తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero New Bike : హీరో నుంచి కొత్త బైక్​.. లాంచ్​ ఎప్పుడంటే!

Hero new bike : హీరో నుంచి కొత్త బైక్​.. లాంచ్​ ఎప్పుడంటే!

Sharath Chitturi HT Telugu

31 December 2023, 18:20 IST

    • Hero new bike :  హీరో సంస్థ నుంచి కొత్త బైక్​ లాంచ్​కు సిద్ధమవుతోంది. ఆ వివరాలు..
హీరో నుంచి కొత్త బైక్​.. లాంచ్​ ఎప్పుడంటే!
హీరో నుంచి కొత్త బైక్​.. లాంచ్​ ఎప్పుడంటే! (Representative Image)

హీరో నుంచి కొత్త బైక్​.. లాంచ్​ ఎప్పుడంటే!

Hero new bike launch : 2024లోకి గ్రాండ్​ ఎంట్రీ ఇచ్చేందుకు ఆటోమొబైల్​ సంస్థలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇప్పుడు.. ఈ జాబితాలోకి దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హీరో మోటోకార్ప్​ కూడా చేరింది. 2024 జనవరిలో.. ఓ కొత్త బైక్​ని లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదొక 440సీసీ బైక్​ అని, ఇది జనవరి 22న లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటి వరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

హీరో మోటోకార్ప్​ కొత్త బైక్​..

ఈ హీరో మోటోకార్ప్​ కొత్త బైక్​ పేరు ఇంకా రివీల్​ అవ్వలేదు. కాకపోతే.. కంఫర్ట్​, బోల్డ్​ ఎపియరెన్స్​, కమాండింగ్​ పొజీషన్​ని దృష్టిలో పెట్టుకుని సంస్థ ఈ వెహికిల్​ని తయారు చేస్తోందని సమాచారం.

Hero new 440 cc bike launch : ఈ హీరో కొత్త 440 సీసీ బైక్​ డిజైన్​.. యమహా ఎంటీ-01, హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440ని పోలి ఉండొచ్చని టాక్​ నడుస్తోంది. ఇదే నిజమైతే.. ఈ బైక్​ ఒక పర్ఫెక్ట్​ రోడ్​స్టర్​ అవ్వడం ఖాయమని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

అంతేకాకుండా.. ఈ కొత్త బైక్​ని హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​ 440ని రూపొందించిన ప్లాట్​ఫామ్​పైనే రెడీ చేస్తోంది హీరో మోటోకార్ప్​. ఇందులో 440 సీసీ, సింగిల్​ సిలిండర్​, ఎయిర్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది.. 27 హెచ్​పీ పవర్​ని, 38 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉండనుంది.

Hero new 440 cc bike : హీరో కొత్త బైక్​ పేరుతో పాటు ధరకు సంబంధించిన వివరాలపై ఇంకా ఎలాంటి సమాచారం అందుబాటులోకి రాలేదు. వీటిని సంస్థ సీక్రెట్​గా ఉంచుతుండటంతో, మార్కెట్​లో ఈ మోడల్​పై అంచనాలు మరింత పెరిగాయి. అయితే.. ఈ హీరో కొత్త 440సీసీ బైక్​ ఎక్స్​షోరూం ధర రూ. 2లక్షలకు అటు ఇటుగా ఉంటుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

మరి ఈ హీరో బైక్​ పేరు, ఫీచర్స్​, ధర వంటి వివరాలపై క్లారిటీ రావాలంటే.. 2024 జనవరి 22 లాంచ్​ ఈవెంట్​ వరకు ఎదురుచూడాల్సిందే!

బైక్​ లవర్స్​కు పండుగే..!

2024లో పలు క్రేజీ బైక్స్​ లాంచ్​కు సిద్ధమవుతున్నాయి. మరీ ముఖ్యంగా రాయల్​ ఎన్​ఫీల్డ్​ నుంచి రెండు కొత్త బైక్స్​ రెడీ అవుతున్నాయి. ఈ వార్త విని.. బైక్​ లవర్స్​ థ్రిల్​ అవుతున్నారు.

ప్రస్తుతం వార్తల్లో ఉన్న బైక్​.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350కి బాబర్ వర్షెన్​లా ఉంటుందని తెలుస్తోంది. అయితే.. ఈ బైక్​ ప్రత్యేకంగా బయటకొస్తుందా? లేదా.. క్లాసిక్​ 350లో ఒక వేరియంట్​గా ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం