తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Festival Discounts On Sedans : ఈ సెడాన్​ కార్లపై భారీ డిస్కౌంట్లు.. మిస్​ అవ్వకండి!

Festival discounts on Sedans : ఈ సెడాన్​ కార్లపై భారీ డిస్కౌంట్లు.. మిస్​ అవ్వకండి!

Sharath Chitturi HT Telugu

06 November 2023, 12:09 IST

    • Festival discounts on Sedans : పండుగ సీజన్​లో కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! పలు సెడాన్​లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఆ వివరాలు..
ఈ సెడాన్​ కార్లపై భారీ డిస్కౌంట్లు..
ఈ సెడాన్​ కార్లపై భారీ డిస్కౌంట్లు..

ఈ సెడాన్​ కార్లపై భారీ డిస్కౌంట్లు..

Discounts on Sedan cars : ఇండియాలో పండుగ సీజన్​ నడుస్తోంది. వాహనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కస్టమర్లను మరింత ఆకర్షించేందుకు.. ఆటోమొబైల్​ సంస్థ పోటీపడుతున్నాయి. తమ పోర్ట్​ఫోలియోలోని బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​పై క్రేజీ ఆఫర్స్​ ఇస్తున్నాయి. ఈ తరుణంలో.. కొన్ని ప్రముఖ సెడాన్​ వాహనాలపై లభిస్తున్న డిస్కౌంట్స్​ గురించి ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

ఈ సెడాన్​ కార్లపై భారీ డిస్కౌంట్లు..

హ్యుందాయ్​ వెర్నా:- హ్యుందాయ్​ సంస్థకు బెస్ట్​ సెల్లింగ్​ సెడాన్​.. ఈ వెర్నా. ఈ మిడ్​ సైజ్​ సెడాన్​పై రూ. 30వేల వరకు డిస్కౌంట్లు ఇస్తోంది సంస్థ. ఇందులో రెండు పెట్రోల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. 1.5 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​.. 115 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​.. 160 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది.

Discounts on Maruti Suzuki Dzire : మారుతీ సుజుకీ డిజైర్​:- ఈ మోడల్​పై రూ. 40వల వరకు ఆఫర్స్​ ఇస్తోంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ. ఇది ఇండియాలోనే టాప్​ బెస్ట్​ సెల్లింగ్​ కారు. ఇందులో 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​, 1.2 లీటర్​ సీఎన్​జీ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

హోండా అమేజ్​:- ఇదొక కాంపాక్ట్​ సెడాన్​. ఇందులోని 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​.. 90 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. ఇది.. మారుతీ సుజుకీ డిజైర్​కి గట్టి పోటీనిస్తుంది. ఈ మోడల్​పై రూ. 70వేల వరకు ఆఫర్స్​ ఉండటం విశేషం.

Discounts on Honda City : హోండా సిటీ:- హోండా సంస్థకు బెస్ట్​ సెల్లింగ్​ సెడాన్​ ఈ సిటీ. ఇందులోని పెట్రోల్​ వేరియంట్​పై రూ. 90వేల వరకు ఆఫర్స్​ ఇస్తోంది సంస్థ. ఇందులోని 1.5 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​.. 121 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. ఫ్యుయెల్​ ఎఫీషియెంట్​ స్ట్రాంగ్​ హైబ్రీడ్​ పెట్రోల్​ ఇంజిన్​ కూడా ఉంది. ఇది 126హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది.

స్కోడా స్లావియా:- హోండా సిటీ, వెర్నాకు గట్టిపోటీనిస్తున్న ఈ స్కోడా స్లావియాపై ఈ పండుగ సీజన్​లో రూ. 75వేల వరకు ఆఫర్స్​ ఉన్నాయి. ఇందులోని 1.0 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​.. 110 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది .1.5 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​.. 150 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది.

Festival offers on Sedan cars : వోక్స్​వ్యాగన్​ వర్టూస్​:- ఈ మోడల్​పై ఈ నెల 30 వరకు రూ. 80వేల డిస్కౌంట్స్​ ఉన్నాయి. ఈ మోడల్​.. స్కోడా స్లావియాను పోలి ఉంటుంది. టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఇందులో ఉంటుంది.

(గమనిక:- పైన చెప్పిన ఆఫర్స్​, డిస్కౌంట్స్​ అనేవి ప్రాంతం, షోరూమ్​ బట్టి మారే అవకాశం ఉంది. అందుకే మీరు మీ సమీప డీలర్​షిప్​షోరూమ్స్​కి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.)

తదుపరి వ్యాసం