Aprilia RS 457: డిసెంబర్ 15 నుంచి అప్రీలియా ఆర్ఎస్ 457 బుకింగ్స్; బైక్ ధర 4 లక్షల పైనే..
Aprilia RS 457: ఎట్టకేలకు అప్రీలియా ఆర్ఎస్ 457 బైక్ ను పియాజియో సంస్థ భారత్ లో లాంచ్ చేసింది. ఇండియా బైక్ వీక్ 2023 సందర్భంగా ఈ బైక్ ను పరిచయం చేసింది.

Aprilia RS 457 price: పియాజియో ఇండియా సంస్థ ఎట్టకేలకు భారత్ లో తమ ఫ్లాగ్ షిప్ మోడల్ బైక్ అప్రీలియా ఆర్ఎస్ 457 ను లాంచ్ చేసింది. ఈ బైక్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 4.10 లక్షలుగా నిర్ణయించింది. దీన్ని కేవలం అప్రీలియాకు చెందిన మోటోప్లెక్స్ డీలర్ షిప్ ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
Aprilia RS 457 bookings: డిసెంబర్ 15 నుంచి
అప్రీలియా ఆర్ఎస్ 457 బైక్ బుకింగ్స్ డిసెంబర్ 15 నుంచి ప్రారంభమవుతాయి. ఆసక్తి ఉన్న వారు రూ. రూ. 10,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ బైక్ (Aprilia RS 457) ను బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్ డెలివరీస్ మార్చి 2024లో ప్రారంభమవుతాయి. ఇది కవాసకి నింజా 400, కేటీఎం ఆర్సీ 390, త్వరలో మార్కెట్లోకి రాబోయే యమహా R3 బైక్స్ తో పోటీ పడుతుంది. అప్రిలియా RS 457 బైక్ RS 660 తరహాలోనే ఉంటుంది. ఇందులో LED డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. ఇది పూర్తి స్థాయిలో స్పోర్ట్స్ బైక్.కాబట్టి ఫుల్ ఫెయిరింగ్, క్లిప్-ఆన్‌ల సెట్, వెనుక సెట్ ఫుట్‌పెగ్స్ ఉన్నాయి. ఈ మోటార్‌సైకిల్ చాలా ప్రీమియం లుక్ తో కనిపిస్తోంది.
Aprilia RS 457 features: ఇతర ఫీచర్స్
అప్రిలియా RS 457లో రైడ్-బై-వైర్ థ్రాటిల్, LED లైటింగ్, మూడు స్థాయిల రైడింగ్ మోడ్‌లు, మూడు స్థాయిల ట్రాక్షన్ కంట్రోల్ సెట్టింగ్‌లు ఉన్నాయి. అలాగే, ఇందులో 5-అంగుళాల TFT స్క్రీన్ కూడా ఉంది, ఇది రైడర్‌కు అన్ని ముఖ్యమైన సమాచారాలను చూపుతుంది. ఈ బైక్ ను ఇటలీలో డిజైన్ చేశారు. దీనిని భారతదేశంలోని బారామతిలో ఉన్న పియాజియో ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు.
Aprilia RS 457 engine: ఇంజన్
అప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ లో సరికొత్త 457 cc, లిక్విడ్-కూల్డ్, DOHC, ప్యారలల్-ట్విన్ ఇంజన్‌ని అమర్చారు. ఇది 47 bhp, 46 Nm గరిష్ట టార్క్‌ను అందించగలదు. ఇందులో 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఉంది. ఈ మోటార్‌సైకిల్‌కు ట్విన్-స్పార్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంది. ముందు భాగంలో అప్-సైడ్ డౌన్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్స్ ఉన్నాయి. అలాగే, ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్ అమర్చారు. డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది.