ఐదు రోజుల లాభాల పరుగుకు బ్రేక్.. స్వల్ప నష్టాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
20 July 2023, 10:34 IST
- ఐదు రోజు లాభాల పరుగుకు బ్రేక్ వేస్తూ మదుపరులు స్టాక్స్ అమ్మేస్తుండడంతో స్టాక్‌మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
స్టాక్ మార్కెట్ నిన్నటి సూచీలు
ముంబై, జూలై 20: దేశీయ మార్కెట్లలో రికార్డు స్థాయి లాభాల తర్వాత పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగుతుండడంతో ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు గురువారం ప్రారంభ ట్రేడ్‌లో క్షీణించాయి. ఐదు రోజుల లాభాల ర్యాలీ నిలిచిపోయింది.
30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ 171.62 పాయింట్లు పడిపోయి 66,925.82 వద్ద ట్రేడవుతోంది.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 48.6 పాయింట్లు క్షీణించి 19,784.55 వద్దకు చేరుకుంది.
సెన్సెక్స్ నుండి ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే నష్టాల్లో
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.
ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండగా, సియోల్, హాంకాంగ్ లాభాల్లో సాగుతున్నాయి. బుధవారం అమెరికా మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి.
గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.11 శాతం పెరిగి 79.55 డాలర్లకు చేరుకుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) బుధవారం నాడు రూ.1,165.47 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.
‘ఆర్ఐఎల్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విభజన, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, మిడ్-క్యాప్ ఐటీ కంపెనీల క్యూ1 ఫలితాలు ఈ రోజు మార్కెట్లో ప్రభావం చూపవచ్చు..’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు.
టాపిక్