Royal Enfield new bike : రాయల్​ ఎన్​ఫీల్డ్​ నుంచి సరికొత్త 350 సీసీ బైక్​..​!-royal enfield classic 350 bobber coming soon new trademark suggests it ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Royal Enfield New Bike : రాయల్​ ఎన్​ఫీల్డ్​ నుంచి సరికొత్త 350 సీసీ బైక్​..​!

Royal Enfield new bike : రాయల్​ ఎన్​ఫీల్డ్​ నుంచి సరికొత్త 350 సీసీ బైక్​..​!

Sharath Chitturi HT Telugu

Royal Enfield new bike : రాయల్​ ఎన్​ఫీల్డ్​ సంస్థ కొత్త బైక్​ని సిద్ధం చేస్తోంది! ఇది.. క్లాసిక్​ 350 బాబర్​ అని తెలుస్తోంది.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ నుంచి సరికొత్త 350 సీసీ బైక్​..

Royal Enfield new bike : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని 2 వీలర్​ బైక్​ సెగ్మెంట్​లో ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు భారీగా ప్రణాళికలు రచించింది రాయల్​ ఎన్​ఫీల్డ్​ సంస్థ. ఈ నేపథ్యంలో.. పలు కొత్త మోడల్స్​ని సిద్ధం చేస్తోంది. వీటిల్లో ఒకటైన.. షాట్​గన్​ 650ని ఇటీవలే రివీల్​ చేసింది. ఇక ఇప్పుడు.. రాయల్​ ఎన్​ఫీల్డ్​కు సంబంధించిన ఓ క్రేజీ వార్త బయటకొచ్చింది. సరికొత్త 350 సీసీ బైక్​ని సంస్థ తయారు చేస్తోందట. ఈ మేరకు.. 'గోవాన్​ క్లాసిక్​ 350' అనే పేరును ట్రేడ్​మార్క్​ చేసి పెట్టుకుందట! ఈ నేపథ్యంలో ఈ బైక్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​..

ప్రస్తుతం వార్తల్లో ఉన్న బైక్​.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350కి బాబర్ వర్షెన్​లా ఉంటుందని తెలుస్తోంది. అయితే.. ఈ బైక్​ ప్రత్యేకంగా బయటకొస్తుందా? లేదా.. క్లాసిక్​ 350లో ఒక వేరియంట్​గా ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.

Royal Enfield Classic 350 Bobber : రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త 350 సీసీ బైక్​కి సంబంధించిన స్పై షాట్స్​ ఆన్​లైన్​లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులోని కాస్మొటిక్స్​.. క్లాసిక్​ 350 బైక్​ని పోలి ఉన్నాయి. అయితే.. కొన్ని, కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​, బాబర్​ స్టైల్​ సీట్​, రీవ్యాంప్డ్​ టెయిల్​ ల్యాంప్​, కొత్త ఎల్​ఈడీ టర్న్​ ఇండికేటర్స్​ వంటివి లభిస్తున్నాయి.

క్లాసిక్​ 350ని పోలి ఉంది కాబట్టి.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​ ఫ్రెంట్​లో టెలిస్కోపిక్​ ఫోర్క్స్​, రేర్​లో ట్విన్​ షాక్​ అబ్సార్బర్స్​ వంటివి ఉడొచ్చు. ఫ్రెంట్​, రేర్​ వీల్స్​కి డిస్క్​ బ్రేక్స్​ వచ్చే అవకాశం ఉంది. డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​ కూడా లభిస్తుందట.

Royal Enfield 350 CC bike news : రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350 బైక్​లో 349 సీసీ, ఎయిర్​- ఆయిల్​ కూల్డ్​, సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 20 బీహెచ్​పీ పవర్​ని, 27 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇక కొత్త బైక్​లో కూడా ఇదే ఇంజిన్​ ఉండే అవకాశాలు ఎక్కువ!

ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త 350 సీసీ మోడల్​కు చెందిన ఇతర ఫీచర్స్​, లాంచ్​ డేట్​, ధర వంటి వివరాలపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత కథనం