తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jio Plans And Offers : 'జియో'కు 7 వసంతాలు- ఈ ప్లాన్స్​పై అదిరిపోయే ఆఫర్స్​!

Jio plans and offers : 'జియో'కు 7 వసంతాలు- ఈ ప్లాన్స్​పై అదిరిపోయే ఆఫర్స్​!

Sharath Chitturi HT Telugu

05 September 2023, 13:09 IST

    • Jio plans and offers : మీరు జియో వాడుతున్నారా? అయితే ఈ అదిరిపోయే వార్త మీకోసమే! 7వ వార్షికోత్సవం సందర్భంగా.. కొన్ని ప్లాన్స్​పై స్పెషల్​ బెనిఫిట్స్​ను ప్రకటించింది జియో. ఆ వివరాలు..
జియోకు 7 వసంతాలు- ఈ ప్లాన్స్​పై అదిరిపోయే ఆఫర్స్​!
జియోకు 7 వసంతాలు- ఈ ప్లాన్స్​పై అదిరిపోయే ఆఫర్స్​!

జియోకు 7 వసంతాలు- ఈ ప్లాన్స్​పై అదిరిపోయే ఆఫర్స్​!

Jio plans and offers : జియో 7ఏళ్ల వార్షికోత్సవం నేపథ్యంలో కస్టమర్లకు ఓ గుడ్​ న్యూస్​ ఇచ్చింది. పలు ప్లాన్స్​పై డేటాతో పాటు ఇతర బెనిఫిట్స్​ని అందిస్తున్నట్టు ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ చూద్దాము..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

జియో ప్లాన్స్​- 'ఎక్స్​ట్రా బెనిఫిట్స్​'..

రూ. 299 రీఛార్జ్​:- ఈ ప్యాక్​తో 28 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా, అన్​లిమిటెడ్​ వాయిస్​ కాలింగ్​, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లను పొందవచ్చు. ఇక స్పెషల్​ బెనిఫిట్స్​ కింద 7 జీబీ ఎక్స్​ట్రా డేటాను ఇస్తోంది జియో.

రూ. 749 రీఛార్జ్​:- ఈ ప్లాన్​తో 90 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా, అన్​లిమిటెడ్​ వాయిస్​ కాలింగ్​, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు లభిస్తున్నాయి. ఇక స్పెషల్​ ఆఫర్​ల భాగంగా 14జీబీ ఎక్స్​ట్రా డేటా (7జీబీx 2కూపాన్స్​)ను పొందవచ్చు.

Jio latest plans : రూ. 2,999 రీఛార్జ్​:- ఈ ప్లాన్​తో రీఛార్జ్​ చేసుకుంటే.. 365 రోజుల పాటు రోజుకు 2.5జీబీ డేటా, అన్​లిమిటెడ్​ వాయిస్​ కాలింగ్​, రోజుకు 100 ఎస్​ఎంఎస్​ సేవలను పొందవచ్చు.

ఇక ఈ ప్లాన్​తో పాటు స్పెషల్​ ఆఫర్స్​/ బెనిఫిట్స్​ కింద.. 21 జీబీ ఎక్స్​ట్రా డేటా (7జీబీx3 కూపాన్స్​), ఏజీయోలో రూ. 200 వరకు ఆఫ్​, నెట్​మెడ్స్​లో రూ. 800 వరకు 20శాతం ఆఫ్​, స్విగ్గీలో 100శాతం తగ్గింపు, మెక్​డీలో రూ. 149 అంతకన్నా ఎక్కువ బిల్లు ఉచితం, రిలయన్స్​ డిజిటల్​లో 10శాతం ఆఫ్​, ఫ్లైట్స్​పై రూ. 1500 తగ్గింపు, హోటల్స్​పై 15శాతం డిస్కౌంట్​, యాత్రాలో రూ. 4000 వరకు ఆఫ్​ వస్తోంది.

ఇవి గుర్తుపెట్టుకోవాలి..

Jio 7th anniversary : 7వ వార్షికోత్సవం నేపథ్యంలో జియో ఇస్తున్న ఈ బెనిఫిట్స్​ను పొందాలని అనుకునే వారు కొన్ని విషయాలు గమనించాలి. అవేంటంటే..

  • ఈ నెల 5 నుంచి 30 మధ్యలో రీఛార్జ్​ చేసుకున్న కస్టమర్లకే ఈ బెనిఫిట్స్​ లభిస్తాయి. సెప్టెంబర్​ 30 తర్వాత చేసే రీఛార్జ్​లపై ఇవి ఉండవు.
  • రీఛార్జ్​ చేసిన వెంటనే.. ఎక్స్​ట్రా బెనిఫిట్స్​ అనేవి ‘మైజియో’ అకౌంట్​లో వెంటనే క్రెడిట్​ అయిపోతాయి. ఎక్స్​ట్రా డేటా అనేది డేటా వోచర్​ కింద మైజియో యాప్​లో క్రెడిట్​ అవుతుంది. కస్టమర్లు వీటిని రిడీమ్​ చేసుకోవాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం