తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Q4 Results This Week: ఈ వారం కీలక కంపెనీల త్రైమాసిక ఫలితాలు.. రిలయన్స్, ఐసీఐసీఐ, హెచ్‍సీఎల్ సహా మరిన్ని..

Q4 Results This Week: ఈ వారం కీలక కంపెనీల త్రైమాసిక ఫలితాలు.. రిలయన్స్, ఐసీఐసీఐ, హెచ్‍సీఎల్ సహా మరిన్ని..

16 April 2023, 23:41 IST

google News
    • Q4 Results This Week: ఈ వారం కొన్ని కీలక కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలు (Q4 FY23) వెలువడనున్నాయి. స్టాక్ మార్కెట్‍లకు ఈ రిజల్ట్స్ కీలకంగా ఉండనున్నాయి.
Q4 Results This Week: ఈ వారం కీలక కంపెనీల త్రైమాసిక ఫలితాలు (Photo: Mint)
Q4 Results This Week: ఈ వారం కీలక కంపెనీల త్రైమాసిక ఫలితాలు (Photo: Mint)

Q4 Results This Week: ఈ వారం కీలక కంపెనీల త్రైమాసిక ఫలితాలు (Photo: Mint)

Q4 Results This Week: కొన్ని కీలకమైన భారీ కంపెనీలు 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (Q4 FY23) ఆర్థిక ఫలితాలను ఈ వారం వెల్లడించనున్నాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్షియల్ సహా మిగిలిన రంగాల్లోని కొన్ని ముఖ్యమైన సంస్థలు ఏప్రిల్ నాలుగో వారంలో రిజల్ట్స్ ప్రకటించనున్నాయి. స్టాక్ మార్కెట్లపై ఈ ఫలితాలు ప్రభావం చూపనున్నాయి. ఈ వారంలో ఏ తేదీల్లో ఏ కంపెనీల రిజల్ట్స్ రానున్నాయో ఇక్కడ చూడండి.

ఏప్రిల్ 17

Q4 Results This Week: ఏంజిల్ వన్, నెట్‍వర్క్ 18 మీడియా & ఇన్వెస్ట్‌మెంట్స్, జస్ట్ డయల్, టీవీ18 బ్రాడ్‍కాస్ట్, హాత్‍వే కేబుల్ & డేటాకామ్, క్విక్ హీల్ టెక్నాలజీస్ సహా మరికొన్ని కంపెనీలు ఏప్రిల్ 17న 2023 ఆర్థిక సంవత్సర నాలుగో క్వార్టర్ ఫలితాలను వెల్లడించనున్నాయి.

ఏప్రిల్ 18

Q4 Results This Week: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, షఫైర్ ఇండియా, క్రిసిల్, టాటా కాఫీ, అకేల్యా సొల్యూషన్స్ ఇండియా, ఓరియెంటర్ రైల్వే ఇన్‍ఫ్రాస్ట్రక్చర్ ఏప్రిల్ 18న ఫలితాలను ప్రకటించనున్నాయి.

ఏప్రిల్ 19

Q4 Results This Week: టాటా కమ్యూనికేషన్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మాస్టెక్, బెనారస్ హోటల్స్ కంపెనీలు ఏప్రిల్ 19న నాలుగో క్వార్టర్ రిజల్ట్స్ వెల్లడించనున్నారు.

ఏప్రిల్ 20

Q4 Results This Week: ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‍సీఎల్ టెక్నాలజీస్ ఏప్రిల్ 20న 2023 ఆర్థిక సంవత్సర నాలుగో క్వార్టర్ ఫలితాలను అనౌన్స్ చేయనుంది. ఐటీ రంగానికి ఇది కీలకంగా ఉండనుంది. ఇక ఇదే రోజు ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, సియెంట్, రజినీశ్ వెల్‍నెస్, ఓరియెంట్ గ్రీన్ పవర్ సంస్థలు త్రైమాసిక రిజల్ట్స్ ప్రకటించనున్నాయి.

ఏప్రిల్ 21

Q4 Results This Week: రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఏప్రిల్ 21న 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాలను ప్రకటించనుంది. ఆదిత్య బిర్లా మనీ, తేజస్ నెట్‍వర్క్, టాన్ఫాక్ ఇండస్ట్రీస్, వెంట్ ఇండియా కంపెనీలు కూడా ఇదే రోజు వెల్లడించనున్నాయి.

ఏప్రిల్ 22

Q4 Results This Week: దేశంలో రెండో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ (ICICI Bank).. ఏప్రిల్ 22వ తేదీన 2023 ఫైనాన్షియల్ ఇయర్ నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. ఐసీఐసీఐ ఫలితాలు మెరుగ్గా ఉంటాయని అంచనాలు ఉన్నాయి. అలాగే యెస్ బ్యాంక్ కూడా అదే రోజున రిజల్ట్స్ వెల్లడించనుంది. దీంతో ఆ రోజు బ్యాంకింగ్ రంగానికి కీలకంగా ఉండనుంది.

తదుపరి వ్యాసం