ఆ ఫెసిలిటీని కల్పించారు. X-లైన్ ట్రిమ్ వేరియంట్లలో అన్ని విండోస్‌లో వన్-టచ్ డౌన్ ఫీచర్‌ కొనసాగుతుంది.

ఇంజన్ ఆప్షన్స్

కియా సెల్టోస్ 2023 వెర్షన్‌లో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్‌తో సహా మూడు ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 158 bhp శక్తిని, 253 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మిగతా రెండు 1.5-లీటర్ ఇంజన్లు ఒక్కొక్కటి 115 bhp గరిష్ట శక్తిని ప్రొడ్యూస్ చేస్తాయి.

తదుపరి వ్యాసం