తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Idfc First Bank Q3 Results: ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ నికర లాభం 18 శాతం వృద్ధి

IDFC First Bank Q3 Results: ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ నికర లాభం 18 శాతం వృద్ధి

HT Telugu Desk HT Telugu

20 January 2024, 19:30 IST

google News
    • IDFC First Bank Q3 Results: ప్రైవేటు రంగంలో దినదినాభివృద్ధి చెందుతున్న ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IDFC First Bank Q3 Results: ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం (Q3FY24) ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ 3 లో ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ నికర లాభం 18.4 శాతం పెరిగి రూ.715 కోట్లకు చేరుకుంది.

ఎన్ఐఐ ల్లో పెరుగుదల

IDFC First Bank నికర వడ్డీ ఆదాయం (NII) 30.5 శాతం పెరిగి రూ .4,286.6 కోట్లకు చేరుకుంది. డిసెంబర్ 31, 2023తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో బ్యాంక్ (IDFC First Bank Q3 Results) నికర లాభం 37 శాతం వృద్ధితో రూ.2,232 కోట్లకు చేరుకుంది. డిసెంబర్ త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్ 6.42 శాతం ఉండగా, గత ఏడాది ఇదే కాలంలో 6.13 శాతంగా ఉంది. ప్రధాన నిర్వహణ లాభం ఏడాది ప్రాతిపదికన రూ.1,225 కోట్ల నుంచి 24 శాతం పెరిగింది.

ఎన్పీఏలు తగ్గాయి..

స్థూల నిరర్థక ఆస్తులు (GNPA) 2022 డిసెంబర్ 31 నాటికి 2.96 శాతం ఉండగా, 2023 డిసెంబర్ 31 నాటికి 2.04 శాతానికి తగ్గాయి. బ్యాంక్ నికర ఎన్పీఏ (net NPA) 2022 డిసెంబర్ 31 నాటికి 1.03 శాతం నుంచి 2023 డిసెంబర్ 31 నాటికి 0.68 శాతానికి మెరుగుపడింది. 2022 డిసెంబర్ 31 నాటికి రూ.1,23,578 కోట్లుగా ఉన్న ఖాతాదారుల డిపాజిట్లు 2023 డిసెంబర్ 31 నాటికి రూ.1,76,481 కోట్లకు పెరిగాయి. 2022 డిసెంబర్ 31 నాటికి రూ.66,498 కోట్లుగా ఉన్న కాసా డిపాజిట్లు 2023 డిసెంబర్ 31 నాటికి రూ.85,492 కోట్లకు పెరిగాయి. 2023 డిసెంబర్ 31 నాటికి కాసా నిష్పత్తి 46.8 శాతంగా ఉంది.

తదుపరి వ్యాసం