తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Karizma Xmr 210 : హీరో కొత్త బైక్​ లాంచ్​.. కరిష్మా ఎక్స్​ఎంఆర్​ 210 ఎలా ఉందంటే..

Hero Karizma XMR 210 : హీరో కొత్త బైక్​ లాంచ్​.. కరిష్మా ఎక్స్​ఎంఆర్​ 210 ఎలా ఉందంటే..

Sharath Chitturi HT Telugu

29 August 2023, 13:29 IST

    • Hero Karizma XMR 210 : హీరో కరిష్మా ఎక్స్​ఎంఆర్​ 210 లాంచ్​ అయ్యింది. ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
హీరో కొత్త బైక్​పై హృతిక్​ రోషన్​..
హీరో కొత్త బైక్​పై హృతిక్​ రోషన్​.. (HT AUTO)

హీరో కొత్త బైక్​పై హృతిక్​ రోషన్​..

Hero Karizma XMR 210 launch : ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ హీరో మోటోకార్ప్​.. ఇండియా మార్కెట్​లోకి సరికొత్త బైక్​ను లాంచ్​ చేసింది. దీని పేరు హీరో కరిష్మా ఎక్స్​ఎంఆర్​ 210. ఈ నేపథ్యంలో ఈ బైక్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Royal Enfield Guerrilla 450 : అదిరిపోయేలా.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​- లాంచ్​ ఎప్పుడు?

కొత్త బైక్​ ఫీచర్స్​ ఇవే..!

హీరో కరిష్మా ఎక్స్​ఎంఆర్​ డిజైన్​ అట్రాక్టివ్​గా ఉందని చెప్పుకోవాలి. ఇందులో వైడ్​ హ్యాండిల్​ల్యాంప్​, ట్విన్​ ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​, అలాయ్​ వీల్స్​, విజర్​, స్ల్పిట్​ సీట్​, ఎక్స్​ఎంఆర్​ బ్యాడ్జింగ్​ వంటివి వస్తున్నాయి.

ఈ కొత్త బైక్​లో 210సీసీ లిక్విడ్​ కూల్డ్​, సింగిల్​ సిలిండర్ డీఓహెచ్​సీ 4వీ​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 25.5 హేచ్​పీ పవర్​ను, 20.4 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 6 స్పీడ్​ గేర్​బాక్స్​ దీని సొంతం. మూడు రంగుల్లో ఈ బైక్​ అందుబాటులోకి రానుంది. అవి.. బ్లాక్​, యెల్లో, రెడ్​

Hero Karizma XMR features : ఈ 2 వీలర్​లో 6 స్టెప్​ మోనోషాక్​ సస్పెన్షన్​, ఎల్​సీడీ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, బ్లూటూత్​, టర్న్​-బై-టర్న్​ నేవిగేషన్​, అడ్జెస్టెబుల్​ విండ్​షీల్డ్​, స్లిప్​ అండ్​ అసిస్ట్​ క్లచ్​లు వంటివి వస్తున్నాయి.

"మూడు నెలల్లో కంపెనీ నుంచి వస్తున్న మూడో ప్రీమియం మోడల్​ ఈ హీరో కరిష్మా ఎక్స్​ఎంఆర్​ 210. దీనికి మంచి డిమాండ్​ లభిస్తుందని నమ్మకం ఉంది. యువతను అట్రాక్ట్​ చేసే విధంగా దీనిని రూపొందించాము. రానున్న రోజుల్లో మరిన్ని మోడల్స్​ను లాంచ్​ చేస్తాము," అని కొత్త బైక్​ లాంచ్​ ఈవెంట్​లో సంస్థ సీఈఓ నిరంజన్​ గుప్త వ్యాఖ్యానించారు.

ధర ఎంతంటే..

Hero Karizma XMR price in India : హీరో కరిష్మా ఎక్స్​ఎంఆర్​ ఇంట్రొడక్టరీ ప్రైజ్​ రూ. 1.73లక్షలుగా ఉంది. వాస్తవానికి ఈ ధర రూ. 2.3లక్షలు- రూ. 2.5లక్షల మధ్యలో ఉంటుందని మర్కెట్​ వర్గాలు అంచనా వేశాయి. ఇక ఈ మోడల్​ బుకింగ్స్​ మంగళవారం ఓపెన్​ అయ్యాయి.

ఇంట్రొడక్టరీ ఆఫర్​ ముగిసిన తర్వాత.. ఈ బైక్​ ఎక్స్​షోరూం ధర రూ. 2లక్షల వరకు వెళ్లొచ్చు. కాగా.. ఇప్పటివరకు సంస్థ నుంచి వచ్చిన ప్రీమియం బైక్స్​లో అత్యంత ఎక్కువ ధర కలిగిన బైక్​గా ఈ మోడల్​ నిలిచిపోనుంది.

ది బెస్ట్​ బైక్​ ఇదే : హృతిక్​ రోషన్​..

హీరో కరిష్మా ఎక్స్​ఎంఆర్​ 210కు బ్రాండ్​ అంబాసిడర్​గా ఉన్న ప్రముఖ సినీ నటుడు హృతిక్​ రోషన్​.. ఈవెంట్​ స్టేజ్​పైకి బైక్​పై వచ్చారు. ఈ బైక్​ మీద రైడ్​ చాలా బాగుందని, మరే ఇతర బైక్​ కూడా దీనికి పోటీరాదని అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో.. 'ఇతర బైక్స్​తో పోల్చుకుంటే, ఈ బైక్​ హృతిక్​ రోషన్​ లాంటిది,’ అని అన్నారు నిరంజన్​ గుప్త.

తదుపరి వ్యాసం