తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Exter Cng : డ్యూయెల్​ సిలిండర్​ టెక్నాలజీతో హ్యుందాయ్​ ఎక్స్​టర్​ సీఎన్జీ లాంచ్​..

Hyundai Exter CNG : డ్యూయెల్​ సిలిండర్​ టెక్నాలజీతో హ్యుందాయ్​ ఎక్స్​టర్​ సీఎన్జీ లాంచ్​..

Sharath Chitturi HT Telugu

16 July 2024, 11:02 IST

google News
    • డ్యూయెల్ సిలిండర్ టెక్నాలజీతో హ్యుందాయ్ ఎక్స్​టర్​ సీఎన్జీ ఎస్​యూవీ లాంచ్​ అయ్యింది. ఈ ఎస్​యూవీ వేరియంట్లు, ఫీచర్లు, ధరలు, మైలేజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
కొత్త హ్యుందాయ్​ ఎక్స్​టర్​ సీఎన్జీ లాంచ్​..
కొత్త హ్యుందాయ్​ ఎక్స్​టర్​ సీఎన్జీ లాంచ్​..

కొత్త హ్యుందాయ్​ ఎక్స్​టర్​ సీఎన్జీ లాంచ్​..

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​తో పాటు సీఎన్జీ వెహికిల్స్​కి కూడా మంచి డిమాండ్​ కనిపిస్తోంది. సీఎన్జీ సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతున్న మారుతీ సుజుకీకి గట్టి పోటీనిచ్చేందుకు ఇతర ఆటోమొబైల్​ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా సరికొత్త డ్యూయెల్​ సిలిండర్​ టెక్నాలజీతో ఎక్స్​టర్​ సీఎన్జీని మార్కెట్​లో తాజాగా లాంచ్​ చేసింది హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్. ఇందులో మొత్తం మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి.. ఎస్, ఎస్ఎక్స్, నైట్ ఎడిషన్. హ్యుందాయ్​ ఎక్స్​టర్​ హై సీఎన్జీ డ్యూయో ధర రూ .8.50 లక్షల వద్ద ప్రారంభమై రూ .9.38 లక్షల వరకు ఉంటుంది. ఈ రెండు ఎక్స్​షోరూమ్ ధరలు. హ్యుందాయ్ ఎక్స్​టర్​ హై- సీఎన్జీ డ్యుయో టాటా పంచ్ సీఎన్జీకి పోటీగా ఉంటుంది. పంచ్​ సీఎన్జీలోనూ డ్యూయెల్ సిలిండర్ టెక్నాలజీ ఉంది.

టాటా పంచ్ ఐసీఎన్జీ మాదిరిగానే, ఎక్స్​టర్​ హై- సీఎన్జీ డ్యూయో కూడా పెద్ద సిలిండర్​కి బదులుగా రెండు చిన్న సీఎన్జీ సిలిండర్లను పొందుతుంది. ఫలితంగా బూట్​ స్పేస్​ మరింత ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి సీఎన్జీ వాహనాల్లో ఉన్న మైనస్​ పాయింట్​ బూట్​ స్పస్​ తక్కువగా ఉండటం. కానీ ఇప్పుడు చిన్న సిలిండర్లు వాడటంతో లగేజ్​ పెట్టుకునేందుకు బూట్​ స్పేస్​ కాస్త ఎక్కువ లభిస్తుంది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, శ్రీ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, “హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ స్థిరమైన, సృజనాత్మక మొబిలిటీ పరిష్కారాలను అందించడానికి కట్టుబడి ఉంది. డ్యూయెల్ సిలిండర్ సీఎన్జీ టెక్నాలజీతో మా ఎంట్రీ ఎస్​యూవీ ఎక్స్​టర్​​ను లాంచ్ చేయడం మాకు సంతోషంగా ఉంది. అధిక ఇంధన సామర్థ్యం, పుష్కలమైన బూట్ స్పేస్, ఎస్​యూవీ బహుముఖ ఆఫర్లతో, ఎక్స్​టర్​ హై-సీఎన్జీ డ్యూయో కార్బన్ ఫుట్​ప్రింట్స్​ని తగ్గించడంలో సహాయపడే నమ్మదగిన సమర్థవంతమైన వాహనం కోసం చూస్తున్న వినియోగదారులను ఆకర్షిస్తుందని మేము విశ్వసిస్తున్నాము,” అని అన్నారు.

కొత్త ఎస్​యూవీలో స్మార్ట్​ ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​, ఎల్​ఈడీ టెయిల్​ ల్యాంప్​, ఫుల్లీ ఆటోమెటిక్​ టెంపరేచర్​ కంట్రోల్​, 20.32 సెంటీమీటర్ల టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, 6 ఎయిర్​బ్యాగ్​లు, టీపీఎంఎస్​ హైలైన్​, ఎలక్ట్రానిక్​ స్టెబిలిటీ కంట్రోల్​, హిల్​-స్టార్ట్​ అసిస్ట్​ కంట్రోల్​ వంటి అడ్వాన్స్​డ్​ సేఫ్టీ ఫీచర్స్​ ఉన్నాయి.

ఈ హ్యుందాయ్​ ఎక్స్​టర్​ హై సీఎన్జీ డ్యుయో మైలేజ్​ 27.1 కేఎం/కేజీ. పెట్రోల్​ నుంచి సీఎన్జీ మోడ్​లోకి సులభంగా మారేందుకు ఇందులో ఇంటిగ్రేటెడ్​ ఎలక్ట్రానిక్​ కంట్రోల్​ యూనిట్​ ఉంది.

ఎస్​యూవీలో 1.2 లీటర్​ బై-ఫ్యూయెల్​ ఇంజిన్​ ఉంది. ఇది 69పీఎస్​ పవర్​ని, 95.2 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. సీఎన్జీ సిస్టెమ్​పై 3ఏళ్ల వారెంటీ ఇస్తోంది సంస్థ.

భారత్​ మార్కెట్​లో మరిన్న సీఎన్జీ మోడల్స్​ని లాంచ్​ చేసేందుకు హ్యుందాయ్​ మోటార్స్​ ప్లాన్​ చేస్తోందని సమాచారం. రానున్న రోజుల్లో ఈ ఆటోమొబైల్​ సంస్థల నుంచి మరిన్ని లాంచ్​లను మనం ఆశించవచ్చు.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్​లో అందుబాటులో ఉంది. ఆటోమొబైల్​ అప్డేట్స్​ కోసం మనం హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఫాలో అవ్వండి.

తదుపరి వ్యాసం