తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jiomart Festive Offers: బెస్టివల్ సేల్ పేరుతో జియోమార్ట్ పండగ ఆఫర్లు

JioMart festive offers: బెస్టివల్ సేల్ పేరుతో జియోమార్ట్ పండగ ఆఫర్లు

HT Telugu Desk HT Telugu

14 October 2022, 15:37 IST

google News
  • JioMart festive offers: అక్టోబరు 14 నుంచి 24 వ తేదీ వరకు జియో మార్ట్, రిలయన్స్ స్మార్ట్ స్టోర్లలో బెస్టివల్ సేల్ వేడుక జరగనుంది. 80 శాతం వరకు తగ్గింపుతోపాటు, క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

బెస్టివల్ సేల్ పేరుతో జియో మార్ట్, రిలయన్స్ స్టోర్లలో ఆఫర్లు
బెస్టివల్ సేల్ పేరుతో జియో మార్ట్, రిలయన్స్ స్టోర్లలో ఆఫర్లు

బెస్టివల్ సేల్ పేరుతో జియో మార్ట్, రిలయన్స్ స్టోర్లలో ఆఫర్లు

న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ జియోమార్ట్, రిలయన్స్ స్మార్ట్ స్టోర్‌లు శుక్రవారం నుంచి దీపావళి సేల్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించాయి.

అక్టోబర్ 14-24 వరకు JioMart ఇ-మార్కెట్‌ప్లేస్ ప్లాట్‌ఫారమ్‌తో పాటు 3,000కు పైగా స్మార్ట్ స్టోర్‌లలో ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. రిలయన్స్ స్మార్ట్ తాజా ఉత్పత్తులు, బేకరీ, పాల ఉత్పత్తులు, గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, సాధారణ వస్తువులు, దుస్తులు, ఉపకరణాలను విక్రయిస్తుంది. కస్టమర్ల కోసం ఆఫర్‌లు JioMart ద్వారా ఆన్‌లైన్‌లోనూ, అలాగే స్మార్ట్ స్టోర్‌లలోనూ అందుబాటులో ఉంటాయి.

‘గత రెండేళ్లలో స్మార్ట్ స్టోర్స్ వాల్యూ షాపింగ్, డెస్టినేషన్ షాపింగ్, కన్వీనియన్స్ షాపింగ్ ఫార్మాట్లలో విస్తరించాయి. ఆఫ్‌లైన్ స్టోర్‌ల నెట్‌వర్క్ ద్వారా రిలయన్స్ రిటైల్ 20 కోట్ల రిజిస్టర్డ్ కస్టమర్ బేస్‌ను కలిగిఉంది. ఈనేపథ్యంలో బెస్టివల్ సేల్ దీపావళి సందర్భంగా అత్యుత్తమ ఆఫర్లు, డీల్స్, బ్యాంక్ టై-అప్‌లు, ప్రత్యేక తగ్గింపులను అందిస్తుంది..’ అని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

దీపావళి ప్రత్యేక ఆఫర్లు

ఎలక్ట్రానిక్ డీల్స్: టీవీ, స్మార్ట్‌వాచ్‌, మొబైల్, కంప్యూటర్ ఉపకరణాలు, రిఫ్రిజిరేటర్‌లు, గృహోపకరణాలు, మరెన్నో ఉపకరణాలపై 80% వరకు తగ్గింపు లభిస్తుందని కంపెనీ తెలిపింది. అక్టోబర్ 16వ తేదీ వరకు ఎలక్ట్రానిక్స్‌పై యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుందని తెలిపింది.

ఫ్యాషన్ ఆఫర్స్: పురుషులు, మహిళలు, పిల్లల దుస్తుల, పాదరక్షలు, ఉపకరణాలపై భారీ తగ్గింపు ధరలు వర్తింపజేస్తున్నట్టు తెలిపింది.

బంపర్ ఆఫర్స్: డిన్నర్ సెట్‌లపై 50 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. డ్రై ఫ్రూట్ గిఫ్ట్ ప్యాక్‌లు రూ. 299లకు లభిస్తాయి. స్వీట్లు, స్నాక్స్, చాక్లెట్లపై 50% వరకు తగ్గింపు లభిస్తుంది.

బ్యాంక్ ఆఫర్‌లు (జియోమార్ట్‌లో మాత్రమే)

కస్టమర్లు అన్ని కేటగిరీలపై అక్టోబర్ 24 వరకు ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 10% తక్షణ తగ్గింపును పొందవచ్చు.

ప్రత్యేక స్మార్ట్ స్టోర్ ఆఫర్‌లు: వివిధ కేటగిరీలపై 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్ ప్యాక్‌లు, డియోపై 50% వరకు తగ్గింపు లభిస్తుంది. సబ్బులపై 33% తగ్గింపు లభిస్తుంది. 5 కేజీల బాస్మతి బియ్యం, చక్కెర, 5 లీటర్ల నూనె కలిపి కాంబో ఆఫర్ కింద కేవలం రూ. 1299లకే లభిస్తాయి. టీవీపై గరిష్టంగా 60% తగ్గింపు, స్మార్ట్‌వాచ్‌లు, స్పీకర్‌లు మొదలైన ఆడియో ఉపకరణాలపై 70% వరకు తగ్గింపు లభిస్తుంది.

తదుపరి వ్యాసం