తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Home Loan Interest Rates: గృహ రుణాలపై టాప్ 5 బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇవే

Home loan interest rates: గృహ రుణాలపై టాప్ 5 బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇవే

HT Telugu Desk HT Telugu

20 February 2024, 18:48 IST

  • Home loan interest rates: గృహ రుణం తీసుకునే ముందు, రుణగ్రహీతలు వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను పోల్చుకుంటారు. చాలా బ్యాంకులు సాధారణంగా 9-11 శాతం మధ్య వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి, అయితే, క్రెడిట్ స్కోర్ మరియు తీసుకున్న రుణ మొత్తం ఆధారంగా రేటు మారుతుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇల్లు, లేదా ఫ్లాట్ కొనుగోలు చేసేవారిలో దాదాపు అందరూ హోం లోన్ తీసుకుంటారు. వివిధ బ్యాంక్ లు, ఫైనాన్స్ సంస్థలు గృహ రుణాలు తీసుకుంటూ ఉంటారు. ఈ గృహ రుణాలపై వివిధ బ్యాంక్ లు వివిధ వడ్డీ రేట్లను వసూలు చేస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ తో పాటు తీసుకున్న రుణ మొత్తం ఆధారంగా ఈ వడ్డీ రేటులో మార్పులు ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

Tesla in India : ఇండియాలో ఎంట్రీపై టెస్లా మౌనం.. ఎలాన్​ మస్క్​కి ఇంకేం కావాలో!

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్

ఆదాయ వనరుగా శాలరీ ఉన్నవారికి, స్వయం ఉపాధి తో ఆదాయం పొందేవారికి గృహ రుణాలపై హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ 8.55 శాతం నుండి 9.10 శాతం వరకు వార్షిక వడ్డీ రేటును వసూలు చేస్తుంది. వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ప్రామాణిక గృహ రుణ రేట్లు 8.9 నుంచి 9.60 శాతం మధ్య ఉన్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్

ఐసీఐసీఐ బ్యాంక్ హోం లోన్స్ పై 800 క్రెడిట్ స్కోర్ ఉన్న రుణ గ్రహీతల నుంచి 9 శాతం, 750-800 మధ్య క్రెడిట్ స్కోర్ ఉన్న వారి నుంచి 9.10 శాతం(స్వయం ఉపాధి కోసం), 9 శాతం (వేతన జీవులకు) వడ్డీ రేటును వసూలు చేస్తుంది. ఫిబ్రవరి 29, 2024 వరకు ఈ ప్రత్యేక రేట్లు చెల్లుబాటు అవుతాయి. ప్రామాణిక గృహ రుణ రేట్లు రుణ మొత్తాన్ని బట్టి 9.25 శాతం నుండి 9.90 శాతం (వేతన జీవులకు), స్వయం ఉపాధి రుణగ్రహీతలకు 9.40 శాతం నుండి 10.05 శాతం మధ్య ఉంటాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా

కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇంటి రుణాలపై ఉద్యోగస్తుల నుండి 8.70 శాతం, స్వయం ఉపాధి వ్యక్తుల నుండి 8.75 శాతం వసూలు చేస్తుంది. మరోవైపు, బ్యాంక్ ఆఫ్ బరోడా హోం లోన్స్ పై వేతన జీవులకు 8.40 శాతం నుండి 10.60 శాతం మధ్య వడ్డీని తీసుకుంటుంది. స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందేవారికి కూడా అదే వడ్డీ రేటును అందిస్తుంది. అయితే, ఇది ప్రస్తుతం ఫ్లెక్సిబుల్ వడ్డీ రేటు. వేతన రుణగ్రహీతలకు అందించే స్థిర వడ్డీ రేటు 10.15 నుండి 11.50 శాతం వరకు ఉంటుంది. వేతనం లేని వారికి 10.25 నుంచి 11.60 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్

ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ రుణ మొత్తం, క్రెడిట్ స్కోర్, ఎల్టీవీ (లోన్ టు వాల్యూ) నిష్పత్తి ఆధారంగా రుణగ్రహీతలకు 9.40 శాతం నుండి 11.10 శాతం మధ్య వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తుంది. ఉదాహరణకు, ఎల్టీవీ 80 శాతం కంటే తక్కువ లేదా సమానంగా ఉన్నప్పుడు, క్రెడిట్ స్కోరు 800 కంటే ఎక్కువగా ఉంటే, వడ్డీ రేటు 10 సంవత్సరాల కాలపరిమితికి 9.40 శాతం, ఎక్కువ కాలపరిమితికి 9.90 శాతం ఉంటుంది. ఎల్టీవీ నిష్పత్తి పెరిగి క్రెడిట్ స్కోర్ తగ్గుతున్న కొద్దీ వడ్డీ రేటు పెరుగుతుంది.

తదుపరి వ్యాసం