Skoda Kodiaq: స్టన్నింగ్ డిజైన్ తో స్కోడా కోడియాక్.. ఇవే అప్ డేటెడ్ ఫీచర్స్
- Skoda Kodiaq: మరింత స్టైలిష్ గా, స్టన్నింగ్ లుక్స్ తో స్కోడా కుషాక్ అప్ డేటెడ్ వర్షన్ మార్కట్లోకి వస్తోంది. ఎస్ యూ వీ సెగ్మెంట్లో ఇది ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది.
- Skoda Kodiaq: మరింత స్టైలిష్ గా, స్టన్నింగ్ లుక్స్ తో స్కోడా కుషాక్ అప్ డేటెడ్ వర్షన్ మార్కట్లోకి వస్తోంది. ఎస్ యూ వీ సెగ్మెంట్లో ఇది ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది.
(1 / 6)
సెకండ్ జనరేషన్ కోడియాక్ ను స్కోడా ఆవిష్కరించింది. ఇది మిడ్ సైజ్ ఎస్ యూ వీ. ఇప్పటికే మార్కెట్లో ఉన్న కోడియాక్ కన్నా ఇది కొంత పొడవుగా ఉంటుంది.
(2 / 6)
ఇప్పటికే మార్కెట్లో ఉన్న కోడియాక్ కన్నా ఇది 61 ఎంఎం ఎక్కువ పొడవుగా ఉంటుంది. కానీ, ఎత్తు 17 ఎంఎం, వెడల్పు 18 ఎంఎం తగ్గించారు. మొత్తంగా ఈ కొడియాక్ 4,758 ఎంఎం పొడవు, 1,864 ఎంఎం, వెడల్పు, 1,659 ఎంఎం ఎత్తు ఉంటుంది.
(3 / 6)
ఇందులో డ్యుయల్ బీమ్ హెడ్ ఎల్ఈడీ ల్యాంప్స్, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, అప్ డేటెడ్ రేడియేటర్ గ్రిల్ మొదలైనవి ఉన్నాయి. అలాయ్ వీల్స్ కూడా కొత్త డిజైన్ లో ఉంటాయి.
(4 / 6)
కారు రియర్ ప్రొఫైల్ లో కూడా మార్పులు చేశారు. సీ టైప్ ఎల్ ఈ డీ టెయిల్ లైట్స్ ను అమర్చారు. రూఫ్ స్పాయిలర్ లో కూడా ఆకర్షణీయంగా డిజైన్ చేశారు.
(5 / 6)
స్కోడా కొడియాక్ ఇంటీరియర్స్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 10 ఇంచ్ ల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 10 ఇంచ్ ల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ క్లస్టర్ లను అమర్చారు.
ఇతర గ్యాలరీలు