Kawasaki Ninja 650 launched: ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‍తో కవాసాకి నింజా 650 వచ్చేసింది
16 November 2022, 7:38 IST
- Kawasaki Ninja 650 launched: కవాసాకి నింజా 650 లైనప్‍లో 2023 మోడల్ లాంచ్ అయింది. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఈ స్పోర్ట్స్ బైక్‍కు యాడ్ అయింది.
Kawasaki Ninja 650 launched: ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‍తో కవాసాకి నింజా 650
Kawasaki Ninja 650 launched: 2023 నింజా 650 మోడల్‍ను కవాసాకి ఇండియా లాంచ్ చేసింది. లైమ్ గ్రీన్ షేడ్ కలర్‍లో ఈ స్పోర్ట్స్ బైక్ నయా మోడల్ వచ్చేసింది. ఫీచర్లపరంగా అప్‍గ్రేడ్ అయింది ఈ కొత్త కవాసాకి నింజా 650 బైక్. అప్‍డేట్ అయిన నింజా 605.. కవాసాకి ట్రాక్షన్ కంట్రోల్ (KRTC)తో వస్తోంది. డ్యుయల్ చానెల్ ఏబీఎస్‍కు ఈ కేఆర్టీసీ అదనంగా ఉంటుంది. పూర్తి వివరాలు ఇవే.
Kawasaki Ninja 650 Price: కవాసాకి నింజా 650 ధర
ఈ లేటెస్ట్ మోడల్ కవాసాకి నింజా 650 బైక్ ధర రూ.7.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 2022 వెర్షన్‍తో పోలిస్తే ఈ 2023 నింజా 650 మోడల్ ధర రూ.17,000 అధికంగా ఉంది.
Kawasaki Ninja 650 2023 Model: ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‍తో..
2023 కవాసాకి నింజా 650లో KRTC సిస్టమ్ రెండు మోడ్‍లను ఇస్తుంది. రోడ్ కార్నర్స్ వద్ద టర్న్ చేసే సమయంలో బైక్‍ను మరింత మెరుగ్గా బెండ్ చేసేందుకు మోడ్ 1 సహాయపడుతుంది. అధిక వీల్ స్పీడ్‍ను గుర్తించినప్పుడు మెరుగైన గ్రిప్ కోసం ఇంజిన్ ఔట్‍పుట్‍ను మోడ్-2 తగ్గిస్తుంది. కావాలంటే ఈ KRTC ఫీచర్‍ను ఆఫ్ కూడా చేసుకోవచ్చు.
649cc సమాంతర ట్విన్ ఇంజిన్‍తో 2023 కవాసాకి నింజా 650 వస్తోంది. ఉద్గారాలు తక్కువగా ఉండేలా ఈ ఇంజిన్ తయారైంది. 8000 rpm వద్ద 67 bhpను, 6,700 rpm వద్ద 64 Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ జనరేట్ చేస్తుంది. 6-స్పీడ్ గేర్ బాక్స్ తో ఈ నయా బైక్ వస్తోంది. 41mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెుక మోనోషాక్ సస్పెన్షన్ కోసం ఉన్నాయి. 300mm డ్యుయల్ పెటల్ డిస్క్ బ్రేక్‍ను కలిగి ఉంటుంది. ఫ్రంట్‍లో సింగిల్ 220mm పెటర్ డిస్క్ తో వస్తోంది. డన్‍లప స్పోర్ట్స్ మ్యాక్స్ రోడ్‍స్పోట్ 2 టైర్లపై Kawasaki Ninja 650 లేటెస్ట్ మోడల్ రన్ అవుతుంది.
Kawasaki Ninja 650 2023 Model: డిజైన్‍లో స్పల్ప మార్పులే
గత మోడల్‍తో పోలిస్తే ఈ 2023 Kawasaki Ninja 650 డిజైన్‌లో పెద్దగా మార్పులు లేవు. ట్విన్ ఎల్ఈడీ ల్యాంప్స్, 15 లీటర్ ఫ్యుయల్ ట్యాంక్ అలానే ఉన్నాయి. 4.3 ఇంచుల టీఎఫ్‍టీ ఇన్‍స్ట్రుమెంల్ కన్సోల్ తో ఈ స్పోర్ట్స్ బైక్ వస్తోంది. బ్లూటూత్ ద్వారా ఈ బైక్‍కు స్మార్ట్ ఫోన్‍ను కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ 2023 కవాసారి నింజా 650 మోడల్ డెలివరీ ఈనెలాఖరు నుంచే మొదలయ్యే అవకాశం ఉంది.