Image crop feature in WhatsApp: త్వరలో వాట్సాప్ లోనే ‘‘ఇమేజ్ క్రాప్’’ ఫీచర్
07 June 2023, 14:35 IST
WhatsApp new feature: వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు వాట్సాప్ (WhatsApp) లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇమేజెస్ ను వాట్సాప్ లోనే, మనకు నచ్చినట్లుగా క్రాప్ చేసుకునేలా మరో కొత్త ఫీచర్ త్వరలో వాట్సాప్ లో దర్శనమివ్వనుంది.
ప్రతీకాత్మక చిత్రం
WhatsApp new feature: వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు వాట్సాప్ (WhatsApp) లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇమేజెస్ ను వాట్సాప్ లోనే, మనకు నచ్చినట్లుగా క్రాప్ చేసుకునేలా మరో కొత్త ఫీచర్ త్వరలో వాట్సాప్ లో దర్శనమివ్వనుంది. దీనికి సంబంధించిన టూల్ ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది.
WhatsApp crop feature:వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్
వాట్సాప్ లో చోటు చేసుకుంటున్న మార్పులను ఎప్పటికప్పుడు వివరించే వాబీటాఇన్ఫో (WABetaInfo) ఈ కొత్త క్రాప్ (crop) ఫీచర్ గురించి వెల్లడించింది. స్మార్ట్ ఫోన్స్ లోనో లేక ల్యాప్ టాప్, డెస్క్ టాప్ ల్లోనో ఇమేజెస్ ను మనకు ఇష్టమైన రీతిలో క్రాప్ చేసి, సేవ్ చేసుకుని వాట్సాప్ లో షేర్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా, నేరుగా వాట్సాప్ లోనే క్రాప్ చేసుకునే వీలుంటే బావుంటుందనే ఆలోచన స్ఫూర్తిగా ఈ కొత్త ఫీచర్ ను తీసుకువచ్చారు. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందనే విషయాన్ని స్క్రీన్ షాట్ ద్వారా వాబీటాఇన్ఫో (WABetaInfo) వివరించింది. అదే ఈ కింది స్క్రీన్ షాట్.
ఈ ఫీచర్ ను ఎలా వాడడం?
వాట్సాప్ ను ఓపెన్ చేసిన తరువాత, క్రాప్ చేయాల్సిన ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత, పైన చూపిన ఇమేజ్ లో మాదిరిగా, ఫొటో పై భాగంలో కనిపించే ఐకన్స్ లో యారో మార్క్ చూపిస్తున్న క్రాప్ (Crop) ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత ఫొటోను మనకు నచ్చిన సైజ్ లో క్రాప్ చేసుకోవాలి. క్రాప్ చేసిన అనంతరం ఆ ఇమేజ్ ను ఫార్వర్డ్ చేయవచ్చు. దీనివల్ల చాలా సమయం ఆదా అవుతుంది. అలాగే, ఇమేజెస్ ను క్రాప్ చేయడం కోసం వేరే టూల్ ను వాడాల్సిన అవసరం ఉండదు. ఈ క్రాప్ ఆప్షన్ కొన్ని వాట్సాప్ బీటా టెస్టర్స్ లో కనిపించిందని వాబీటాఇన్ఫో (WABetaInfo) వెల్లడించింది. త్వరలో ఈ ఫీచర్ అందరు వినియోగదారులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.