ITR filing 2024: ఐటీఆర్ లో బ్యాంక్ ఎఫ్ డీ లపై వచ్చే వడ్డీని ఎలా చూపాలి?.. ఎంత వరకు వడ్డీ రాయితీ ఉంటుంది?
11 May 2024, 14:41 IST
ITR filing 2024: ఆదాయ పన్ను రిటర్న్ ను ఫైల్ చేసే సమయంలో పన్ను చెల్లింపుదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తమ బ్యాంక్ డిపాజిట్లు, ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లపై లభించే వడ్డీని ఐటీఆర్ లో కచ్చితంగా చూపాల్సి ఉంటుంది. ఐటీఆర్ లో ఎక్కడ ఈ వడ్డీ మొత్తాన్ని చూపాలో ఇక్కడ తెలుసుకోండి.
ప్రతీకాత్మక చిత్రం
సురక్షితమైన ఆదాయ మార్గాల్లో బ్యాంక్ ల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ఒకటి. ముఖ్యంగా రిస్కీ పెట్టుబడులు పెట్టడం ఇష్టం లేని వారు బ్యాంక్ ఎఫ్ డీ ల ద్వారా సురక్షితమైన, క్రమం తప్పని ఆదాయాన్ని పొందవచ్చు. మీరు ఎఫ్డీల ద్వారా పొందే వడ్డీ గురించి మీ బ్యాంక్ మీకు ఇచ్చే ఇంట్రస్ట్ సర్టిఫికెట్ లో వివరంగా తెలియజేస్తుంది. ఆ వివరాలను మీ ఐటీఆర్ లో తెలియజేయాల్సి ఉంటుంది.
ఆదాయ పన్ను చట్టాల ప్రకారం..
ఆదాయ పన్ను చట్టాల్లోని నిబంధనల ప్రకారం, ‘‘వ్యాపారం లేదా వృత్తి ద్వారా పొందిన లాభాలు’’, ‘‘ఇతర వనరుల నుండి పొందిన ఆదాయం’’ హెడ్ కింద పన్ను చెల్లింపుదారుడు ఒక నిర్దిష్ట ఆదాయ వనరుకు సంబంధించి తన ఆదాయాన్ని రశీదు ప్రాతిపదికన లేదా సమీకరణ ప్రాతిపదికన ప్రకటించాల్సి ఉంటుంది. ఇది వడ్డీ ఆదాయానికి కూడా వర్తిస్తుంది. ఆదాయాన్ని ప్రకటించడానికి ఏ పద్ధతిని ఎంచుకున్నా, దానిని ఏటేటా స్థిరంగా అనుసరించాలి. ఐటీఆర్ లో సంబంధిత ఆర్థిక సంవత్సరంలో మీ బ్యాంక్ ఖాతాలో జమ అయిన వడ్డీని తెలియజేయాల్సి ఉంటుంది.
టీడీఎస్ ను గమనించండి..
సాధారణంగా, బ్యాంకులు వార్షిక ప్రాతిపదికన వడ్డీపై పన్నును మినహాయిస్తుంది. సంవత్సరానికి మీకు అందే వడ్డీ ఆదాయానికి, ఆ సంవత్సరంలో బ్యాంకు పన్ను కింద మినహాయించే వడ్డీకి మధ్య కొంత వ్యత్యాసం ఉండవచ్చు.